బ్రాహ్మణ్యం పోతే హిందూ ధర్మం కూడా పోతుంది అని నేను నమ్మడానికి, నాకు ప్రత్యేకించి బ్రాహ్మణుల పట్ల అభిమానం ఉండటం కారణం మాత్రమే కాదు. నాకు హిందువులు అందరూ ఒక్కటే. ఈ నమ్మకం కేవలం నేను వాస్తవం అని నమ్మిన కొన్ని విషయాల మీద ఆధారపడింది మాత్రమే.
నా కారణాలు
1. హిందూ ధర్మానికి మూలం అయిన వేద అధ్యయనం, పౌరోహిత్యం, యజ్ఞ/యాగాల నిర్వహణ, హైంధవ ధర్మ ప్రవచనం ఇలా దాదాపు అన్నీ నేటికీ ఎక్కువ శాతం బ్రాహ్మణుల చేతుల్లోనే ఉన్నాయి. అలా ఎందుకు ఉండాలి, అది వివక్ష అనే చర్చలోకి నేను వెళ్లదలుచుకోవడం లేదు. కారణం ఏమైనా అదే నిజం. బ్రాహ్మణ్యం పోతే ఇవన్నీ పోతాయు, ఇవి పోతే హిందూ ధర్మమూ పోతుంది.
2. గత వెయ్యి సంవత్సరాలుగా హిందువుల మీద జరిగిన దాడిలో ఎడారి మతోన్మాదులది వారి మతానిది చాలా కీలకమైన పాత్ర. ఇంతకాలం పాటు హిందూ ధర్మానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాల మీదా దాడి జరిగినా, బ్రాహ్మణ వృత్తుల వలన ఆర్ధికంగా కూడా పెద్దగా లాభం లేకపోయినా హైంధవ ధర్మం పైన అభిమానం గౌరవంతో ఎందరో బ్రాహ్మణులు వాటిని కాపాడుకుంటూ వచ్చారు. వాటి బాధ్యత అందరిదీ అంటే బహుశా బ్రాహ్మణ వృత్తులు, వాటితో పాటు హిందూ ధర్మం నాశనం అయిపోయేది.....
3. ఈ బ్రాహ్మణ విద్యలను అందరికీ నేర్పడం కూడా అంత సులభం కాదు. కారణం ఇవి సరిగ్గా నిర్వహించాలి అంటే కేవలం ఆ వ్యక్తి మాత్రం నియమంగా ఉంటే సరిపోదు, పూర్తి కుటుంబం నియమంగా ఉండాలి. భర్త గుడిలో అర్చకత్వం చేస్తాడు, భార్య మాత్రం పది గంటలకి లేచి స్నానం కూడా చెయ్యకుండా వంట చేసి, చికెన్లు, మటన్లు తింటాను అంటే కుదరదు. అయితే అది అసాధ్యం కూడా కాదు. దేశంలో బ్రాహ్మణులు కానీ వారు వేలు లక్షల మంది చాలా దేవాలయాలలో పూజారులుగా ఉన్నారు. అయితే వారి కుటుంబం మొత్తం నియమాలు పాటిస్తారు. దానిని మన పూర్వీకులు ఎలా సాధించారో తెలియదు. తెలుసుకుని ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలి. మన తెలుగు రాష్ట్రాలలోని ఒక స్వామీజీ SC వర్గీయులకు కొన్ని వేల మందికి ప్రవచనం మీద శిక్షణ ఇస్తున్నారు. విశ్వకర్మీయులు పద్మశాలి కులస్థులు చాలా మంది వేద విధ్య అభ్యసించి పూజారులుగా స్ధిర పడుతున్నారు, మాల మాదిగ కులాల వారు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం మరియు చిన జియర్ స్వామి సంస్థల ఆధ్వర్యంలో అర్చక విధ్య నేర్చుకుని పూజారులుగా కొనసాగుతున్నారు.....
4. మోనియర్ విలియమ్స్, రాబర్ట్ క్లాడ్వెల్ వంటి క్రైస్తవ మిషనరీలు, వారికి సహకరించేవారు ఎందరో హిందువులను మతం మార్చడానికి ప్రధాన అడ్డంకి బ్రాహ్మణులే అని అభిప్రాయపడ్డారు. ఆ కారణం వల్లనే మిషనరీలు సృష్టించిన ఆర్యన్ సిద్ధాంతంలో బ్రాహ్మణ ద్వేషాన్ని చాలా కీలకం చేశారు.....
5. క్రైస్తవం/ఇస్లాంలు అడుగుపెట్టిన చాలా దేశాలలో స్థానిక నాగరికతలూ సంస్కృతి సాంప్రదాయాలు నాశనం అయిపోతాయి. ఒక భారత/హిందూ నాగరికత మాత్రమే ఎడారి మతోన్మాదుల దాడుల నుంచి తట్టుకుని ఇప్పటికీ మిగిలింది అంటే దానికి కారణం బ్రహ్మానుల కృషి మరియు హైంధవ ధర్మ పరిరక్షణ కోసం బ్రహ్మాన కుటుంబాలు వంశపారంపర్యంగా నిరంతరం పనిచేయడం మాత్రమే. బ్రాహ్మణ వ్యవస్థ వంటి వ్యవస్థ మనదేశంలో తప్పా ఎక్కడా లేకపోవడం గమనార్హం. పైన చెప్పిన ఇతర కారణాలు కూడా ఉన్నాయి కనుక, ఇది కేవలం యాదృచ్చికం అనలేము.....
6. నిజంగా బ్రాహ్మణ్యం హిందూ ధర్మానికి బలం కనుక హైంధవ ధర్మాన్ని నాశనం చేసేందుకు హిందూ ధర్మ ద్వేషులు ముస్లిం కృిస్టియన్ మతోన్మాదులు కమ్యూనిస్టు ఉన్మాదులు సెక్యులర్ రాజకీయులు వందల సంవత్సరాలుగా బ్రాహ్మణ్యాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు.....
Sekarana
No comments:
Post a Comment