*ఆ నాటి రాజుల కాలంలో యుద్ధ తంత్రాలు*, కోట లలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉండేవో తెలుసా?. ఈ నాటికీ, ఆనాటి నిర్మాణ కౌశలం, నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం అద్భుతం. వెయ్యేళ్ల నాటి చంద్ర గిరి కోట లోకి దారి తీసే మార్గాలే, యుద్ద నైపుణ్యం తో రూపొందించినవి. మొట్ట మొదట కోట లోకి దారి తీసే మార్గంలో రాతి కట్టడం చుటూ పెద్ద అగడ్త ఉండేది. ఇప్పటికీ దాని ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఆ తరువాత రాజులను, రాజ్యాన్నీ కాపాడే దైవంగా కొలిచే ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది. ఇది కోటకు దారితీసే మలుపుల్లో, రాతితో నిర్మించిన దుర్బేధ్యమైన మలుపుల మొదట్లోనే ఉంటుంది. ఈ ఆలయం నుంచే కోటలోకి దారి మొదలవుతుంది. అతిపెద్ద కొండ రాళ్లతో ఇటు మూడు మలుపులు, అటు మూడు మలుపుల్లో ఈ ప్రవేశ మార్గం విరమించారు. ఈ మార్గాల్లో మలుపులు ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా.?, శత్రువులు చొరబడే సమయంలో మలుపుల్లో పొంచి వారిమీద దాడులు చేసే అవకాశం. కోసమే ఈ ఏర్పాటు జరిగింది. గుర్రాలైనా, ఏనుగులైనా మలుపులు వద్ద వేగం తగ్గించుకోవలసిందే. అలాంటి సమయాల్లోనే శత్రువులపైకి దాడులు సులభం చేయవచ్చు. ఈ ఉద్దేశంతోనే కోటకు దారి తీసే మార్గంలో ఇలాంటి మలుపులతో దారి ఏర్పాటు చేస్తారు. దానిచుట్టూ అతి పెద్ద బండరాళ్ళతో 12 అడుగుల ఎత్తులో, ఐదు అడుగులమందంతో రాతి గోడ నిర్మించారు. ఈ గోడ నిర్మాణం జరిగి ఇప్పటికి వెయ్యేళ్ళు. అయినా చెక్కు చెదరకుండా ఉంది. రాయి మీద రాయి పెట్టారు. అంతే. అయితే ఆ రాళ్లను లాకింగ్ సిస్టంలో పెట్టడంతో ఇప్పటికీ ఒక్క సెంటీ మీటర్ కూడా వాలలేదు. అదీ పురాతన కాలంలో విశ్వ కర్మల మేధస్సు, నేటికీ అర్ధం కాని నిర్మాణ రహస్యం.
No comments:
Post a Comment