Friday, August 29, 2025

****ఓకే ఒక్కడి వలన 38 లక్షల మంది భారతీయులు బలి... || Bengal famine of 1943 Documentary in Telugu

 ఓకే ఒక్కడి వలన 38 లక్షల మంది భారతీయులు బలి... || Bengal famine of 1943 Documentary in Telugu

https://youtu.be/DrZsdV5UTpE?si=2d0afIZPqEiG4FuS


మీలో ఎంతమందికి తెలుసు 1947 కంటే ముందు 38 లక్షల మంది భారతీయులు కేవలం ఆకలి కారణంగా తినడానికి ఒక మెతుకు దొరక్క అలమటిస్తూ ఘోరంగా నరకం అనుభవిస్తూ చనిపోయారని  పట్టెడ అన్నం చూపించి ఆడపిల్లల్ని స్త్రీలను ఎంతోమంది సైనికులు జమీందారులు భూస్వాములు వీరంతా వాళ్ళ లైంగిక కోరికలు తీర్చుకున్నాక గాని ఒక్క ముద్ద అన్నం పెట్టేవారు రెండో ప్రపంచ యుద్ధం దాదాపుగా ఆరేళ్ల పాటు జరగగా ఆ యుద్ధంలో పోరాడి చనిపోయిన భారతీయ సైనికుల సంఖ్య 6రు లక్షలు అయితే కేవలం ఒక్క ఆకలి కారణంగా ఒక్క ప్రాంతంలోనే ఒక్క సంవత్సరంలోనే చనిపోయిన భారతీయుల సంఖ్య ఎంతో తెలుసా ఏకంగా 38 లక్షల మందే బెంగాల్ వీధుల్లో మరణించిన వారి డెడ్ బాడీలను ఆ 38 లక్షల మంది అమాయకపు ప్రజల శవాలలో దాదాపు సగం శెవాలను రోడ్ల మీద కుక్కలు రాబందులు పీక్కు తిన్నాయి.  అంటే ఒకసారి మీరే ఊహించుకోండి ఎంత భయంకరమైన పరిస్థితి ఆ సమయాల్లో ఏర్పడిందో దీనినే మన చరిత్ర బెంగాల్ ఫామిన్ ఆఫ్ 1943 అని పిలుస్తుంది. విన్స్టన్ చర్చిల్ భారతీయుల ఆకలి చావులను చూపిస్తూ ఏదైనా సహాయం చేయమని అడగగా ఆయన ఏమన్నాడో తెలుసా ఇండియన్స్ కుందేలు లాగా పిల్లల్ని కంటారు. వారికి ఎంత ఆహారం పంపినా చాలదు చావని అని అన్నాడు.  1947 లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మనందరం సంతోషపడుతున్నాం. కానీ 1947 కంటే ముందు కేవలం నాలుగు సంవత్సరాల ముందు 38 లక్షల మంది భారతీయులు కేవలం ఆకలి కారణంగా తినడానికి ఒక మెతుకు దొరక్క అలమటిస్తూ ఘోరంగా నరకం అనుభవిస్తూ చనిపోయారని మీలో ఎంతమందికి తెలుసు అలా చనిపోయిన ఆ 38 లక్షల మంది అమాయకపు ప్రజల శవాలలో దాదాపు సగం శెవాలను రోడ్ల మీద కుక్కలు రాబందులు పీక్కు తిన్నాయి. ఇక మరికొన్ని శవాలను మిలిటరీ ట్రక్కులతో చెత్తనుఎత్తినట్లుగా ఎత్తి దూరంగా తీసుకెళ్లి కుప్పలుగా పడేసి చెత్తను కాల్చినట్టుగా కాల్చేశారు. మనసును కలిచివేసే విషయం ఏంటో తెలుసా పట్టెడు అన్నం చూపించి ఆడపిల్లల్ని స్త్రీలను ఎంతో మంది సైనికులు జమీందారులు భూస్వాములు వీరంతా వాళ్ళ లైంగిక కోరికలు తీర్చుకున్నాక గాని ఒక్క ముద్ద అన్నం పెట్టేవారు. ఇంకొక విషయం కూడా చెప్తాను. రెండో ప్రపంచ యుద్ధం దాదాపుగా ఆరేళ్ల పాటు జరగగా ఆ యుద్ధంలో పోరాడి చనిపోయిన భారతీయ సైనికుల సంఖ్య 6 లక్షలు అయితే కేవలం ఒక్క ఆకలి కారణంగా ఒక్క ప్రాంతంలోనే ఒక్క సంవత్సరంలోనే చనిపోయిన భారతీయుల సంఖ్య ఎంతో తెలుసా ఏకంగా 38 లక్షల మందే అంటే ఒకసారి మీరే ఊహించుకోండి ఎంత భయంకరమైన పరిస్థితి ఆ సమయాల్లో ఏర్పడిందో దీనినే మన చరిత్ర బెంగాల్ ఫ్యామిన్ ఆఫ్ 1943 అని పిలుస్తుంది. ఆ క్షణాన మన భారతదేశానికి వెళ్తున్న బ్రిటిష్ పాలకుడు విన్స్టన్ చర్చిల్ భారతీయుల ఆకలి చావులను చూపిస్తూ ఏదైనా సహాయం చేయమని అడగగా ఆయన ఏమన్నాడో తెలుసా ఇండియన్స్ కుందేలు లాగా పిల్లల్ని కంటారు. వారికి ఎంత ఆహారం పంపినా చాలదు చావని అని అన్నాడు. ఈ వీడియోలో చాలా చాలా లోతుగా వెళ్లి మరి ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా చరిత్రలో పూడుకుపోయిన నిజాలను సైతం మీకోసం వెతికి మరి తెచ్చి