🙏 *రమణోదయం* 🙏
*తన సూక్ష్మమైన లోదృష్టి యైనటువంటి మనో మౌనంతో "నేను అని ఉదయించే స్థలమేది?" అని వెదకి హృదయంలో మునుగలేని వారు, మనస్సుతో ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు, ఆ మంత్ర ధ్వని అనే పరావాక్కు ఎచ్చటి నుండి పుడుతున్నదని పరిశీలించటమే చక్కటి తపస్సు.*
వివరణ: *శ్రీ కావ్య కంఠ గణపతి మునిగారు "జపంతో కూడా ఆ స్థితిని పొందవచ్చా?" అని అడిగిన ప్రశ్నకు సమాధానమే భగవాన్ యిచ్చిన ఈ ఉపదేశం. "పరావాక్కు" అని చెప్పినది "నేను నేను" అనే స్ఫురణ అని కూడా ధృవీకరిస్తున్నారు.*
జీవుడు నాణేనికి బొమ్మబొరుసు వలె
చల - అచల ప్రవృత్తులను కలిగి ఉంటాడు.
అందువల్లనే జీవుడు
బంధం-మోక్షముల మధ్య ఊగిసలాడుతుంటాడు.
భగవంతుడు-నీవున్న చోటనే ఉన్నాడు.
నీలోనే ఉన్నాడు..నీవుగానే ఉన్నాడు.
ఆయనకోసం ఒక్క అడుగు కూడా
వేయవలసిన అవసరం లేదు!
🌹అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచల శివ..
అరుణాచలా!🌹
🪷ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🪷
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.706)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె
పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment