*🌹కాశీ ఖండం - 11*
💥🔱☘️⚜️💥
🙏 *నైరుతి, వరుణ లోక వర్ణన* 💫
💫 శివశర్మ నైరుతి మొదలైన లోకాలను గురించి తెలియ జేయమని, విష్ణు దూతలను కోరగా, వివరిస్తున్నారు.
💫 మొదటిది నైరుతి. పుణ్యవతి పుణ్య జనులకు ఆవాసం.
వేద మార్గాన్ని అనుసరించే వారు ఇక్కడికి వస్తారు. దయా ధర్మాలతో ప్రవర్తించే అన్త్యజులకు కూడా, ఈ లోకంలభిస్తుంది, అని, పింగాక్షుని ఉపాఖ్యానాన్ని తెలిపారు
🙏 *పింగాక్షోపాఖ్యానం* 💫
💫 వింధ్యాటవిలో ఒక పల్లెకు పింగాక్షుడు ప్రభువు. మంచి శూరుడు. క్రూరకర్మలంటే అయిష్టం. నిర్దాక్షిణ్యంగా జంతువులను, మనుష్యులను చంపే వారిని, కఠినంగా శిక్షించేవాడు. అడవిలో ప్రయాణించే వారిని, వెంట ఉండి దాటిస్తాడు.
💫 ఒకసారి ఇతని బంధువు, ప్రయాణీకులను హింసించాడని విన్నాడు. రహస్యంగా వచ్చి, వాడిని పట్టుకొన్నాడు. ఇతరులకు అపకారం చేయవద్దని హెచ్చరించాడు. వాడు దోచుకొన్న దానికి రెట్టింపు ఇచ్చి, గౌరవంగా సాగనంపాడు. ఇంకోసారి మరో బృందం వస్తుంటే, కొందర్ని, వాళ్ళను చంపమని, దోచుకోమనీ, హెచ్చరికలు వచ్చాయి. అప్పుడు వారంతా, తాము పింగాక్షుడున్నాడనే ధైర్యంతో వచ్చామని, కావాలంటే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామని, ప్రాణాలను రక్షించమని, యాత్రికులు వేడుకొన్నారు. ఈ మాటలను విన్న పింగాక్షుడు, వారిని భయపడవద్దని అనునయిస్తూ, ఆ చోటుకు చేరుకొన్నాడు. ఇంతలో ఒక భిల్లుడు అక్కడికి వచ్చి, తన అనుచరగణంతో, పింగాక్షుడిని చంపమని ఆదేశించాడు. ఇరువైపులా ఘోర పోరాటం జరిగింది. శత్రువులైన భిల్ల గణాన్ని ఓడించి, బంధించాడు. కాని అతని ధనుస్సు, బాణాలు, ముక్కలు ముక్కలయ్యాయి శత్రువులు అనేకులు అవటంతో, వారి చేతిలో మరణించాడు పింగాక్షుడు.
💫 నైరుతి దిక్కు నుండి దేవదూతలు వచ్చి, పింగాక్షుని దేవ విమానంలో తీసుకొని వచ్చి, నైరుతి దిక్కుకు, ప్రభువును చేశారు
🙏 *వరుణ లోక వర్ణన*💫
💫 అక్కడి నుండి విష్ణుశర్మను వరుణ లోకానికి, విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు. ప్రజలకోసం బావులు, చెరువులు త్రవ్వించిన వారు, వరుణ లోకానికి వస్తారు. ఐశ్వర్య సంపన్నం. దారిలో నీడ కోసం రావి, మద్ది చెట్లను నాటించేవారు, ఈ లోకం చేరుతారు. వేసవిలో విసనకర్రలను దానం చేసినవారు, సుగంధపు చల్లని పానీయాలిచ్చే వారు, చలివేంద్రాలను ఏర్పాటుచేసేవారు, వరుణలోకానికి చేరతారు. జలదారా మండపాలను, నీడనిచ్చే మండపాలను నిర్మించిన వారికి ఇది నెలవు. పుణ్యనదులలో స్నానం చేయటానికి వీలుగా, మెట్ల నిర్మాణం చేసే వారికి, వరుణలోకం ఆవాస భూమి. అన్ని జలాశయాలకు వరుణుడు అదిపతి. అన్ని సముద్రాలకు నీటిని, ప్రాణాన్ని కల్పించేవాడు. కర్మ సాక్షి కూడా
🙏 *వరుణుని జన్మ వృత్తాంతం*💫
💫 కర్దమ ప్రజాపతికి
శుచిష్మoతుడనే కుమారుడు ఉన్నాడు. వినయ శీలి. సుగుణవంతుడు. ధైర్య శాలి. ఒకరోజు ఇతడు కొందరు బాలురతో కలిసి, ఒక సరస్సులో, స్నానానికి వెళ్లాడు. నీటిలో దిగగానే, అతడిని, ఒక మొసలి
పట్టుకుంది. ఈ విషయాన్ని, స్నేహితులు, తండ్రికి తెలియజేశారు.
