Tuesday, April 8, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
            *ఎక్కడ ప్రశాంతత?*

*మానవ జీవితం పుట్టుక మొదలుకొని మరణం వరకు నిత్య సంగ్రామంగానే సాగుతుంది. పుట్టిన వెంటనే పసిగుడ్డుకు సైతం ఆకలి బాధ తప్పదు. శైశవదశ దాటే సమయంలో బాలారిష్టాల రూపంలో అనారోగ్యాల కష్టాలు చుట్టుముడతాయి. పెరిగి పెద్దయ్యాక కుటుంబ సమస్యలు ముసురుతాయి. కష్టాల కడలిని దాటేలోగానే ముంచుకొస్తుంది. ఆ తరవాత దైహిక, మానసిక బాధలు వర్ణనాతీతం. ఏ సమస్యా మనిషిని ప్రశాంతంగా ఉండనీయదు. ఒకదాని తరవాత మరొకటిగా కడలి కెరటాల్లా సమస్యలు విరుచుకొని పడుతుంటాయి. వేదాంతులు మానవ సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. కష్టాలను కెరటాలతో సమానంగా భావిస్తారు. సమస్యలు లేని మనిషి ఈ భూ ప్రపంచంలో లేడనేది పరమసత్యం. మనిషి చీకటిని చీల్చుకొని వెలుగుకోసం వెదికినట్లు అశాంతిలో నుంచే ప్రశాంతతను రాబట్టుకోవాలి.* 

*కష్టాలు నిప్పు కణికల్లాంటివి. చల్లదనాన్ని పొందడానికి వాటిలోంచే ప్రత్నించాలి. వేసవికాలంలో సూర్యుడి కారణంగా వేసవి ముగిసిన జల్లులు కురిసే వేసవికి చల్లని వస్తుంది. సూర్యుడే వర్షానికి వర్షాకాలం కారణమైన కారణభూతుడు. సూర్యుడి వేడిమితో సముద్రజలాలు వేడెక్కి ఆవిరి పైకెగసి తరవాతే కదా ఆకాశంలో మేఘాలు కురుస్తాయి. ఉత్పన్నమై వర్షాలు కనుక సమస్యలోనే సమాధానం కూడా ఉంటుందనేది ప్రకృతి చెప్పే ఉపదేశం!*

*మనిషి తనకు తానుగా ఆందోళనలను సృష్టించుకొంటూ అశాంతికి గురవుతుంటాడు. గంధర్వ నగరాలను సృష్టించుకొని పగటికలలు కంటాడు. అందని ద్రాక్షపండ్ల కోసం అర్రులు చాస్తుంటాడు. ఏవో ఊహించుకొని గాలిలో తేలిపోతూ, గాలిమేడలు కడతాడు. వీటివల్లనే మానసిక ప్రశాంతతకు దూరమై అల్లాడుతుంటాడు. తన ఉనికిని మరచిపోతే మనిషికి అశాంతి గాక ప్రకృతి మనిషికి*

*అన్ని వనరులనూ పుష్కలంగా అందించింది. వాటిని రక్షించుకోలేని అసమర్థుడిగా మనిషి మిగిలిపోకూడదు. పంచభూతాలు మనిషి ప్రశాంత ఆధారాలు, వాటిని కలుషితం చేయడం ద్వారా ప్రపంచాన్ని ఒక చెత్తకుండీలా మార్చివేస్తున్నాడు మనిషి చెట్లను విచక్షణారహితంగా నరికివేసిన పాపం, కాలుష్యపు ఉద్గారాలతో ప్రాణవాయువును విషపూరితం చేసిన శాపం మనిషికి మరణశాసనమై ప్రపంచాన్ని పీడిస్తోంది. ధ్వనికాలుష్యం గుండెలను చిద్రం చేస్తుంటే మనిషి ఆరోగ్యం మంటగలిసిపోతోంది. లక్షల ఏళ్లనాటి హిమ ఖండాలు. కరిగిపోతూ, జలప్రళయాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయంటే పుడమిని వేడెక్కించిన మనిషి తప్పిదాల తీవ్రత స్పష్టమవుతుంది. మనిషి తన కుటుంబ జీవనంలోనూ ఎన్నో తప్పటడుగులు వేస్తున్నాడు. పెద్దలపై గౌరవం లేకపోవడం, వ్యక్తుల మధ్య ఆత్మీయతలు దూరం కావడం, పరస్పర స్నేహ సహకార భావాలకు తిలోదకాలివ్వడం... మనిషి ఒంటరిగా మారిపోతున్నాడు. మానవతా బంధాలను*

*బందిఖానాలోకి నెట్టేస్తున్నాడు. సమైక్యజీవనం, సమభావం కొరవడుతున్నాయి. అన్నింటినీ పోగొట్టుకొనే మనిషికి ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది? తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనలోనే నిక్షిప్తమై ఉన్న ప్రసన్నతను, ప్రశాంతతను శోధించి, పట్టుకోవాలి.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴

No comments:

Post a Comment