Saturday, July 5, 2025

 *Changalava* *Kameswari* 

'ఆత్మహత్య' ఆడ అయినా, మగ అయినా ఇది ఎవరు చేసుకున్నా తప్పే! భగవంతుడి దయవలన  సర్వాయవాలతో పుట్టి, పెరిగి, విద్యాబుద్ధులు నేర్చి ఉద్యోగాలు చేస్తూ సమాజంలో పేరు తెచ్చుకుని  ఇలా ఆత్మహత్యలు చేసుకుని కన్నవారి కడుపులో చిచ్చు పెట్టడం చాలా తప్పు!

బ్రతుకన్నాక ఆనందాలు బాధలు అన్నీ ఉంటాయి. ఎవరికి చెప్పినా ఎవరూ తీర్చరు. ఆర్ధిక బాధలకు కొంత సహకారం లభిస్తుంది. కానీ, మానసిక క్షోభను తట్టుకోవడానికి ఏదో మార్గం చూసుకోవాలి. అంతే కానీ మరణమే శరణ్యం అనుకోవడం పరిణతి కాదు. ఏరకంగా అయినా ఎవరు పోయినా ఏదీ ఆగదు. అన్నీ యధావిధిగా జరిగిపోతుంటాయి. ఇవన్నీ చూస్తూ కూడా ఆత్మహత్యకి పాల్పడటం సమంజసం కాదు.  
ఏ మనిషిని కదిల్చినా ఎన్నో కథలు, వ్యధలు. నన్ను ఎవరు తిట్టుకున్నా నాకు ఆత్మహత్య చేసుకున్నవారి పైన సానుభూతి కలగదు.  జీవితంలో ఎన్నో ఆటుపోటులు ఎదురైనా, చావాలనిపించదు. అలాగని  బ్రతకాలనిపించే ఆశా వ్యామోహాలు లేవు.  ఎందుకంటే ఎన్నో నిరాశ నిస్ప్రహలు, దాటే వచ్చాము ఇంత కంటే ఏమొస్తాయి అనే మొండితనం అవొచ్చు. మాలాంటి మొండిఘటాలను (సీనియర్ సిటిజన్స్) చూసైనా బ్రతుకు విలువ తెలుసుకోవాలి. వీరి జీవితాలలో అన్నీ సుఖాలే ఉన్నాయా ? తమ 
జీవిత భాగస్వాములను, ఆత్మీయులను కోల్పోయినా, పిల్లలు వృధ్దాశ్రమాల పాలు చేసినా, వృధ్దాప్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నా ఎందుకు బ్రతుకుతున్నారు ? అన్నది ఆలోచించండి. అప్పుడు బ్రతికే ధైర్యం మీకే వస్తుంది.

No comments:

Post a Comment