Sunday, March 2, 2025

 *_'కష్టం'... మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది... దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు..._*

*_'కోపం '...ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది... ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు కానీ అది చేసే నష్టం జీవితకాలం._*

*_'జీవితం'...ఒక రైలు ప్రయాణం లాంటిది... మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ప్రయాణం ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే... మనకోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిస్తూ ఉంటుంది..._*

*_కోపం, కష్టం, జీవితం మూడూ మనవే కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు... మన మాట ఎప్పుడూ వినవు మనకు చెప్పిరావు... కాబట్టి ఈ మూడింటితో జాగ్రత్త..._*

*_జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తులను మరిచిపోకండి.!!_*

*_మొదటి వ్యక్తి :- నిన్ను గెలిపించడానికిని కోసం అన్ని కోల్పోయిన మీ నాన్న._*

*_రెండో వ్యక్తి :- నీ ప్రతి సమస్యలో ఎల్లప్పుడూ నీ తోడుంటే మీ అమ్మ._*

*_మూడో వ్యక్తి :- నీ మనస్సులో ఉన్న భావాన్ని పంచుకోవడానికి నీ ప్రాణ స్నేహితుడు._*

*_ఈ ముగ్గురు వ్యక్తులు నీ జీవితంలో నువ్వు సంపాదించుకో లేదనప్పుడు నీ దగ్గర ఎంతధనమున్నా నువ్వు ఎవరైనా నీ జీవితం వృధానే..._*

*_కాబట్టి ఆస్తులు, అంతస్తులు కాదు మనుషులను సంపాదించుకో ఈ రోజు నీకు అనిపించచ్చు నాకెవ్వరు అవసరం లేదు డబ్బుంటే చాలని..._*

*_కానీ, ఏదో ఒక రోజు తెలిసి వస్తుంది నువ్వేమి కోల్పోయావో అని... ఉన్నప్పుడే కాపాడుకో పోయిన తర్వాత ఎంత ఏడ్చినా తిరిగిరారు... కాస్త ఆలోచించు మిత్రమా...☝️_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🪷🌹🪷 🌺🙇🌺 🪷🌹🪷

No comments:

Post a Comment