Thursday, May 8, 2025

 [5/5, 08:01] +91 99594 04714: *శుభోదయం*
-------------------
🌻 *మహనీయుని మాట*🍁
        -------------------------
"సాయం తీసుకుంటే గుర్తు పెట్టుకోవాలి.
సాయం చేయకుంటే అర్ధం చేసుకోవాలి.
బాధ పెడితే,మోసం చేస్తే గుణపాఠం నేర్చుకోవాలి.
విలువ ఇవ్వకుంటే దూరంగా జరగాలి."
       --------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
      ---------------------------
"విలువ లేని మాటలకు
మౌనమే సరైన సమాధానం
విలువ ఇవ్వని మనిషికి
దూరమే సరైన నిర్ణయం."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[5/5, 08:03] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*


మొదలు జూచిన కడు  గొప్ప , పిదప కురుచ,
ఆది కొంచెము , తర్వాత అధికమగుచు
తనరు , దిన పూర్వ పరభాగ జనితమైన
 చాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి.

తా :  దుర్మార్గుల తోడి స్నేహం ఉదయం  పూట నీడలాగా ముందు పెద్దగా ఉండి క్రమక్రమంగా తగ్గిపోతుంది.
సజ్జనులతోడి మైత్రి సాయంకాలపు నీడలాగా మొదట చిన్నగా ఉండి క్రమంగా పెరుగుతూ ఉంటుంది.
 అందువల్ల సరియైన స్నేహితులను ఎంచుకోవాలి బుద్ధిమంతుడు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
[5/5, 08:03] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*


*ఘనకార్యాలను సాధించడానికే భగవంతుడు మనల్ని ఎన్నుకొన్నాడని విశ్వసించి, ఉత్సాహంగా ఉండండి. మనం వాటిని సాధించే తీరుతాం.*
                 *– స్వామి వివేకానంద*
[5/5, 08:03] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*


*పాపాయి*


పాపాయి కన్నుల్లు కలువరేకుల్లు
పాపాయి జుంపాలు పట్టుకుచ్చుల్లు
పాపాయి దంతాలు మంచిముత్యాలు
పాపాయి చేతులు పొట్ట్లకాయల్లు
పాపాయి పిక్కలు మొక్కజొన్న పొత్తులు
పాపాయి చెక్కులు పసివెన్నముద్దల్లు
పాపాయి వన్నెలు పసినిమ్మపండుల్లు
పాపాయి పలుకులు పంచదార చిలకల్లు
పాపాయి చిన్నెలు బాలకృష్ణుని వన్నెల్లు
[5/5, 08:03] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*రాగంలేని భోగం, త్యాగం లేని మనస్సు*


ఎంతగా భోగాలను అనుభవిస్తున్నా బంధుమిత్రుల అనురాగం లేకపోతే ఆనందమే ఉండదు.ఎలాంటి త్యాగమూ లేకుండా జీవితం గడుస్తూ ఉంటే మనస్సుకు ఆనందం ఉండదని ఈసామెత అర్థం.
[5/5, 08:03] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*"ఇల్లడ పెట్టడం*

పూర్వం ఎవరైనా, తీర్థయాత్రలకు పోతూ తిరిగి వచ్చే దాకా తమ దగ్గరున్న విలువైన వస్తువులను, ధనాన్ని తెలిసిన వారి వద్ద భద్రంగా ఉంచమని చెప్పి వెళుతుండేవారు. ఇలా తమ సొమ్ము తాత్కాలికంగా భద్రతను కల్పించుకోవడాన్నే ఇల్లడ పెట్టడం అంటారు."
[5/5, 08:03] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*


*🟥కాంతి - తరంగామా ? కణమా?, Light-is a cell or a ray?*

కాంతి (LightRay) - తరంగమ?కణమా ? అంటే చెప్పడము కష్టమే ! ఒక్కొక్క సారి ప్రశ్న కు ఎదురు ప్రశ్నే జవాబునిస్తుంది . ఉదాహరణకి నాణేనికున్నది బొమ్మా లేదా బొరుసా? అంటే ఏం చెబుతాం ?. కాంతికి కుడా నాణేనికిలాగే కణ(Corpuscular) స్వభావము , తరంగ (Wave)స్వభావము సంయుక్తం గా అవిభాజ్యం గా ఉంటాయి . ఎలాగైతే నేల మీద పడేసిన నాణెపు రెండు పక్కలు (బొమ్మ , బొరుసు) ఒకే సారి ఎలా చూడ లేమో ... ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్ని , కణ స్వభావాన్ని ఏకకాలం లో పరిశీలించాలేము .

కాంతి వక్రీభవనం(Refraction) , వివర్తనం (Disfraction) , వ్యతికరణం (Interference), ద్రువనం (Polarisation) అనే ధర్మాలను కలిగి ఉంటుంది . కాంతి కున్న తరంగ స్వభావానికి ఈ ద్రుగ్విషయాలు కారణము . కాంతి విద్యుత్ఫలితము (PhotoElectricEffect), కాంఫ్తాన్ ఫలితము , కాంతి రసాయనిక చర్యలు (PhotoChemical phinomena) , కృష్ణ వస్తు వికిరణం (BlackBodyRadiation) ఉద్గార వర్ణ పటాలు (EmissionSpectra) వంటి ప్రయోగ ఫలితాలు , పరిశీలనలు , కాంతి కున్న కనస్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకం గా రెండు లక్షణాలు ఏక సమయం లో ఉండడం వల్ల కాంతికి కణ-తరంగ ద్వంద్వ స్వభావం (WaveParticleDuality) ఉందంటారు.

No comments:

Post a Comment