[7/3, 21:00] +91 79819 72004: ఒక స్కూల్లో టీచర్ దగ్గరికి ఇద్దరు ఆడపిల్లలు కవల పిల్లలు చిన్న పాపలు వచ్చేవాళ్ళు వాళ్లని రోజు దిగబెట్టడానికి వాళ్ళ పని అబ్బాయి కూడా వచ్చేవాడు టీచర్ ఒకరోజు ఒక పాపని మీ పేరేమిటి అడిగింది ఆ పాప అప్పన్న అన్నది రెండవ పాపని నీ పేరేమిటి అడిగింది ఆ పాప కూడా అప్పన్న అన్నది పని అబ్బాయిని మీ పేరేమిటి అడిగింది అతడు కూడా అప్పన్న అన్నాడు టీచర్ కి కోపం వచ్చింది ఇదేమిటి వేళాకోళంగా ఉందా అన్నది మరుసటి రోజు పిల్లల్ని దిగబెట్టడానికి వాళ్ళ అమ్మ వచ్చింది టీచర్ వెళ్లి జరిగిన విషయం చెప్పింది అప్పుడు ఆ పిల్లల తల్లి నవ్వుతూ ఇలా చెప్పింది పాపల పేర్లు అపర్ణ అర్పణ నోరు తిరగక చిన్నవాళ్ళు కాబట్టి అప్పన్న అని చెప్తారు మా పని అబ్బాయి పేరు నిజంగా అప్పన్న అని చెప్పింది టీచర్ కూడా నవ్వేసింది
[7/3, 21:04] +91 79819 72004: ముళ్ళపూడి వెంకట రమణ గారి జోకులు .
" మీ పిక్చర్ కామెడియా? ట్రాజెడీయా?'
"డబ్బొస్తే కామెడి, రాకపోతే ట్రాజెడీ".
"నేడే చూడండి" అని ప్రతి సినిమా ప్రకటనలో వేస్తారు కదా! అంత కొంప మునిగిపోయే అర్జంటేమిటి?"
"రేపుండదని హెచ్చరిక"
కమల: ఈ మగవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో?
విమల: ఆడవాళ్ళు మాట్టాడుకునేవే మాట్లాడుతారనుకుంటా."
కమల: చి చి అసయ్యం.
"రేపు ఎలక్షనుకు నిలబడే అభ్యర్దులిద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటోయ్?"
" ఇద్దర్లో ఎవడో ఒకడే గెలుస్తాడని ఆనందంగా ఉన్నది."
"నాతో నేనే మాట్లాడుకోడం మహా అలవాటైపోయింది డాక్టర్ గారూ. కాస్త మందేమైనా ఇస్తే-"
"దాంతో ఇబ్బందేముంటుంది? మందెందుకు?"
" అబ్బే వెధవ సోదండీ . విసుగొస్తుంది వాగాలేకా-వినాలేకా".
"ఏమండీ, ఈ కవర్ మీద పది పైసలు స్టాంపులు ఎక్కువ అంటించారు.'
" అయ్యో చూడు నాయనా. అది రాజమండ్రిదాకానే వెళ్ళాలి. బిళ్ళలెక్కువున్నాయని విశాఖపట్నం లో మా వియ్యపురాలింటికి తోలీకుండా చూడు."
"ఇక లాభం లేదు, ఓ గంటకన్న ప్రాణం నిలబడదు. చెప్పదలుచుకున్నదేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి" అని పెదవి విరిచాడు.
"ఆ ఉంది...ఇంకో డాక్టర్ను పిలిపించండి చప్పున" న్నాడు రోగి నీరసంగా.
"డాక్టర్ గారూ.భోజనానికి సరైన వేళాపాళా ఏదంటారూ ?"
"లేనివాడికి దొరికినప్పుడు...ఉన్నవాడికి అరిగినప్పుడు"
ఒక రోగి ఆ"పరేషన్" బల్ల ఎక్కుతూ
"మరే ప్రమాదం లేదుగా డాక్టర్ గారూ?"
"చాల్చాల్లెవయ్యా, నవ్విపోతారు, నువ్విచ్చే డబ్బుకి ప్రమాదకరమైన ఆపరేషన్ ఎవడు చేస్తాడు. భలేవాడివిలే..
😇
[7/3, 21:08] +91 79819 72004: దేవుడు అందరు అబ్బాయిలకు ప్రకటించారు.
*"ప్రపంచంలోని ప్రతి*
*మూలలో మీరు నమ్మకమైన మరియు విధేయురాలైన భార్యను కనుగొంటారు!"*
...ఆ తర్వాత ఆయన గుండ్రని భూమిని సృష్టించాడు.
🌍😜🤣
[7/3, 21:17] +91 79819 72004: భార్య... ఏమండి ఉదయం తొమ్మిది అవుతుంది లేవండీ
భర్త... రాత్రి మొత్తం నిద్ర పట్టలేదే ఏదయినాఒకమాట చెప్పు లేస్తా
భార్య...
రాత్రి మీరు చాట్ చేసిన సంధ్య నేనే అది నా ఐడి నే..👍
భర్త.. దబెల్ మనిషి లేచిపోయి పేస్ ఇలా పెట్టాడు 🥺😮🥺
No comments:
Post a Comment