Sunday, March 2, 2025

 *_జీవితంలో పట్టువిడుపులు అనేవి ఉండాలి ఎలా ఐతే మన గుండె రక్తాన్ని పట్టుకొని వదిలేస్తదో అలాగే మనం కూడా పట్టుకొని వదిలేయాలి..._*

*_గుండె వదలను అంటే ప్రాణం పోతుంది అలాగే మూర్ఖత్వం వదలను అంటే జీవితమే పోతుంది నువ్వు ఎవరి విషయంలోనైనా ఇలాగే ప్రవర్తిస్తే నువ్వు అందరికి దూరమైపోతావు._*

*_ఎవరికి రావు కోపాలు.? ఆ కోపాలతో దూరాలు పెంచుకుంటే ప్రేమని చూడలేం అలాగే మనకి కనీళ్ళు వచ్చేది ఆ కోపాల్ని కడిగేయడానికే..._*

*_కాబట్టి ఎక్కడ తగ్గాలో కొంచెం తెలుసుకుంటే బంధాలు నిలబడతాయి లేదా కోల్పోతాయి... కోల్పోయిన బంధాలని తిరిగి తెచ్చుకోవాలంటే నీ జీవితం సరిపోదు..._*

*_అలాగే ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలీకుండా పట్టువిడుపులు లేకుండా అంతా నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బతుకుతానని మొండిగా, మూర్ఖంగా ఉండే వ్యక్తులు మన ఇంట్లోనో, బంధువుల్లోనో, స్నేహితుల్లోనో లేదా మన చుట్టుపక్కలో ఉంటూనే ఉంటారు._*

*_ఇలాంటివాళ్ళ వల్ల వాళ్ళతో ఉన్నవాళ్ళే ఎక్కువ నష్టపోతారు. పోనీ వాళ్ళకు నచ్చినట్టు బతుకుదామనుకున్నప్పుడు సోలోగా అయినా ఉండరు. అందరి జీవితాల్ని వాళ్ళకు నచ్చినట్టు నిర్దేశిస్తారు._*

*_కాబట్టి దయచేసి జీవితంలో మూర్కత్వంతో సరిదిద్దుకోలేని తప్పులు మాత్రం చేయద్దు అలా చేస్తే మిగిలేదీ భరించలేని గుర్తు చేసుకునే జ్ఞాపకాలే జాగ్రత్త మిత్రమా...☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🌺🌺 🌹🙇🌹 🌺🌺🌺

No comments:

Post a Comment