వివరించబోతున్నాను. ఈ వీడియోలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. కేవలం బాధాకరమైన నిజాలు మాత్రమే ఉంటాయి కనుక ఎండ్ వరకు మీరు చూస్తారా లేదా అనేది పూర్తిగా మీ అభిప్రాయం. అసలు 1943 లో బెంగాల్ లో అంత భయంకరమైన కరువు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన ప్రభావం ఏమిటి? ఆ సమయంలో ఎలాంటి భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి? భారతదేశ ప్రజల ఆకలి బాధలను పట్టించుకోకుండా బ్రిటిష్ పాలకుడు వినిస్టల్ చర్చ్ సృష్టించిన విధ్వంసం ఎలాంటిది? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా లోతుగా ఉంటుంది. వీలైతే మీరు ఎయిర్ ఫోన్స్ పెట్టుకొని చూడగలరు మనవి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో.  బెంగాల్ అనగానే ప్రస్తుతం ఉన్న పశ్చిమ బెంగాల్ అనుకుంటూ ఉంటారు. కానీ స్వాతంత్రానికి పూర్వం ప్రస్తుత బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు ఈ ప్రాంతాలన్నీ ఒక్కటిగా ఉండేవి. వీటన్నిటిని కలిపి బెంగాల్ ప్రావిన్స్ అని పిలిచేవారు. కాబట్టి ఈ వీడియోలో బెంగాల్ గురించి ప్రస్తావించిన ప్రతిసారి ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రస్తుత పశ్చిమ బెంగాల్ తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు వీటన్నిటిని కలిపి వీటి గురించి ప్రస్తావిస్తున్నట్లు ఇక బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో కలకత్తాను ప్రధాన నగరంగా చేసుకొని ఈ బెంగాల్ ప్రావిన్స్ ని పాలించేవారు. 19వ శతాబ్దం చివరిలో ప్రపంచం మొత్తం ఆర్థిక మాద్యం ఎదుర్కొంది. భారతదేశంలో కూడా ఈ మాధ్యం ప్రభావం ఉండేది. ఒకవైపు పెరుగుతున్న జనాభా దానికి తగ్గట్టుగా వ్యవసాయ రంగ సామర్థ్యం తగ్గడం ప్రపంచంలో చాలా దేశాల్లో జరిగినంత వేగంగా భారతదేశంలో పారిశ్రామికీకరణ జరకపోవడం అభివృద్ధి మందగించటం అలాగే మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న స్వతంత్ర ఉద్యమం ఇలా ఇవన్నీ కూడా 19వ శతాబ్దం చివరి నుంచే భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడం మొదలు పెట్టాయి. ఈ ప్రభావం బెంగాల్ ప్రావిన్స్ మీద కూడా పడింది. అప్పట్లో బెంగాల్ ప్రావిన్స్ లో 90% మంది ప్రజలకు వ్యవసాయం తప్ప బతికేందుకు ఇంకో ఆధారం లేదు. ముఖ్యంగా బెంగాల్ ప్రావిన్స్ లో అయితే వరి పంట ఎక్కువగా పండించేవారు. ఇక్కడి ప్రజలకు వరే ప్రధాన ఆహారం కూడా. అందుకే బెంగాల్ ప్రావిన్స్ లోని 88% వ్యవసాయ భూమిలో వరి పంట మాత్రమే పండించేవారు. కనుక బెంగాల్ ప్రావిన్స్ లో నుంచి ప్రొడ్యూస్ అయ్యే మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 75% రైస్ ఉత్పత్తి మాత్రమే ఉండేది. కాబట్టి బెంగాల్ ప్రావిన్స్ లో వరి పంటకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంతలో 1942 లో బెంగాల్ ప్రావిన్స్ లో వరి పంటకు కొరత ఏర్పడింది. మెజారిటీ ప్రజల ప్రధాన ఆహారమైన వరిపంట కొరత ఒక్కసారిగా అక్కడ తీవ్రమైన కరువుకు దారితీసింది. 