Saturday, August 23, 2025

 @ నేర్పుతో గెలవాలి @ 48
       తేది:23/08/2025
""""""""""""""""""""""""""""""""""""""""

'ఊరికే ఉంటే ఊరా పేరా,
కర్ర తేరా కలిబెట్టుతాను' అన్నాడట వెనకటికి ఎవరో నిజమే కదా ఏమీ చెయ్యకుండా ఉండే
వాళ్లకి ఏ సమస్యా ఉండదు ఏదైనా చేయాలనుకుంటేనే కదా
మంచో చెడో కష్టమో సుఖమో ఎదురయ్యేది
ఏ సమస్యలూ,
లేకుండా అంతా సాఫీగా సాగిపోతుంటే జీవితంలో
థ్రిల్ఏముంటుంది..?
అందుకే వచ్చే సమస్య పోయే సమస్య
అన్నట్లుగా ఉందనుకోండి, అనుభవంతో రాటుదేలుతాం
పెద్దలు చెప్పనే చెప్పారు కదా...
కాలు తడవకుండా ఏరుదాటలేం, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం అని...
అయినా కొందరు సమస్య అన్న మాట వింటేనే వణికిపో
తారు మనశ్శాంతిని కోల్పోతారు
తిండి తినరు,నిద్ర పోరు
ఇంటిని సైతం అశాంతిమయం చేసేస్తారు
ఇంకొందరుంటారు వాయిదా పద్ధతుంది దేనికైనా
అన్నట్లు సమస్యల్ని కూడా వాయిదా వేస్తూ కాలం గడిపేస్తుంటారు
మరికొందరిది కాలమే అన్నిటినీ పరిష్కరిస్తుంది అనే
సిద్ధాంతం అందుకని వీరసలు దాని గురించి ఆలోచించకుండా
తమ పని తాము చేసుకుపోతుంటారు వీళ్లందరితోనూ అంత
ఇబ్బంది లేదు కానీ ప్రతి సమస్యనీ ప్రపంచ యుద్ధం
స్థాయిలో సీరియస్ గా తీసుకునే వాళ్లుంటారే వారితోనే గొడవంతా...!
వీళ్లకు ప్రతి సమస్యా రెడీమేడ్ గా
పరిష్కారం కావాలి
లేకపోతే తీవ్ర ఒత్తిడికి లోనై ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు
లేదా ఎదుటివారి ప్రాణాలమీదికి తెస్తారు అలాంటి వాళ్లంతా
చేయాల్సింది సమస్య ఎదురైనప్పుడు ఆవేశపడకుండా కూల్ గా
ఆలోచించడం ఎందుకంటే ఒక ప్రఖ్యాత రచయిత అన్నట్లు
'ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది
పరిష్కారం లేని
సమస్య ఉంటే ఆ తప్పు సమస్యది కాదు,పరిష్కారం
కనుక్కోలేని ప్రయత్నానిది
ప్రతి తాళానికీ ఒక చెవి కూడా ఉంటుంది
కాకపోతే
అది దొరకడానికి మనకు కాస్త సమయం పడుతుండొచ్చు
అంతేకానీ చెవి లేకుండా మాత్రం తాళం ఉండదు అంటారు
మరో ఆంగ్ల రచయిత ఇక్కడ తాళమూ చెవీ అంటే
ఆయన ఉద్దేశం సమస్యా పరిష్కారమూ అని
'సమస్య'ను భూతద్దంలో చూస్తున్నంతసేపు అది మనల్ని
భయపెడుతూనే ఉంటుంది సవాలుగా తీసుకుని పరిష్కారం
మీద దృష్టి పెడితే ఎంతటి సమస్య అయినా దూదిపింజలా
తేలిపోతుంది మనిషికి కావాల్సిందల్లా
కాస్త ఓర్పు
మరింత
నేర్పు అసలు సమస్యకి భయపడకూడదు,
వాయిదా వేయకూడదు, దానికి దూరంగా పారిపోనూకూడదు ఆఫీసు సమస్య
అయితే సహోద్యోగులతో, ఇంటి సమస్య అయితే కుటుంబసభ్యులతో...
విడమరిచి చర్చించాలి తప్పనిసరిగా ఏదో ఒక
పరిష్కారమార్గం దొరుకుతుంది ఒకవేళ అప్పటికి దొరక్కపోయినా సమస్య భారం పదిమందీ పంచుకున్నట్లు అవుతుంది
ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు దానినుంచి బయటపడే
మార్గం స్ఫురించకపోదు అంతేకానీ
@ ఎక్కిళ్లు పెట్టి ఏడుస్తూ
కూర్చుంటే కష్టం పోదు కదా..!@

No comments:

Post a Comment