Wednesday, June 4, 2025

 *బౌద్ధ గ్రంథాలన్నీ దాంపత్యం విషయంలో పవిత్రంగా ఉండమని నొక్కి చెబుతాయి.*

*"ఉన్మాదయంతి జాతక"కథలోని ఒక వృత్తాంతం బౌద్ధ సాంప్రదాయంలోని ఆదర్శాన్ని స్పష్టం చేస్తోంది.*

*శిబిచక్రవర్తి ఆస్థానంలోని ఒక ఉద్యోగి సౌందర్య రాశి అయిన తన భార్యను అనుభవించవలసిందిగా రాజును కోరుతాడు.అందుకు తిరస్కరించిన శిబిచక్రవర్తి అతనితో యిలా చెబుతాడు.*

 *"ఖడ్గంతో నా శరీరాన్ని నిలువునా ఖండించటానికైనా లేదా మండుతున్న అగ్నిగుండంలో ఈ శరీరాన్ని దహించటానికైనా నేను సిద్ధమే.*

*కానీ నేను నిరంతరం ఆచరించే బౌద్ధధర్మానికి భంగం కలిగించలేను.క్షణికమైన సుఖాల కోసం ధర్మాచరణకు హాని తలపెట్టబోను.*

*సుగుణశీలురైనవారు ఇతరులను పరాభవించటంలో ఆనందం పొందజాలరు.సత్ప్రవర్తనతో నా అవసరాలను అదుపుచేసుకుంటాను.కానీ,అందు కోసం ఇతరులను నొప్పించలేను.*

*నన్ను అదుపుచేసుకునే శక్తి నాకు లేనప్పుడు,నన్ను నమ్మిన ప్రజలకు నేనెలా రక్షణ కల్పించగలను?*

*నా ప్రజల సంక్షేమం కోసం,నా సత్ప్రవర్తన,నా పేరు ప్రఖ్యాతులపై నాకున్న గౌరవం కారణంగా,తాత్కాలిక మైన సుఖాలకు దాసుణ్ణి కాబోను.*

       *నైతిక విలువలు కలిగిన బౌద్ధ ధర్మం మన దేశంలో పుట్టి, ఈ దేశంలోనే లేకుండా చేయటం వలన ఇన్ని అనర్ధాలు.*

*అందుకే తిరిగి నిర్మిద్దాం బౌద్ధ భారతాన్ని,మంచి మానవ సమాజాన్ని నెలకొలుపుదాం.....*

*సేకరణ : అరియ నాగసేన బోధి*

 *నమో బుద్ధాయ  !* 
*నమో ధమ్మాయ  !!*
*నమో సంఘాయ  !!!*
   
*జై భీమ్......*

No comments:

Post a Comment