1943 లో ఏర్పడ్డ ఈ కరువుకి ఇదిఒక్కటే కారణం కాదు. అనేక ఆర్థిక సామాజిక రాజకీయ దౌత్య కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటి అనేది ఇంకాస్త వివరంగా లోతుకు కూడా వెళ్లి మరి మీకు చెప్తాను. మొదటిది బెంగాల్ టెనెన్సీ యాక్ట్ 1885 లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ప్రావిన్స్ లో బెంగాల్ టెనెన్సీ యాక్ట్ ను ప్రవేశపెట్టింది. దాంతో భూముల బదలాయింపు ఓనర్షిప్ రైట్స్ ఇలాంటి వాటిలో ఈ చట్టం చాలా మార్పులు తెచ్చింది. దాంతో జమీందారులు తయారయ్యారు. భూస్వాములు పుట్టుకొచ్చారు. దాని ద్వారా చిన్న చిన్న రైతులకు భూమి హక్కులు లేకుండా పోయాయి. కవులు వ్యవసాయం చేయడం మొదలైంది. పండిన పంటలో చాలా భాగం భూస్వాములకు పన్ను కట్టేందుకు వెళ్ళేది. అలా లాభాలు తక్కువగా వచ్చేవి. 1885 లో ప్రవేశపెట్టిన ఈ చట్టం రాను రాను చాలామంది రైతుల పాలిట శాపంగా మారింది. ఇక రెండో కారణం నీటి సమస్య. బెంగాల్ ప్రావిన్స్ అనేది గంగా బ్రహ్మపుత్ర నదులకు డెల్టా ప్రాంతంలో భాగంగా ఉండేది. గంగా బ్రహ్మపుత్ర నదులతో పాటు వాటి ఉపనదులు వీటన్నిటి ద్వారా బెంగాల్ ప్రాంతంలో నీటి లభ్యత చాలా చక్కగా ఎక్కువగా ఉండేది. కానీ 1890 తర్వాత బెంగాల్ ప్రావిన్స్ లో రైల్వేలను డెవలప్ చేయడం మొదలు పెట్టారు. రైల్వే వ్యవస్థను నిర్మించడానికి సహజ నీటి వనరులను ధ్వంసం చేశారు. నీటి సరఫరాకు అంతరాయం కలిగించడం మొదలుపెట్టారు. ఇలాంటి అనేక కారణాల వల్ల బెంగాల్ ప్రావిన్స్ లో నీటి సమస్య వలన వ్యవసాయ రంగం ప్రభావితం అవుతూ వచ్చింది. ఈ కారణాలన్నీ ఒకేసారి ప్రభావం చూపకపోయినా, రాను రాను వ్యవసాయ రంగం క్షీణించడానికి కారణం అయ్యాయి. ఇక మూడోది వరల్డ్ వార్ 2. రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యే సమయానికే బెంగాల్ ప్రావిన్స్ లో వ్యవసాయ రంగం అనేది పై రెండు కారణాల వలన కాస్త దెబ్బతింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో 1939 లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ సమయంలో విన్స్టర్ చర్చిల్ ఇతను బ్రిటన్ కి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం మొదలైందో మన దేశ ఆర్థిక వనరులని ఇతను మరింత ఎక్కువగా దోచుకోవడమే కాకుండా బ్రిటన్ ప్రభుత్వం ఇండియన్ బడ్జెట్లో కోతలు విధించింది. దాంతో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం అవ్వడంతో పాటు ఇండియాలో పాలనాపరమైన నిర్లక్ష్యం కూడా విపరీతంగా పెరిగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా 1941 లో జపాన్ సైన్యం బర్మా మీద దండయాత్ర చేసింది. అయితే ఈ బర్మా అనేది బెంగాల్ ప్రావిన్స్ కి ఆనుకొని ఉండే దేశం. దాంతో జపాన్ సైన్యం ఎప్పుడైతే బర్మాలోకి ప్రవేశించింది అని తెలిసిందో బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే బెంగాల్ ప్రావిన్స్ లోకి సైనికుల్ని పంపించింది. ఇలా వచ్చిన ఈ బ్రిటిష్ సైనికులంతా బెంగాల్ ప్రజల వ్యవసాయ భూముల్లో పంటలను సైతం తొక్కేసి మరి వారి సైనిక స్థావరాలని ఎయిర్ స్ట్రిప్లను నిర్మించుకున్నారు. దాంతో చాలా పంటలు ధ్వంసం అయ్యాయి. ఇంతలో జపాన్ సైన్యం బర్మా మీద బాంబుదాళ్లు చేసింది. దాంతో బర్మా దేశం మొత్తం దాదాపుగా నాశనం అయింది. దాంతో బెంగాల్ ప్రావిన్స్ సమీపంలో జరిగిన ఈ దాడి వల్ల సరిహద్దు వెంబడి ఉండే ప్రజలు బెంగాల్లోకి వలస రావడం మొదలుపెట్టారు. బర్మా ప్రజలు యుద్ధ భయంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం బెంగాల్ అస్సం గుండా లక్షలాది మంది భారతదేశంలోకి వలస వచ్చారు. ఇలా మొదలైన ఈ వలసలు అనేవి ఎంతగా అడ్డుకున్నా ఐదు నెలల పాటు ఆగలేదు. దాదాపు 5 లక్షల మంది బర్మా ప్రజలు భారతదేశంలోకి వచ్చేశారు. ఇలా భారతదేశంలోకి చొరబడ్డ వారిలో చాలా మంది బెంగాల్ ప్రావిన్స్ లోనే ఉండిపోయారు. దాంతో జనాభా పెరిగిపోయింది. వలస