*సుద్ద ముక్క ఘనత*
సుద్దముక్కలే నని
తీసి పారేయకు
ఆ సుద్దముక్కలే నిర్మిస్తాయి
అందమైన సుందర దృశ్యాలు
అవే ఉన్నాయి
అనేక రకాలు
తెలుపు ఎరుపు
పసుపు నలుపు ఎలా ఎన్నో...
వానితో
వేస్తారు చిత్రాలు
గీస్తారు ముగ్గులు
దిద్దుతారు రంగులు
ఆ సుద్దలతోనే
అమోఘంగా వనితలు
ముగ్గులు వేయడం
చక్కని చిత్రాలు వేస్తూ
ఉపాధ్యాయులు నల్లబల్లపై వ్రాయుటకు
పిల్లలు అక్షరాలు వ్రాయుట దిద్దుట
గీతలు గీయుట చేస్తారు
ఇలా సుద్ద ముక్కలతో
ఆ దృశ్యాలు చిత్రాలు
చూపరులకు ఇస్తాయి
అమోఖం ఆనందాలు
ఇంటికి ఇస్తాయి శోభ
సుద్ద ముక్కలతోనే
బడులలో వ్రాయడం జరిగేది
ఆ సుద్దలే లేకుంటే
అయ్యవారు ఏమి చేయలేరు
కొందరికి ఇస్తాయి జీవన భృతి
కొందరు చేస్తారు వ్యాపారాలు
అలా ఎందరో బతుకులకు మూలం
*ఇదే సుద్ద ముక్క ఘనత*
*మిడిదొడ్డి చంద్రశేఖరరావు రిటైర్ ఉపాధ్యాయుడు ఒంగోలు 9908413837*
No comments:
Post a Comment