*శ్రీమద్భగవద్గీత - ఐదవ అధ్యాయం -* *కర్మసన్న్యాసయోగము - మూడవ(౩) శ్లోకం.*
*గీతాచార్యుడైన శ్రీకృష్ణభగవానుడు అర్జునుడితోపాటు మనందరికీ కర్మసన్న్యాసయోగమును ఉపదేశిస్తూ ఈ రకంగా అంటున్నాడు.*
*"ఓ అర్జునా! 'నేను వేరు, శరీరము వేరు!' అనేటటువంటి జ్ఞానముతో, ఆత్మసాక్షాత్కారాన్ని పోందాలనే ఆకాంక్షతో ఆత్మయందు తప్ప ఇతరమైనటువంటి వాటియందు రాగముగానీ, ద్వేషముగానీ లేకుండా నీవు నిత్యము నీ విహితమైనటువంటి కర్మలను చేస్తూ వాటి ఫలితాలు కష్టమైనా, సుఖమైనా, లాభమైనా, నష్టమైనా, జయమైనా, అపజయమైనా సహిస్తూ నీ జీవనాన్ని కొనసాగిస్తే నీవు జ్ఞాననిష్ఠలో ఉన్నట్టే! అదే నీవు అవలీలగా కర్మబంధములనుండి విడుదల అవ్వడానికి సాధనమే అవుతుంది!"*
*అని అంటూ పరమాత్ముడైన శ్రీకృష్ణభగవానుడు మన దైనందిన జీవితాన్ని ఏ రకంగా కోనసాగిస్తే జ్ఞానయోగులం అవుతామో మనందరికీ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు.*
❄️❄️❄️ ❄️❄️❄️ ❄️❄️❄️
*ఆ పరమాత్ముని ఉపదేశాన్ని మనసారా భావనచేస్తూ మన దైనందినజీవితాన్ని ఏ రకంగా కొనసాగిస్తే కర్మబంధములనుండి విముక్తులము అవుతామో తెలుసుకొని పరమాత్మ చెప్పినట్టే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనే ఆసక్తితో, ఆత్మయందు తప్ప వేరేవాటియందు ఎటువంటి కాంక్షగానీ, వ్యతిరేకతగానీ లేకుండా పనులను చేస్తూ ఆ పనుల యొక్క ఫలితం ఏమైసరే సహిస్తూ జీవనాన్ని కోనసాగించడానికి ప్రయత్నం చేస్తూ పరమాత్ముడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్న చేద్దాం...*
*హరిః ఓం!*
*జ్ఞేయః స నిత్యసన్న్యాసీ*
*యో న ద్వేష్ఠి న కాంక్షతి I*
*నిర్ద్వంద్వో హి మహాబాహో*
*సుఖం బంధాత్ ప్రముచ్యతే II*
❄️❄️❄️ ❄️❄️❄️ ❄️❄️❄️
*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🦚🚩🦚 🙏🕉️🙏 🦚🚩🦚
No comments:
Post a Comment