వచ్చిన వారికి ఉపాధి లేక ఆహారం లేక దేశంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఇక్కడే ఉన్నారు. ఆ సమయంలో సరైన నీరు, ఆహారం పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడం వల్ల అంటు వ్యాధులు పుట్టుకొచ్చాయి. దాంతో విపరీతంగా మలేరియా, కలర, మసూచి వంటి వ్యాధులు వ్యాపించాయి. దాంతో బెంగాల్ ప్రావిన్స్ లోని ఆసుపత్రుల్లో మందులు కూడా అయిపోయాయి. కేవలం బర్మా నుంచి అక్రమంగా ఇలా వలస వచ్చిన వారి నుంచి వ్యాధులు బెంగాల్ ప్రావిన్స్ ప్రజలకు కూడా అంటుకున్నాయి. ఇక అవతల వైపు చూస్తే బర్మా దేశం పూర్తిగా జపాన్ సైన్యం ఆధీనంలోకి వెళ్ళింది. దాంతో బంగాళ ఖాతం మీద జపాన్ సైన్యం ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టింది. ఎంతలా అంటే భారతదేశానికి వచ్చే సరుకులు, ఆహార ధాన్యాలు, నౌకల మీద సైతం జపాన్ సైన్యం దాడులు చేయడం మొదలు పెట్టింది. దాదాపు లక్ష వేల టన్నుల సరుకు కలిగిన వ్యాపార నౌకల్ని జపాన్ సైన్యం దాడి చేసి మరి ధ్వంసం చేసింది. దాంతో భారతదేశం బంగాళ ఖాతం వైపు సముద్ర మార్గాన్ని మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలా సముద్ర మార్గం మూసివేయడంతో బెంగాల్ ప్రవిన్స్ కు చేరాల్సిన వస్తువులు ఆహార ధాన్యాల మీద ప్రభావం పడింది. మరోవైపు రైల్వేల ద్వారా సరుకుల రవాణ చేసినా కూడా ప్రజల అవసరాలు తీర్చే స్థాయిలో వస్తువులు అందుబాటులో లేవు. దాంతో బెంగాల్ ప్రావిన్స్ లో డిమాండ్ ఏర్పడి వస్తువులకు సరుకులకు ధరలు పెరిగాయి. చివరకు యుద్ధం వలన ఏర్పడిన సంక్షోభంతో వ్యాపారులంతా తమ వద్ద ఉన్న సరుకుల్ని వస్తువుల్ని ఆహార ధాన్యాల్ని అమ్మకుండా దాచుకునేలా చేసింది. దాంతో బ్లాక్ మార్కెట్ వ్యాపారం విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఊహించిన దానికన్నా ఎక్కువ కావడం వల్ల సామాన్య ప్రజలు ఆ ధరలను తట్టుకోలేకపోయారు. దరిద్రం ఏంటంటే ఇదే బెంగాల్ ప్రావిన్స్ లో ఆ సమయంలో 1942 లో మిలిటరీ రిక్రూట్మెంట్లు ఎక్కువయ్యాయి. అమెరికా బ్రిటన్ దేశాల నుంచి వేలాది మంది సైనికులు బెంగాల్ ప్రావిన్స్ లో వచ్చి మకాం వేశారు. వీరితో పాటు భారతదేశంలో ఉన్న ఇతర ప్రాంతాల సైనికుల్ని కూడా బెంగాల్ ప్రావిన్స్ కి తరలించారు. ఎందుకంటే జపాన్ బర్మాను ఆక్రమించుకోవడం, బర్మా మీద దాడులు చేయడం వల్ల బర్మా ప్రజలు బెంగాల్ ప్రావిన్స్ లోకి వలస వచ్చారు. కనుక జపాన్ వారు ఈ బర్మా మీదగా భారతదేశంలోనికి వస్తారేమో అనే ముప్పును అడ్డుకోవడం కోసం వేలాది మంది భారత సైనికులు కూడా బెంగాల్ ప్రావిన్స్ లోనే తిష్టవేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏకంగా సైనికులకు అవసరమైన సైనిక స్థావరాల నిర్మాణం కోసం మొదట్లో పంటల్ని నాశనం చేసి అక్కడ వేయగా ఈసారి ఏకంగా బెంగాళీలను వాళ్ళ ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. సుమారు 30 వేల కుటుంబాల ప్రజలు సైనికుల కోసం ఇళ్ల నుంచి భూముల నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. వీరందరికీ నష్టపరిహారం లభించినా కూడా శాశ్వతంగా ఉపాధి లేకుండా పోయింది. ఇలా అసలే నలిగిపోతున్న బెంగాల్ ప్రావిన్స్ లోకి ఒకవైపు అక్రమ వలసదారులు మరోవైపు బ్రిటిష్ అమెరికా సైనికులు ఇంకోవైపు భారతీయ సైనికులు ఇలా అందరూ వచ్చి ఇక్కడికే చేరడంతో ఈ ప్రాంతంలోని సామాన్య ప్రజలకు ఆశ్రయం లేకుండా పోయింది. ఇలా ఒకవైపు పెరిగిపోతున్న అంటు వ్యాధులు మరోవైపు వైద్యం మందులు