Tuesday, April 8, 2025

 భార్యాభర్తలు నీళ్లు పాలవలె కలిసి పోయే సారూప్యం.
 పదిమందిలో మసలుతున్నా ఒకరి మనసులో మరొకరు కలిసి ఉంటారు. అది ఆర్థనారీశ్వర తత్వం. బరువు బాధ్యతలు పంచుకుంటూ సంసారం ఆనందమయంగా తీర్చిదిద్దుకునే జంట చూడముచ్చటైనది. తాము కలలు కన్న సంసార జీవితాన్ని చివరి వరకూ సాకారం చేసుకోవడం దంపతులకు నిజమైన వ్రత దీక్ష... వియోగం కలిగినా అనుక్షణం ఒకరి స్మృతిలో మరొకరు జీవించిన సీతారాములదే ఆదర్శ దాంపత్య బందం. ధన్యవాదాలు..🙏
" మీ అపర్ణ గోపినాయుడు యాస "

No comments:

Post a Comment