_(మనసును కదిలించే ఈ కథను ఖచ్చితంగా చదవాల్సిందే )_
*_వింతైన భిక్షాపాత్ర !_*
👽👽👽👽👽👽👽👽
*ఒక భిక్షకుడు రాజు గారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు ఉదయాన్నే!*
*ఆ సమయంలో రాజుగారు ఉదయమే తోటలో విహారానికి వెళతారనీ ఎక్కువ మంది కూడా ఉండక పోవడం వలన తనకు దర్శనం కలుగుతుందనీ అతడి ఆశ. రాజు గారికి ఎదురుపడి నమస్కరించాడు.*
*"ఏమి కావాలి ?" అని అడిగాడు రాజు.*
*"నమస్కారం రాజా🙏 ! మీరు ఏది అడిగినా ఇచ్చేస్తారా ? ఇంకొక్కసారి ఆలోచించుకోండి మహారాజా !" అన్నాడు భిక్షుకుడు.*
*రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఎన్నెన్నో యుద్ధాలు చేసి ఎన్నెన్నో విజయాలు పొంది, ఎంతో కీర్తి గడించిన తను ఒక బిచ్చగాడి కోరికను తీర్చడానికి పునరాలోచించు కోవడమా ?*
*అది ఒక అవమానంగా భావించాడు రాజు.*
*రాజులో అహం తన్నుకు వచ్చింది.*
*"నువ్వు ఏమి అడిగినా పరవాలేదు. నేను ఇచ్చి తీరుతాను. ఇది నా హామీ !" అంటూ బిచ్చగాడిని తన కోరిక చెప్పమన్నాడు.*
*బిచ్చగాడు.. "అయ్యా ! ఇది నా భిక్షాపాత్ర. దీనిని మీరు నింపండి. మీరు దీనిని దేనితో నింపినా పరవాలేదు. కానీ, దీనిని పూర్తిగా నింపండి చాలు. రాజా! మీరు కావాలంటే ఇంకోసారి మళ్ళీ ఆలోచించుకోండి. ఇప్పటికైనా మీరు తప్పుకోవచ్చు" అన్నాడు.*
*అతడి భిక్షాపాత్రను చూశాడు రాజు. నవ్వు వచ్చింది రాజుకి. అది ఒక చిన్న భిక్షాపాత్ర. మంత్రికి కబురు పెట్టాడు.*
*"ఆ పాత్ర నిండా వజ్రాలను నింపి ఇతడిని పంపండి" అని ఆజ్ఞాపించాడు.*
*చిత్రం...!!! అందులో వేసిన వజ్రాలు వేసిన వెంటనే మాయమయిపోయాయి.*
*రాజుకు ఆశ్చర్యం వేసింది. తన కోశాగారంలో ఉన్న బంగారం, వెండి, వరహాలూ అన్నీ వెయ్యమన్నాడు. ఎన్ని వేసినా అన్నీ మాయమయి పోతున్నాయి. పాత్ర మాత్రం నిండటం లేదు.*
*బిచ్చగాడిని సమీపించాడు రాజు..!*
*_“మహానుభావా ! ఇదేమిటి? నీవు ముందుగానే హెచ్చరించావు. అయినా నేను వినలేదు. ఎందుకిలా జరుగుతోంది. ఎంత సంపద అందులో వేసినా ఎందుకు అది నిండటం లేదు? ఇలా ఎందుకు జరుగుతోంది?”_*
*"ఓ రాజా ! ఇది మానవ కంకాళం!.. ఇందులో ఏది వేసినా అంతా మాయం అవుతూనే ఉంటుంది...*
*🙏ఈ కథలో నుండి మనం గ్రహించవలసినది...🙏*
*👌మనకు ఎంత కీర్తి, పదవి, దానం, పేరు, ప్రతిష్ట,..... లభించినా అన్నీ మాయమయిపోతూనే ఉంటాయి. మనకు తృప్తి ఉండదు. ఇంకా కావాలి అని ఆశగా ఎదురు చూస్తూనే ఉంటాము. ఏదో కావాలి అనే ఎదురు చూపు మనలను ఈక్షణం ప్రశాంతంగా ఉండనివ్వదు 👌*
*🎄ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. 🎄*
*🌴పూర్తిగా ఎప్పటికీ నిండని భిక్షా పాత్రతో శ్మశాన వాటిక వరకూనడిచేవారు.🌴*
*🌴కోటికొక్కరు చొప్పున భిక్షా పాత్రను వదిలిపెట్టిన వారు. వీరు కోరికలు లేని స్థితిలో ఉండడం వలన వారిలోనే అంతా చూడగలరు.🌴*
-----------------------
*🌴ఏదైనా ఒక కోరిక కలిగితే అది తీరే వరకూ మనసు మనసులో ఉండదు. అది నీనుండి దూరం అయితే నీకు నిరాశ ! అది దగ్గరయితే సంతోషం ! ఈ ఆనందం ఎంత సేపు ? తాత్కాలికమే !!🌴*
*🌴కోరిక తీరగానే కలిగే ఆనందం క్షణికమే ! మళ్ళీ వేరే కోరిక ! ఒక కోరిక తీర గానె ఇంకోటి అంతు లేని నిరాశలూ , అంతం లేని ఆనందాలూ .....🌴*
*🌴కోరికలలో మనసు దాగి ఉంది కోరికలు లేని స్థితి అంటే మనసు లేని స్థితి అంటే భావాతీత స్థితి. అదే నిశ్చల స్థితి.. అదే ధ్యాన సంసిద్ధతా స్థితి🌴*
➖➖➖🕉️➖➖➖
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
.💐🙏💐🙏💐🙏💐🙏
No comments:
Post a Comment