అయిపోవడం వీటికి తోడు పూర్తిగా మూసివేయబడ్డ సముద్ర మార్గం చాలి చాలని రైల్వే వ్యవస్థ దిగుమతులకు ఎగుమతులకు ఇబ్బంది ఆహార కొరత వ్యవసాయ రంగ పతనం ఇలా 1942 లో బెంగాల్ ప్రావిన్స్ లోని పరిస్థితులు దిగజారడానికి అన్ని కారణాలు తోడయ్యాయి. వీటికి తోడు ప్రభుత్వ నిర్ణయాలు కూడా బెంగాల్ ని పతనం వైపు నడిపించాయి. ఇదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక చండాలమైన ఆలోచన పుట్టింది. ఒకవేళ జపాన్ సైన్యం బంగాళ ఖాతం నుంచి బెంగాల్ మీదగా ఇండియాలోకి ప్రవేశిస్తే ఇండియాలో ఉన్న వనరులు అన్నిటిని దక్కించుకుంటుంది అని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. కనుక జపాన్ సైన్యం ఒకవేళ ఇండియాలోకి ప్రవేశించినా కూడా వారికి ఎలాంటి ప్రతిఫలం లేకుండా చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం ముందుగానే కొన్ని డినాయల్ పాలసీలు అమలు చేసింది. అంటే బంగాళ ఖాతం తీరం వెంట ఉన్న బకర్గంజ్, కల్నా, మిడ్నాపూర్ ఈ మూడు జిల్లాల్లో ఉన్న బియ్యం నిల్వని వెంటనే తరలించాలని తరలించడం వీలు కాకపోతే బియ్యం నిల్వని అక్కడే ధ్వంసం చేయాలని అంతే తప్ప బియ్యం అనేది ఆ ప్రాంతంలో ఉండకూడదు అంతే అని అప్పటి బెంగాల్ ప్రావిన్స్ గవర్నర్ జాన్ హెర్బర్ట్ ఆదేశాలు జారీ చేశాడు. దాంతో ఈ మూడు జిల్లాల్లో బియ్యం నిలవలు లేకుండా చేసేందుకు రైతుల ఇళ్ల నుంచి ధాన్యాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకొని సైనికుల కోసం తరలించారు. తరలించడం సాధ్యం కాని చోట ధాన్యాన్ని నాశనం చేసి తినడానికి పనికి రాకుండా మార్చారు. ఆ తర్వాత తీరం వెంబడి ఉన్న భారి పడవల్ని బెంగాల్ ప్రావిన్స్ లో ఉండే పడవల్ని జపాన్ సైన్యం స్వాధీనం చేసుకుంటుందేమో అన్న అనుమానంతో ఆ పడవల్ని కూడా నాశనం చేసేశారు. అసలకే తిండి సరిపడా లేక చస్తున్నారు అనుకుంటుంటే భారతీయులు చచ్చినా పర్లేదు జపాన్ వాళ్ళకు మాత్రం ఆహారం దొరకకూడదు అన్న దరిద్రమైన ఆలోచనతో బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టల్ చర్చిల ఆదేశాలతో బెంగాల్ ప్రావిన్స్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ఆహారదానిల కొరత ఏర్పడడమే కాకుండా బ్రహ్మపుత్ర నది మీద జలరవాణ పూర్తిగా స్తంభించిపోయింది. చేపలు పట్టే వారికి జీవనోపాధి లేకుండా పోయింది. వీటితో పాటు 1942 లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులని యుద్ధ భయాలను దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో ఉన్న ఇతర ప్రావిన్సులు పంజాబ్, మద్రాస్, బీహార్, ఒరిస్సా ఇలా ఇతర ప్రావిన్సుల్లో ఎగుమతులు నిషేధించారు. పంజాబ్ నుంచి బెంగాల్ ప్రావిన్స్ కి గోధుమ ఎగుమతి అయ్యేది కానీ ఎగుమతులు నిషేధించడంతో బెంగాల్ కి గోధుమ గుమతి నిలిచిపోయింది. ఇక 1942 లో బెంగాల్లో సైనికులకు కావలసిన యుద్ధ పరికరాలు తయారు చేసే పరిశ్రమలు వెలిసాయి. కానీ బెంగాల్లో పరిస్థితులు దిగజారడంతో ఆ పరిశ్రమల్లో పని చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించలేదు. దాంతో కార్మికులు వెనక్కి వెళ్ళకుండా ఉండేందుకు పనికి ఆహార పథకాన్ని బెంగాల్ ప్రభుత్వం అమలు చేసింది. దానివల్ల బెంగాల్ పరిశ్రమల్లో కార్మికులకు ఇవ్వాల్సిన ఆహార ధాన్యాలను ప్రభుత్వం సేకరించడంతో సామాన్య ప్రజలకు ఆహార ధాన్యాల ధరలు మరింత ఎక్కువయ్యాయి. ఇంతలో 1942 ఆగస్టు 8న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. స్వతంత్ర పోరాటం చేస్తున్న వారిని జైల్లో పెట్టడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్లు వంతెనలు రైల్వేలను ఉద్యమకారులు ధ్వంసం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం కూడా బెంగాల్లో పరిస్థితి దిగజరడానికి కొంత కారణం అయింది. ఇలా చివరికి బెంగాల్ పూర్తిగా కరువు కోరల్లోకి వెళ్ళిపోయింది. 