పంటకేస్తె తప్పు పాడికీ తప్పంటె
కోడి చేప కైన కూడ దంటె
మనిషి కాంగ్ల మందు మంచేల జేయురా
సకురు అప్ప రావు సత్యమిదిర
భావం: రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వలన పంట, పంట భూములు విషతుల్యమై, ఆ పంటలు తినటానికి పనికి రాకుండా పోతాయని అందరికీ అర్థమయ్యింది! అలాగే పాడి పశువులకు అనారోగ్యానికీ, అధిక పాల ఉత్పత్తి కోసం వాడే హార్మోన్ మరియు స్టెరాయిడ్ మందుల వాడకం వలన ఆ పాలు విషంతో సమానంగా మారుతున్నాయని కూడా మనకు తెలుసు! కోళ్ళ పెరుగుదలకు వాడే ఇంగ్లీషు మందులు కూడా అనారోగ్య కారకమని అర్థమై, ఆ కోళ్ళను కాకుండా సహజంగా పెరిగిన నాటు కోళ్ళను తినమని సలహా ఇస్తున్నారు! చెరువు చేపల ఉత్పత్తిలో వాడే ఏంటీబయోటిక్కులూ, కెమికల్స్ వలన కూడా ఆ చేపలు తినటానికి పనికి రాకుండా పోతున్నాయని ఒప్పుకుంటున్నాం! పంటలోనో, పశువులోనో, కోడిలోనో, చేపలోనో వేసిన మందులు చాలా వరకూ అరిగి పోయి, కొంత శాతం మాత్రమే అవశేషంగా వాటిని భుజించడం ద్వారా మనకు చేరే తక్కువ మొత్తం కూడా విషతుల్యమైనప్పుడు ఆ పనికిమాలిన మందులే ఆరోగ్యం కోసం గ్లాసుతో నీళ్ళు దగ్గర పెట్టుకొని మరీ టాబ్లెట్లూ, టానిక్కులూ అంటూ డైరెక్ట్ గా "రా మెటీరియల్ " మింగేస్తున్నామే, ఎంత తప్పు? ఇలా రకరకాల జీవులు, ఆహారోత్పత్తుల విషయంలో విషతుల్యమని, కేన్సర్ కారకాలని నిరూపించబడిన ఇంగ్లీషు మందులను ఆరోగ్యం కోసం అమృతంలా భావించి రోజూ గుప్పెడు గుప్పెడు మ్రింగేస్తున్నామే! వాటన్నింటికీ విషతుల్యమైనవి మనకి మాత్రం అమృతాలు ఎలా అవుతాయి?
సకురు అప్పారావు చెప్పేది నిజమౌనో కాదో ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి!
ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870
(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)
No comments:
Post a Comment