🐂🐂🐂🐂🐂
జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానాలు :
*ప్ర : శివాలయంలో నంది ఎందుకుంటుంది? నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారెందుకు?*
*జ:* ఆగమశాస్త్ర ప్రకారం దేవాలయంలోని స్వామివారి వాహనం స్వామి ముందు ఉండాలి. శివుని వాహనం కనుక నంది ఉంటుంది.
అంతేకాక శివగణాలకు అతి ముఖ్య నాయకుడు నంది - *వృషభం. ఇది ధర్మానికి సంకేతం. సత్యం, అహింస, అస్తేయం (అక్రమార్చన లేకపోవడం), శౌచం (శుచి) - ఈ నాలుగు పాదాలతో ఉండే ధర్మమే వృషభం.*
దైవం ధర్మాన్నే అధిష్ఠించి ఉంటాడు. *ధర్మం ద్వారానే భగవంతుని చూడగలం.* ధర్మహీనుని దైవం అనుగ్రహించడు. ధర్మమే భగవత్సాక్షాత్కారానికి మూలం అని తెలియజేసేందుకే, నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారు.
అంతేకాక ప్రతివారూ భ్రూమధ్యంలో (కనుబొమ్మల నడుమ) జ్యోతిర్లింగ స్వరూపునిగా శివుని ధ్యానించడం ఉత్తమ మార్గమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కొమ్ముల మధ్య నుండి చూడడం ఈ విధానాన్నే ఉపదేశిస్తుంది.
*('ఋషిపీఠం' ప్రచురణ 'సమాధానమ్' పుస్తకం నుండి సేకరణ)*
🐂🐂🐂🐂🐂
No comments:
Post a Comment