1943 లో ఇన్ఫ్లేషన్ ఘోరంగా పెరగడం ధరల నియంత్రణ లేకపోవడంతో సామాన్యులకు కనీసం ఆకలి తీర్చుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అలా 1943 లో బెంగాల్ ప్రావిన్స్ ప్రజలు ఆకలితో అలమటించారు. బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టల్ చర్చల్ కి బెంగాల్ లో ఉన్న పరిస్థితి గురించి వివరించిన ఆయన బెంగాల్ ప్రజలను కరువు నుంచి కాపాడేందుకు కావలసిన అత్యవసర నిర్ణయాలు తీసుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. కేవలం ఆయన ధ్యాస అంతా రెండో ప్రపంచ యుద్ధం మీదే ఉండేది. ఈ ఇబ్బందుల వలన ప్రజల్లో అశాంతి అభద్రత భావం పెరిగిపోయాయి. దాంతో బెంగాల్ ప్రజలు ఆకలి తట్టుకోలేక దొంగతనాలు చేయడం ప్రారంభించారు. దుకానాల మీద దాళ్లు జరిగాయి. పంటను కూడా దోచుకోవడం మొదలు పెట్టారు. కానీ ఇవన్నీ బెంగాల్ ప్రజలకు కొంతకాలం మాత్రమే ఆకలిని తీర్చాయి. మరోవైపు కలర్ర, మలేరియా, మసూచి లాంటి వ్యాధులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆసుపత్రిలో కనీసం వైద్య సదుపాయలు కూడా కరువయ్యాయి. మందులు కూడా అందుబాటులో లేవు. ఇలా 1943 లో బెంగాల్ అత్యంత దారుణమైన వైపరిత్యాన్ని ఎదుర్కొంది. బెంగాల్లో ప్రజలకు చేసేందుకు పనిలేదు. ఆహారదాలు కొనుక్కునే స్తోమత కూడా లేదు. దాంతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుటుంబాలు విచ్చిన్నం అయ్యాయి. కలకత్తా చిట్టాగాంగ్ డాకా లాంటి నగరాల్లో ఎక్కడ చూసినా భిక్షాటన చేస్తున్న చిన్న పిల్లలే కనిపించేవారు. చాలి చాలని బట్టలు అపరిశుభ్ర వాతావరణంలో ఎండకి వానకు లెక్క చేయకుండా భిక్షాన చేస్తున్న చిన్న పిల్లలకు అంటు వ్యాధులు చుట్టుముట్టాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నగలను ఆస్తులని అమ్ముకొని ఆకలి తీర్చుకున్నారు. బెంగాల్ ప్రజలు ఇంతలా ఇబ్బందులు పడుతుంటే బ్రిటన్ ప్రభుత్వం ఘోరమైన ఆలోచన చేసింది. వీరినంతా సైన్యంలో చేర్చాలని చెప్పింది. దాంతో గతి లేకపోయేసరికి అసలు ఎటువంటి యుద్ధ నైపుణ్యం లేకుండా ప్రాణాలకు తెగించి లక్షలాది మంది బెంగాళీలు బ్రిటిష్ సైన్యంలో చేరారు. కేవలం తిండి కోసం సైన్యంలో చేరారు. ఆకలి తీర్చుకోవడం కోసం సైన్యంలో చేరిన వారితో బ్రిటిష్ ప్రభుత్వం వెట్టి చాకరి చేయించింది. బెంగాల్ లో పారిశుద్ధ పరిస్థితులు కూడా విపరీతంగా దిగజారాయి. బెంగాల్ వీధుల్లో చెత్త పేరుకుపోయింది. చెత్త కుప్పల్లో దొరికే ఆహారం కోసం కూడా అప్పట్లో బెంగాల్ ప్రజలు ఎగబడ్డారు. ఎటు చూసినా చెత్త మురికి రోగాలు వచ్చిన వారితో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కరువు సృష్టించిన విద్వంసానికి బెంగాల్ పడిన బాధల వర్ణాతీతం. ఇక బెంగాల్ వీధుల్లో అంటు వ్యాధులతో ఆకలితో మరణించిన వారి శవాలను తీయడం కూడా అప్పటి ప్రభుత్వానికి తలకు మించిన భారం అయిపోయింది. శవాలను తరలించడానికి మిలిటరీ ట్రక్కులను ఉపయోగించారు. జపాన్ సైన్యాన్ని ఎదుర్కోవడం కోసం బెంగాల్ సరిహద్దుల్లో ఉన్న సైన్యం చివరికి భారతీయుల శవాలను తరలించడానికి ఉపయోగపడ్డారు. మరణించిన