*మేజిక్ పనిచేసే మాటలు:*
▫️▫️▫️▫️▫️▫️▫️
🎯🎯🎯🎯🎯🎯🎯
స్వామి వివేకానంద అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు
"మైడియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా”
అంటూ ప్రారంభించారు.
ఆ మాటతో అమెరికన్లు ఉలిక్కిపడ్డారు.
అంతవరకు సభలో "లేడీస్ అండ్ జంటిల్మెన్" అనే మాటే విన్నారు వారు.
🙏 ఆపైన ఆయన ఏది మాట్లాడినా వాళ్ళకి మధురాతిమధురంగా వినిపించిందట.
*_చరిత్రలో మిగిలిపోయే అటువంటి మరిచిపోలేని మాటలెన్నో ఉన్నాయి._*
✅ మార్టిన్ లూథర్ కింగ్
"'I have a dream'" అని ఆలోచించేలా చేసాడు.
✅అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ "నీకు దేశం ఏమిస్తుందని అడగొద్దు, నువ్వు దేశానికి ఏమివ్వగలవు?" అని ప్రశ్నించినప్పుడు చాలామంది ఆ దిశలో ఆలోచించారు.
✅ "జై జవాన్ - జై కిసాన్" అనే నినాదం ఇచ్చిన లాల్బహుదూర్ శాస్త్రి,
✅ "గరీబీ హటావో” అని పిలుపునిచ్చిన ఇందిరాగాంధీ,
✅“దేశానికి రాజైనా తల్లికి బిడ్డే" నని ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కి మొదటిసారి విచ్చేసినప్పుడు శ్రీ పి.వి. నరసింహారావు గారు,
అన్న ఆ మాటలు ఇప్పటికీ చెవుల్లో గింగురు మంటాయి.
✅🙏💪 “తెలుగువారి ఆత్మగౌరవం" అనేమాట విన్నప్పుడు గుర్తొచ్చేది మన నందమూరి తారక రామారావే.
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
No comments:
Post a Comment