💫 ఆయన, అప్పుడు, శివధ్యానంలో ఉన్నాడు. తన సర్వజ్ఞత్వం వల్ల, ఒక సరస్సులో, కొంతమంది మునిబాలురు జలక్రీడలాడటం, కనిపించింది. అందులో రుద్రరూపుడైన, ఒక ముని బాలుడు, ‘’ఓయి సముద్రాధిపా !భక్తుడైన కర్దమ ప్రజాపతి కుమారుడెక్కడ ఉన్నాడు? శివుని సామర్ధ్యం తెలియకుండా, దుష్క్రుత్యానికి పాలుపడ్డావు.‘’ అని గర్జించాడు.
💫 సముద్రుడు భయపడి బాలుడిని రత్నాలతో అలంకరించి శిశుమారకమైన మొసలిని కూడా బంధించి తెచ్చి, శివుని పాదాల చెంత పడేసాడు. శివుని పాదాలకు నమస్కరించి, ‘’మహాశివా !నా తప్పేమీ లేదు .ఈ జంతువు వల్లనే, శిశువుకు మరణం సంభవించింది .’’ అని, విన్న వించుకొన్నారు. అప్పుడు శివుడు మన్నించి, ఆ బాలుని తండ్రి, కర్దమ ప్రజాపతి వద్దకు తీసుకొనివెళ్ళి, అప్పగించమని, ప్రమధగణాలకు చెప్పాడు.
💫 తండ్రి కుమారుని చూచి, సంతోషంతో కౌగలించుకొని, యోగాక్షేమాలను విచారించాడు. బాలుడు జరిగిన వృత్తాంతం అంతా, తండ్రికి తెలియ జేశాడు. తండ్రి అనుమతి గ్రహించి, బాలుడు, కాశీలో శివలింగాన్ని ప్రతిష్టించి, అయిదు వేల సంవత్సరాలు శిలలాగా నిశ్చలంగా శివుని కోసం, తపస్సు చేశాడు.
మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. తనకు జలాలపై ఆధిపత్యం కావాలని, బాలుడు విన్నవించాడు.
💫 అప్పుడు భవానీపతి ‘’నువ్వు, వాపీ, కూప, తటాకాది నదీనదాలకు సమస్త జలాలకు
అధిపతివి అవుతావు. సమస్త రత్నాలకు అధిపతివి నీవే. పశ్చిమదిక్కునకు అధిపత్యం నీదే. పాశపాణివై సమస్త దేవతలకు ఇష్టుడవవుతావు. నువ్వు స్థాపించిన ఈ లింగం ‘’వరుణేశ్వర లింగం‘’ గా ప్రసిద్ధి చెందుతుంది. మణికర్నేశ్వరలింగం నైరుతి దిశలో, సంస్తాపితమై ఉంటుంది. దీనిని అర్చించిన వారికి, అకాలమరణం రాదు. నీరసాలైన అన్నపానాదులు వరుణుని అనుగ్రహంతో సరసములుగా మారుతాయి." అని వరమిచ్చి, అంతర్ధాన మయ్యాడు .
💫 శుచిష్మంతుడు అనే ఆ బ్రాహ్మణ బాలుడు, నైరుతి దిశకు అధిపతి అయాడు.
👉కాశీఖండం సశేషం..👈
🙌సర్వేజనాః సుఖినోభవంతు🙌
No comments:
Post a Comment