వారిని చూసేందుకు సొంత కుటుంబ సభ్యులు సైతం రాలేని పరిస్థితి ఏర్పడింది. బెంగాల్ వీధుల్లో మరణించిన వారి డెడ్ బాడీలను కుక్కలు రాబందులు పిక్కుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం భారతదేశం మీద దండయాత్ర చేయాలనుకున్న జపాన్ సైన్యం బెంగాల్లో ఉన్న భయంకర పరిస్థితి గురించి తెలుసుకొని వెనక్కి తగ్గింది. ఎక్కడ వ్యాధులు తమకు వస్తాయో అన్న భయంతో జపాన్ సైన్యం భారతదేశంలోకి ప్రవేశించే సాహసం చేయలేకపోయింది. ట్రక్కుల్లో తరలించిన శవాలను సైనికులు కుప్పలుగా పేర్చి సామూహిక దహన సంస్కారాలు నిర్వహించారు. 1943 బెంగాల్ కరువులో మరో దారుణమైన చీకటి కోణం ఏంటంటే మహిళలు, ఆడపిల్లలు ఆకలి తీర్చుకునేందుకు వ్యభిచార వృద్ధులకు వెళ్లారు. భూస్వాములు, జమీందారులు డబ్బు ఉన్నవారు వీరంతా స్త్రీలకు, ఆడపిల్లలకు డబ్బు ఆశ చూపించి లైంగిక కోరికలు తీర్చుకున్నారు. బ్రిటన్ అమెరికాలో నుంచి వచ్చిన సైనికులు సైతం ఆహారాన్ని ఆశగా చూపించి బెంగాల్ మహిళల మీద ఆడపిల్లల మీద లైంగిక దాడులు చేశారు. వేలాది మంది మహిళల్ని చిన్న పిల్లల్ని విదేశాలకు కూడా తరలించారు అనే ఆరోపణలు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు ఎన్జీఓలు బెంగాల్ ప్రజల ఆకలి తీర్చే ప్రయత్నం చేసిన అవన్నీ కొంతమందికే ఉపయోగపడ్డాయి తప్ప మెజారిటీ ప్రజల ఆకలి తీర్చేందుకు ఏమాత్రం సరిపోలేదు. కానీ క్రమంగా సహాయ కార్యక్రమాలు పెరిగాయి. ప్రభుత్వం కూడా బెంగాల్ లో ఉన్న పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ముందుగా వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మొదలు పెట్టారు. వ్యవసాయానికి కావలసిన విత్తనాలని పరికరాలని ఉచితంగా పంపినీ చేశారు. ప్రజలకు పశువులు కొనుగోలు చేసేందుకు రుణాలు అందివ్వడం మొదలైంది. ప్రభుత్వం నుంచి వస్తున్న వ్యవసాయ సహాయాన్ని ఎక్కువగా భూస్వాములు సంపన్న వర్గాల వారు అందుకున్నారు. కానీ క్రమంగా సహాయ కార్యక్రమాలు పెంచడంతో చిన్నకారు రైతులు కూడా సహాయాన్ని అందుకున్నారు. పనికి ఆహారం కొంత డబ్బు ఇవ్వడానికి బ్రిటన్ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. దాంతో పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న పనుల్లో చేరారు. ధరల నియంత్రణ అమలు చేశారు. దాంతో ఆహార ధాన్యాలు ధరలు కాస్త తగ్గాయి. అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్న వారి మీద చర్యలు ప్రారంభించారు. బ్రిటిష్ ప్రభుత్వం పంజాబ్ ఒరిస్సా బీహార్ ప్రావిన్సుల గవర్నర్లతో మాట్లాడి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. విదేశాల నుంచి మందులు దిగుమతి అయ్యాయి. క్రమంగా పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు మొమ్మరమయ్యాయి. దేశ విదేశాల నుంచి మిషనరీలు, ధార్మిక సంస్థలు, చారిటబుల్ ట్రస్టులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఇలా అనేకమంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు. బ్రిటన్ ప్రభుత్వం మీద వస్తున్న విమర్శను తట్టుకోలేక సహాయచర్యలకు ఆహార పంపినీకి మిలిటరీని ఉపయోగించారు. విమానాల ద్వారా గ్రామాల్లో కూడా సహాయక కార్యక్రమాలు నిర్వహించారు. క్రమంగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. దాదాపు నాలుగు నెలల పాటు తీవ్రమైన కరువు పరిస్థితుల తర్వాత క్రమంగా ప్రజల స్థితిగతులు మారుతూ వచ్చాయి. కానీ పరిస్థితి పూర్తిగా అదిలోకి రావడానికి మరో నాలుగు నెలలు పట్టింది. 