Tuesday, July 1, 2025

 *☘️వేదమూర్తుల స్తుతులు☘️*

*(21 వ భాగము)*

*జ్ఞానలేమి కారణంగానే మాయావాద తత్త్వవేత్తలు శ్రీకృష్ణుడు సర్వదా షడ్విభూతులను, అష్ట దివ్యగుణాలను, అష్టసిద్ధులను కలిగియుంటాడనే విషయాన్ని మరచిపోతారు. ఐశ్వర్యము, బలము, సౌందర్యము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము అనేవి షడ్విభూతులు. ఈ ఆరు విభూతులలో శ్రీకృష్ణునికి సమానాధికులు ఎవ్వరూ లేరు. సంసార కల్మషముచే ఎన్నడును అంటబడక పోవడము శ్రీకృష్ణుని దివ్యగుణాలలో మొట్టమొదటిది. ఇది ఈశోపనిషత్ లో "అపాప విద్ధమ్" అని చెప్పబడింది. సూర్యుడు ఎటువంటి కల్మషము చేతను కలుషితుడు. కానట్లు, భగవంతుడు పాపకర్మ దూషితుడు కాబోడు. కృష్ణుని కార్యములు ఒకప్పుడు పాపమయముగా కనిపించినా అట్టి కర్మలచే అతడెన్నడును కలుషితుడు కాడు. మరణరాహిత్యము శ్రీకృష్ణుని రెండవ దివ్యగుణము. భగవద్గీతలోని నాలుగవ అధ్యాయములో శ్రీకృష్ణుడు అర్జునునితో పలుకుతూ తామిరువురము భౌతికజగత్తులో పలుమార్లు* *ప్రకటమయ్యామని, కాని తానొక్కడే అట్టి కర్మల నన్నింటిని అంటే భూత భవిష్యత్ వర్తమానాలను గుర్తుపెట్టుకో గలడని తెలియజేసాడు.*

*అంటే ఆతడెన్నడును మరణించడు. మరణము కారణంగానే మరుపు కలుగుతుంది. మరణించగానే మన దేహాలు మారిపోయి మరుపు వచ్చేస్తుంది. కాని శ్రీకృష్ణునకు ఎన్నడును మరుపు రాదు. గతములో జరిగిన సమస్తము అతనికి గుర్తు ఉంటుంది. లేకపోతే సూర్యదేవుడైన వివస్వానునికి భగవద్గీత యోగపద్ధతిని మొట్టమొదట తాను చెప్పాననే విషయము అతనికి ఏ విధంగా గుర్తుకు ఉంటుంది? కనుక అతడెన్నడును మరణించడు. అతడు ఎన్నడు. ముదుసలి కూడ కాడు. కురుక్షేత్రయుద్ధము నాటికి శ్రీకృష్ణుడు ముత్తాత యైనప్పటికిని ముదుసలిగా కనిపించలేదు. అంటే శ్రీకృష్ణుడు ఏ పాపకర్మ చేతను దూషితుడు కాడు, ఎన్నడును మరణించడు, ఎన్నడును ముదుసలి కాబోడు, ఏనాడును శోకగ్రస్తుడు కాడు, ఎన్నడును క్షుదార్హుడుకాడు, దప్పికకు లోనుకాడు. అతడు ఏది కోరినా అది ధర్మబద్ధమే అయియుంటుంది. అతడు నిర్ణయించిన దానిని ఎవ్వడూ మార్పు చేయలేడు. ఇవన్నీ శ్రీకృష్ణభగవానుని అష్టవిధ దివ్య గుణాలు. ఇదే కాకుండ ఆ దేవాదిదేవుడు యోగేశ్వరుడని తెలియబడినాడు. అణిమాసిద్ధి (సూక్ష్మాతిసూక్ష్మముగా నయ్యే శక్తి) వంటి సకల సిద్ధులు అతనికి ఉన్నాయి. శ్రీకృష్ణుడు పరమాణువులో కూడ ప్రవేశించాడని (అండాంతరస్థ పరమాణు చ యాన్తరస్థం) బ్రహ్మసంహితలో చెప్పబడింది. అదేవిధంగా అతడు గర్భోదకశాయి. విష్ణువు రూపంలో బ్రహ్మాండములోనూ ఉన్నాడు. మహావిష్ణువుగా కారణ సముద్రములో ఆతడు ఎంతటి బ్రహ్మాండమైన దేహముతో శయనించి ఉంటాడంటే ఆతని శ్వాస చేతనే కోట్లకొలది విశ్వములు ఉత్పన్నమౌతాయి.*

