Wednesday, June 4, 2025

 💐💐 *ఈ రోజు జూన్ 1 తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు తల్లిదండ్రుల దినోత్సవం శుభాకాంక్షలు💐💐*
~~~~~~~~~~~~~~~~~~~~~ 
*తల్లిదండ్రుల యోగక్షేమాలు సంతానం బాధ్యత*
~~~~~~~~~~~~~~~~~~~~~
తల్లితండ్రులు తమ పిల్లలను సన్మార్గంలో నడిపిస్తూ, నైతికతతో, ధర్మంగా జీవించే మార్గానికి కృతజ్ఞతగా, వారి పట్ల సేవా దృక్పథంతో ఉండుటకు, పిల్లల కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవటానికి ఐక్యరాజ్యసమితి 1994 నుండి ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ *" గ్లోబల్ పేరెంట్స్ డే"*  గా ప్రకటించి ప్రపంచ దేశాలకు పాటించమని సూచించింది.
👉 నవమాసాలు మోసి, జన్మనిచ్చి, కంటికి రెప్పలా రక్షించే తల్లే ఈ జగత్తులో మొదటి దైవం. ఇహపరాలు సాధించేందుకు విద్యాబుద్ధులు, జ్ఞానాన్ని అందించి స్వశక్తిపై ఆధారపడేలా చేసిన తండ్రే రెండో దైవం. అటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్య సమయంలో వారిని ఆదుకోవాల్సిన అవసరాన్ని ఈరోజు గుర్తిస్తోంది . ఈ వయసులో వారికి కావలసినది ఆప్యాయత, అనురాగం. సంతానం ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత ఖాళీ లేకపోయినా కనీసం రాత్రికి ఇంటికి చేరుకున్న తర్వాత ఒకసారి వారి పక్కన కూర్చుని పలకరిస్తే చాలు ఎంతో ఆనందపడతారు.
 *కాని నేడు చాలా మంది వృద్ధులు తమ బిడ్డలు పట్టించుకోకపోవడం వల్ల, అనాథలుగా, దౌర్భాగ్య జీవితాన్ని అనుభవిస్తున్నారు*   
(పద్మ పురాణంలోని అంశం). మహాభారతంలో యక్షప్రశ్నలులో ధర్మ రాజును యక్షుడు "సహనంలో గొప్పది భూమి అంటారు కదా! అటువంటి భూమి కంటే గొప్పది ఏది?" అనడిగితే, "తల్లి" అని సమాధానం చెప్పాడు. వెంటనే యక్షుడు, తిరిగి ధర్మరాజును "ఆకాశం సువిశాలంగ కనపడుతుంది. అంత కంటే మవిశాలమైన పొడవైనది ఏది? అని అడిగితే, ధర్మరాజు "తండ్రి హృదయం" అని చెప్పారు.
*కాబట్టి తల్లిదండ్రులు విషయంలో, ముఖ్యంగా వృద్ధులు పట్ల కరుణ, ప్రేమతో ఉంటూ, వారి అవసరాలు చూస్తూంటే మన జీవన శైలి ఆనందంగా ఉంటుంది.*  ఇహ 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Note: ఎన్ని సినిమాలు చూసినా తండ్రి లాంటి హీరో దొరకడు

ఎన్ని దేవాలయాలు దర్శించినా తల్లి లాంటి దేవత దొరకదు. మీ అందరివాడు శిరుగడి వాసు..!
~~~~~~~~👏👏~~~~~~~~~

No comments:

Post a Comment