💐🌷జూన్ 1న ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం (గ్లోబల్ పేరెంట్స్ డే).......💐🌷
【 #తల్లిదండ్రులు” అనే పదం ఈ ప్రపంచంలోనే అత్యుత్తమయినది. వారు మనకు చేసిన సేవకు, మనం ఏమిచ్చినా వారి ఋణం తీర్చుకోలేము.#】
#తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావించే తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెల కట్టలేనివి. ఈ లోకంలో మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉంటారేమో గానీ.. ఎంత వెతికినా.. ప్రేమ లేని అమ్మ.. బాధ్యత లేని నాన్న ఉండరు. అందుకే పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అపూర్వమైనది... అసాధారణమైనది. తల్లి జన్మనిస్తే.. ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి. పిల్లల ప్రతి మలుపులో.. ప్రతి బాధలో.. గెలుపులో తోడుగా నిలిచేది వారే.
#ఉరుకుల పరుగుల జీవనంలో.. ఎంతసేపూ డబ్బు సంపాదనే కీలకంగా మారడంతో చాలా మందికి తల్లిదండ్రులను చూసుకునే తీరక ఉండడం లేదు. దీంతో పట్టణాల్లో నూటికి 90శాతం మంది పిల్లలు వారిని విస్మరిస్తున్నారు. ఇళ్లలో వివిధ రకాల గొడవలతో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బిడ్డల్ని కనిపెంచి.. వారి ఉన్నత భవిష్యత్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులు నేడు నిరాదరణకు గురవుతున్నారు. ఈక్షోభ భరించలేక కొంతమంది వృద్ధులు మనోవేదనతో ప్రాణాలు విడుస్తున్నారు. అయితే వృద్ధాప్యంలో తమకూ ఈ దుస్థితి ఏర్పడుతుందనే వాస్తవాన్ని నేటితరం గ్రహించలేకపోతోంది. ఇదిలా ఉండగా పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో భిన్న పరిస్థితి నెలకొంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు సేవలు చేస్తూ ఎంతోమంది ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏదేమైనా తల్లిదండ్రులను నిత్యం పూజించక పోయినా పర్వాలేదు.. కానీ వారిని ఆప్యాయంగా, ప్రేమగా పలకరిస్తే చాలు. ఆ ఆనందాన్ని తల్లిదండ్రులు ఏడాదంతా.
#పిల్లలు పెద్దవుతున్నకొద్దీ పెద్దవాళ్లు చిన్నపిల్లలుగా మారిపోతుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు రీత్యా బిడ్డలు వదిలి వెళ్లిపోతుంటే ఒంటరిగా బతకలేక తల్లిదండ్రులు కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో వారు పిల్లలతో ఉందామని ఆశపడతారు. కానీ వారి కోరిక నేరవేరదు. దీంతో మానసిక వ్యాధికి గురవుతుంటారు. ఇటువంటివారి వేదనను గుర్తించి ఏడాదిలో ఒక్కరోజైనా వారి ఆశను నేరవేర్చడానికి ఏర్పాటైందే ఈ తల్లిదండ్రుల దినోత్సవం.
#చరిత్ర:
ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని 2012లో యూఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహించాలన్న ప్రతిపాదన అమెరికాలో మొదలైంది. 1984లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అధికారికంగా ఈ దినోత్సవానికి ఆమోద ముద్రవేశారు. దీంతో అప్పటి నుంచి తల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి.
*అందరిని మరిచినా నీ తల్లిదండ్రులను మరవ వద్దు,వాళ్లను మించి నీ మంచిని కోరే వారెవరూ ఉండరని తెలుసుకో.
*నువ్వు పుట్టాలని రాళ్లకు పూజలు చేశారు వారు,రాయివై వారి హృదయాలను ముక్కలు చేయవద్దు.
*కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు,నీకు అమృతమిచ్చిన వారిపైనే నువ్వు విషాన్ని విరచిమ్మవద్దు.
*ముద్దు మరిపాలతో నీ కోరికలు తీర్చారు వారు,ఆ ప్రేమ మూర్తుల కోరికలు నువ్వు తీర్చాలని మరవవద్దు.
*నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానము అవుతాయా? అంతా వ్యర్ధమే, సేవాభావం లేక గర్వం పనికి రాదు.
*సంతానం వల్ల సుఖం కోరుతావు,నీ సంతాన ధర్మం మరవవద్దు,
ఎంత చేసేకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరవవద్దు.
*నువ్వు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపొత్తిల్లో పడుకోబెటారు.
*అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళకు అశ్రువులను నింపకు.
*నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు,ఆ మార్గదర్శకులకు నీవు ముల్లుపై వారిని బాధించకూడదు.
*డబ్బు పోతే మళ్ళి సంపాద్చివచ్చు,
తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించుకోలేవు,వారి పాదాల గొప్పతనం జీవితాంతం మరవ వద్దు.