*ఇది మహిమాసిద్ధి అనబడుతుంది. శ్రీకృష్ణునికి లఘిమసిద్ధి కూడ ఉన్నది. అంటే అతడు అత్యంత తేలికగా కాగలుగుతాడు. శ్రీకృష్ణుడు ప్రతి విశ్వంలోను, పరమాణువులోను ప్రవేశించిన కారణంగానే సకలలోకాలు అంతరిక్షములో తేలుతున్నాయని భగవద్గీతలో చెప్పబడింది. భారరాహిత్యానికి ఇదే వివరణ మౌతుంది. శ్రీకృష్ణునికి ప్రాప్తి సిద్ధి కూడ ఉన్నది. తాను కోరినది అతడు పొందగలుగుతాడు. అదేవిధంగా ఈశితసిద్ధి (నియంత్రణశక్తి) అతనికి ఉన్నది. ఆతడు పరమనియామకుడు, పరమేశ్వరుడని పిలువబడతాడు. దీనితో పాటు అతడు ఎవ్వరినైనా తన ప్రభావానికి గురిచేస్తాడు. ఇదే వశితసిద్ధి అనబడుతుంది.*

*ఈ ప్రకారంగా శ్రీకృష్ణభగవానుడు సకల విభూతులను, సకల దివ్యగుణాలను, సకల సిద్ధులను కలిగియున్నాడు. ఏ సాధారణజీవుడు అతనితో సరిపోలడు. కనుక పరమాత్ముడు, జీవుడు సమానమే యనెడి మాయావాద సిద్ధాంతము కేవలము అపోహ మాత్రమే అవుతుంది. కనుక సారాంశమేమంటే శ్రీకృష్ణభగవానుడు ఆరాధ్యుడు, ఇతర జీవులందరు అతని సేవకులు. ఈ అవగాహనయే ఆత్మానుభూతి అని చెప్పబడుతుంది. శ్రీకృష్ణుని ఈ నిత్య సేవాసంబంధానికి అన్యమైన ఏ అనుభూతియైనా మాయారచితమే అయియుంటుంది. భగవంతునితో సమానము కమ్మని చెప్పడమే మాయ యొక్క చివరి వల అవుతుందని చెప్పబడింది.మాయావాద తత్త్వవేత్త తాను భగవంతునితో సమానుడనని చెప్పుకొనినా ఎందుకు భవబంధములో పడినావనే ప్రశ్నకు సమాధానము చెప్పలేడు. అతడు. భగవంతుడేయైతే పాపకర్మలకు ఒడిగట్టి కర్మఫల క్లేశాలకు ఎందుకు లోనౌతాడు? ఈ విషయాన్ని అడిగినపుడు మాయావాదులు సరిగ్గా జవాబు చెప్పలేరు. భగవంతునితో సమానుడననే కల్పన ఒక రకమైన పాపలక్షణము. సకలపాప. విముక్తుడు కానిదే ఎవ్వడును కృష్ణభక్తిభావనను చేపట్టలేడు. భగవంతునితో సమానుడు నని మాయావాది చెప్పే విషయమును బట్టే అతడు ఇంకను పాపవిముక్తుడు కాలేదని తెలుస్తుంది. అటువంటి వ్యక్తులు "అవిశుద్ధ బుద్ధయ" అని భాగవతము చెప్పింది. తాము ముక్తులమయ్యామని మిథ్యగా తలుస్తూ, అదే సమయంలో తాము పరతత్త్వముతో సమానమని భావించే కారణముగా వారి బుద్ధి విశుద్ధము కాదని. దాని అర్థము. యోగులు, జ్ఞానులు పాపవాంఛల నుండి బయటపడకపోతే వారి ఆత్మానుభూతి పద్ధతి జయప్రదము కాబోదని వేదమూర్తులు తెలిపారు.*