1943 బెంగాల్ కరువుకి అనేక కారణాలు ఉన్నాయి. ప్రతి కారణం వెనుక మానవ తప్పిదాలు ప్రభుత్వ తప్పు నిర్ణయాలు రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన భయం ఇలా చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశ చరిత్రలో అతి పెద్ద కరువు ఇదే. 1939 నుంచి 1945 వరకు దాదాపు ఆరేళ్ల పాటు జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పోరాడిన వారిలో 6రు లక్షల మంది సైనికులు మరణించారు. కానీ 1943 బెంగాల్ కరువు మాత్రం 38 లక్షల మంది ప్రాణాలు తీసింది. కాబట్టి ఆనాటి కరువు పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 38 లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా కరువు తీవ్ర రూరం దాల్చడానికి ప్రధాన కారణం మాత్రం బ్రిటన్ ప్రభుత్వం. బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ కి బ్రిటన్ లో మంచి పేరు ఉంది. గొప్ప పాలకుడిగా ఆయనకి ఇప్పటికీ బ్రిటన్ లో గుర్తింపు లభిస్తుంది. కానీ భారతదేశ చరిత్రలో అత్యంత అమానవీయ దయనీయ పరిస్థితి ఏర్పడడంలో మాత్రం చర్చిల నిర్లక్ష్యాన్ని కాదలలేం. బెంగాల్లో దిగజారుతున్న పరిస్థితుల గురించి వినేందుకు సమీక్షించేందుకు కూడా చర్చిల్ ఆసక్తి చూపించలేదు. పాలకుడిగా చర్చిల నిర్లక్ష్యం ప్రజలకు శాపం అయింది. లక్షల మంది ఆకలి చావులకు చర్చిల కారణం. చర్చిలకు భారతదేశం పట్ల ఏమాత్రం గౌరవం ఉండేది కాదు. బెంగాల్లో పరిస్థితి పూర్తిగా దిగజారిన తర్వాత కానీ చర్చిలకు బెంగాల్ గురించి చర్చించేందుకు మనసు రాలేదు. బెంగాల్ కరువు నష్టం మీద చర్చల సందర్భంగా భారతీయులను ఉద్దేశించి ఇండియన్స్ కుందేలలాగా పిల్లల్ని కంటారు. వారికి ఎంత ఆహారాన్ని పంపించినా చాలదు అని చులకనగా మాట్లాడాడు. ఆనాటి ఇండియన్ ఫారెన్ అఫైర్స్ మెంబర్ లియోపాల్డ్ అమేరీ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. కాబట్టి చర్చిలకి భారతీయుల మీద ఉన్న ఉద్దేశం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కరువు నష్టాన్ని కారణాల్ని అంచన వేయడానికి 1945 లో ఏర్పాటు చేసిన ఫెమెన్ ఎంక్వైరీ కమిషనర్ రిపోర్ట్ ఆధారంగా ఈ వివరాలు బయటిక వచ్చాయి. 1943 లో 38 లక్షల మంది ఆకలి చావులకు సంబంధించిన విషయాలను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం బయటికి రానివ్వలేదు. కానీ 1943 నాటి బెంగాల్ భయానక పరిస్థితులకు సౌమిత్ర చటర్జీ లాంటివారు సాక్ష్యంగా ఉన్నారు. బెంగాల్ అంటేనే కవులు రచయితలకు ప్రసిద్ధి కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్థసేన్ లాంటి అనేకమంది అప్పటి బెంగాల్ కవులు రచయితలు బెంగాల్లో కరువు చేసిన కరాల నృత్యం గురించి చాలాసార్లు వారి వారి రచనలు ప్రస్తావించారు. అయినా బ్రిటిష్ పాలనలో జరిగిన అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటైన ఈ బెంగాల్ కరువు గురించి ఇప్పటికీ చాలా మందికి పెద్దగా తెలియకపోవడం బాధాకరం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చరిత్రలో జరిగిన ఈ అతి భయంకరమైన సంఘటనను మీకు వివరించడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ పరంగా ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక్కడి నుంచి రాబోతున్నాయి. అవన్నీ వెంట వెంటనే మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని ఆల్ లో పెట్టుకోగలరు.

No comments:

Post a Comment