#నవమాసాలు మోసిన కన్న తల్లిని, గుండెలపై ఎత్తుకుని పెంచిన తండ్రిని పోషించలేని తనయులు నిర్ధాక్షణ్యంగా తల్లితండ్రులను వృద్దాశ్రమాల్లో వదిలేస్తున్నారు. మరికొందరు దుర్మార్గులైతే ఇంట్లో నుంచే గెంటేస్తున్నారు.కన్నవారిని భారంగా ఫీలవుతూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదలడానికి వెళ్తున్న వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి.
#ఒక్క క్షణం ఆలోచించండి..
ఆశ్రమానికి తీసుకువెళ్లేప్పుడు ‘చిన్నప్పుడు వారు మన చేయి పట్టుకొని స్కూల్కు తీసికెళ్లిన రోజులు’ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి…
#వారిని అక్కడ వదలి వచ్చేటప్పుడు వారికళ్ళలో నీళ్ళు చూసికూడా, చూడనట్లు పక్కకు వచ్చి భారం దిగిపోయిందని భావించే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ, తమ పిల్లల్ని స్కూల్లో వదలి వచ్చేటపుడు పిల్లలు ఏడుస్తుంటే , వారు పక్కకు వచ్చి కన్నీళ్ళు తుడుచుకోవడం ఆ పిల్లలు గమనించి ఉండరు. ఒకవేళ గమనించి ఉంటే వదిలిన తర్వాత ఒక్కసారైనా వారి వైపు చూసే వారు.
#వృద్దాప్యంలో స్వతహాగా వచ్చే మతిమరుపు వల్ల, పదేపదే అడిగిన విషయాన్నే అడుగుతుంటే చాలామందికి విసుగొస్తుంది కదా.. మరి మన బాల్యంలో మాటలు నేర్చుకొనేటప్పుడు వచ్చీ రాని పదాలు మనం పలుకుతుంటే అవి వారికి అర్థంకాక పోయినా ,అర్థం చేసుకొని మనల్నిఎత్తుకొని ముద్దాడే వారు కదా.. ఆ సంఘటనలు గుర్తొస్తే ఖచ్చితంగా పెద్దవారిని విసుక్కోరు.
#వయసు పెరిగే కొద్దీ అనారోగ్యంతో దగ్గుతూ ఉంటారు. రాత్రిళ్ళు వారు దగ్గుతుంటే తమ నిద్రకు భంగం కలుగుతుందని విసుక్కునే పుత్ర రత్నాలు అనేకమంది. చిన్నప్పుడు మనం దగ్గినప్పుడు అర్ధరాత్రి లేచి మందులేసి, “ఊయలలో” వేసి నిద్రపుచ్చిన సంగతి మరచిపోతే ఎలా…?
#ఇంటిలో కంటే ఆశ్రమంలో సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వారికి కన్నీళ్ళు రాలేదు అని అనుకుంటే అది ముమ్మాటికి తప్పు..
#ఎందుకంటే.. కన్నీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలోనే ఇంకిపోయి ఉంటాయి.లేదా నీవు బాధపడకూడదని ,కన్నీళ్లను దిగమింగుకొని ఉంటారు.
#ఆ బాధ భరించలేక కొందరు కన్నీళ్లు పెట్టుకున్నా వారి కళ్ళలోంచి చర్మపు ముడతల్లోకి జారిపోయి ఉండడాన్ని బిడ్డలు గమనించివుండక పోవచ్చు…
“#తల్లిదండ్రులు” అనే పదం ఈ ప్రపంచంలోనే అత్యుత్తమయినది. వారు మనకు చేసిన సేవకు, మనం ఏమిచ్చినా వారి ఋణం తీర్చుకోలేము.
#తల్లితండ్రులను వదిలెయ్యాలి అనుకునేవారు “వారు లేకుంటే నేను ఈ భూమి మీదకు వచ్చేవాడినే కాదని” గుర్తుపెట్టుకోవాలి.
#మనం ఎంత ఎత్తుకు ఎదిగినా అది వారు పెట్టిన “బిక్ష” అని మాత్రం మరచిపోకూడదు. ఏ మనిషైనా గొప్పవాడు అయితే మొదట సంతోషించేది అతని తల్లిదండ్రులే. అలాగే తను బాధపడితే, మొదట బాధపడేది కూడా తల్లితండ్రులు..
#ఈ రోజు వారిని ఆశ్రమానికి పంపితే.. రేపు మనల్ని కూడా మన బిడ్డలు ఆశ్రమానికే పంపుతారని గుర్తుపెట్టుకోవాలి..ఎందుకంటే చిన్నప్పటి నుండి తల్లితండ్రుల మంచితనాన్ని చూసి పెరిగిన వారికే వారిని వదిలేసి బ్రతకాలనే కోరిక పుడితే.., మనల్నే చూస్తూ పెరిగిన మన బిడ్డలు ఇంకేమవుతారు…
#మన తొలి శ్వాస నుండి మనల్ని ప్రాణంగా ప్రేమిస్తూ వచ్చిన మన తల్లితండ్రులను, వారి చివరి శ్వాస వరకూ కంటికి రెప్పగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందని మరువకండి..
🙏💐🌹🌸🌷💐🙏
No comments:
Post a Comment