*వేదమూర్తులు స్తుతిని కొనసాగించారు: "దేవా! సాధుపురుషులు పాపవాంఛా మూలమును పూర్తిగా తొలగించుకోనిదే జీవాత్మ చెంతనే ఆసీనుడై ఉన్నప్పటికిని పరమాత్ముని అనుభూతము కావించుకోలేరు. తన యందు పరమాత్ముని కను గొనడమే సమాధి అనబడుతుంది. పాపరహితుడు కానివాడు పరమాత్ముని దర్శించలేడు. కంఠహారములో మణిపతకాన్ని కలిగిన వ్యక్తి దానిని మరచిపోతే తన చెంత మణిపతకము లేనివాడే అవుతాడు. అదేవిధముగా జీవుడు ధ్యాన మగ్నుడైనా తనలో పరమాత్ముని సన్నిధిని చూడలేకపోతే ఆ ధ్యానము వ్యర్థమే. అవుతుంది." కనుక ఆత్మానుభవ పథాన్ని చేపట్టిన వ్యక్తులు మాయాప్రభావముచే కలుషితులు కాకుండ జాగ్రత్తపడాలి. భక్తుడు అన్ని రకాలైన భౌతికవాంఛల నుండి బయటపడి ఉండాలని శ్రీల రూపగోస్వామి చెప్పారు. అతడు జ్ఞానకర్మల ప్రభావానికి లోను కాకూడదు. కృష్ణుని అర్థము చేసికొని అతని కోరికలను నెరవేర్చడమే. అతడు చేయవలసి ఉంటుంది. అదే విశుద్ధ భక్తియోగస్థితి. వేదమూర్తులు ఇంకమ స్తుతించసాగారు : "ఇంద్రియభోగవాంఛలు ఇంకను కలిగియున్నట్టి యోగులు తమ యత్నములో ఎన్నడును జయప్రదులు కాబోరు, అంతరము నందున్న పరమాత్ముని. అనుభూత మొనర్చుకోలేరు. నిజానికి నామమాత్ర యోగులు, జ్ఞానులు పరిమిత యోగసిద్ధుల ప్రదర్శన గాని, మానసిక కల్పనచే గాని నానారకాలైన ఇంద్రియ భోగాలలో కాలాన్ని వృథాచేసికొందురు. వారు బద్ధ జీవనము నుండి ఎన్నడును. విముక్తులు గాక నిరంతర జన్మమృత్యువులకు లోనౌతారు. అటువంటివారలకు ఇహపరాలు రెండు కూడ కష్ట దాయకములే అవుతాయి. అటువంటి పాపులు ప్రస్తుత జన్మలో క్లేశాలను అనుభవిస్తూనే ఉంటారు; ఆత్మానుభూతిలో పరిపూర్ణులు కానందున తదుపరి జన్మలోనూ వారు క్లేశములను పొందుతారు. ఇంద్రియభోగ వాంఛలచే కలుషితులై ఉండే అట్టి యోగులు సిద్ధిని బడ సే యత్నాలు ఎన్ని చేసినప్పటికిని ఇహపరాలలో దుఃఖాన్నే అనుభవిస్తారు."*

*సన్న్యాసులు (ఆత్మానుభూతి కొరకే ఇండ్లను విడిచినవారు) భగవద్భక్తిలో నెలకొనక విద్యాలయాలు ఏర్పాటు చేయడము, వైద్యశాలలను నిర్మించడము లేదా మఠాలను, దేవతామందిరాలను కట్టించడము వంటి పరహిత కార్యాల పట్ల ఆకర్షితులైతే అటువంటి కార్యకలాపాలు వారికి ఇహపరాలలో కష్టదాయకములే. అవుతాయని ఈ సందర్భములో శ్రీల విశ్వనాథచక్రవర్తి ఠాకూరులు తెలిపారు. కృష్ణానుభూతి కొరకై సన్న్యాసజీవనాన్ని వాడుకొనని సన్న్యాసులు సన్న్యాసాశ్రమ కలాపాలకు అన్యమైన కలాపాలలో కాలమును, శక్తిని వృథాపరచినవారే అవుతారు. కాని విష్ణు ఆలయ నిర్మాణములో తన శక్తిని ధారపోసే భక్తుని యత్నమెన్నడును. వ్యర్థము కాబోదు. అటువంటి కలాపాలు "కృష్ణార్థ అఖిల చేష్టా" అని పిలువ బడతాయి. కృష్ణుని ప్రీత్యర్థము చేయబడే నానారకాలైన కర్మలని దాని భావము. పరోపకారి విద్యాలయభవంతిని నిర్మించడము, భక్తుడు ఆలయాన్ని నిర్మించడము ఒకే స్థాయిలో ఉన్నట్టివి కావు. విద్యాలయ నిర్మాణము పుణ్యకర్మగా భావించబడి కర్మనియమాలకు లోబడుతుంది, కాగా విష్ణు ఆలయనిర్మాణము భక్తియుత సేవ అవుతుంది.*

💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦 
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*

No comments:

Post a Comment