*ఒకడికి డబ్బు అవసరం వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు ..!*
అది గమనించిన వేరే వ్యక్తి అతన్ని ఆపి,
ఒక పరిక్ష పెట్టాడు..!
'' నువ్వు ఈ ఎండలో ఆ బండ మీద 10 నిమిషాలు నిలబడితే 1000 ఇస్తా అన్నాడు కనిపించే ఒక బండను చూపిస్తూ ..!
అవతలి వ్యక్తికి డబ్బు అవసరం గనుక కాళ్ళు కాలుతున్నా సరే అలానే నిలబడ్డాడు..!
అతను ఈసారి 5 నిమిషాలకే 1000 ఇస్తా నిలబడమన్నాడు ..!
వాడు సరే అని కాళ్ళు ఎర్రగా కందిపోతున్నా అలానే నిలుచున్నాడు ..!
ఈ సారి అతను 1 నిమిషానికి 1000 అన్నాడు ..!
అప్పటికే అవసరమైనంత డబ్బు వచ్చేసింది, పైగ స్పృహకోల్పోడానికి సిద్దంగా ఉన్నాడు . అయినా సరే డబ్బు మీదా ఆశతో బలవంతంగా అలానే నిలుచున్నాడు ..!
చివరిగా ఈ సారి సెకనుకి 100000 అన్నాడు ..!
ఒంట్లో శక్తినంతా కూడదీసుకొని నిలబడటానికి ప్రయత్నించి ఆ ఎండ తీవ్రతకు తట్టుకోలేక చచ్చిపోయాడు. . !
అవసరానికి, ఆశకి మధ్య కంటికి కనిపించేంత చిన్న దారం ఒకటి ఉంటుంది., ఆ దారాన్ని మనం సరిగ్గా చూసుకోకుండా దాటామో. .?
మనల్ని ఇంకెవరో చూసుకోవల్సిన పరిస్ధితి వస్తుంది. . .!
ఒక ముద్దకు మించి మనం నోరు తెరవలేం..!
పాదాలు సాగినంత వరకే మన అడుగులు వేయగలం..!
అలాంటిది మన ఆశను మాత్రం హద్దు ఎందుకు దాటనివ్వాలి ..!
హద్దు లేని ఆశ. , తెడ్డు లేని పడవ కుదురుగా ఉండలేవు ..! ఏదో రోజు మనల్ని ముంచేస్తాయి. . .!!! 😊💐
No comments:
Post a Comment