Sunday, August 31, 2025

 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

జ్ఞానం గొప్పదా.అనుభవ జ్ఞానం గొప్పదా.

ఈ రోజుల్లో అనేక ఆధ్యాత్మిక విషయాలు వింటూ ఉంటాము.వాటికి అనుభవం లోకి తెచ్చుకోవడం చాలా ముఖ్యం.ఉదాహరణకు.
ఒకానొక ఊరిలో రామయ్య అనే మంచి వ్యక్తి కి రోజూ గ్రామంలో  తన పనులు చేసుకొని, రాత్రి పూట గుడిలో జరిగే పురాణ కాలక్షేపంకి వెళ్లి, భగవంతుని స్మరించుకుని,విన్న విషయాలు ఇంటికి వచ్చి తన పిల్లలకు చెప్పి నిద్ర పోవడం అలవాటు.
ఒకరోజు పురాణ కాలక్షేపం లో గురువుగారి దగ్గర జ్ఞానం అనుభవ జ్ఞానం క్రింద మారకపోతే ఆ జ్ఞానం  వృధానే అన్నారు.

రామయ్య ఆ రోజు ఇంటికి వచ్చి, పిల్లలకు ఈ విషయం చెప్పారు.పిల్లలకు  ఏమి  అర్ధం కాలేదు.వివరముగా చెప్పమనటం తో  రామయ్య పక్కరోజు ఒక నిర్ణయం కి వచ్చి తన ఇంట్లో లేని  మల్లె చెట్టు గురించి చెప్పడం మొదలుపెట్టారు.మల్లె చెట్టు అనేది తెల్లని పూలు పూస్తుంది. ఆ అచెట్టు గుట్ట లాగా ఉంటుంది. ఆకులు మందముగా ఉంటాయి.వేసవి లో పూస్తుంది.పూలు మంచి సుగంధం తో ఉంటాయి. పూల నుంచి సుగంధ తైలం తయారు చేస్తారు.పూలు పూజ కి వాడతారు.కొన్ని మల్లె చెట్లు పందిరికి అల్లుకొని,రెక్క పూలు,ముద్ద గా పూలు ఇలా రకరకాలుగా ఉంటాయి,ఇలా  మల్లె పువ్వు కి సంబంధించిన జ్ఞానం ఇచ్చాడు. పక్కరోజు స్థానికంగా ఒక అశ్రమానికి పంపి,మల్లె పూలు తెమ్మనాడు.

పిల్లలు తండ్రి చెప్పిన ఆ జ్ఞానం తో  అశ్రమం కి వెళ్లి మల్లెపూల చెట్టు కోసం వెతకడం మొదలు పెట్టారు.పూలు తెల్లగా ఉంటాయి అని కదా వారి తండ్రి చెప్పింది.అశ్రమం లో తెల్లపూల చెట్టు చాలా వున్నాయి.గుబురు తెల్ల 
పూల చెట్టు,సువాసన వచ్చే చెట్టు, అల్లివున్న చెట్టు,సుగంధం వచ్చే తెల్ల పూల చెట్టు,ఇలా అశ్రమం మొత్తం వీరికి వారి తండ్రి గారు చెప్పిన మల్లె చెట్లు లక్షణాలు కనపడ సాగాయి.వెతికి,వెతికి  అలసిపోయి ఇంటికి వచ్చి కనపడలేదు అసలు అలాంటి చెట్టు లేవు అన్నారు.తండ్రి  మరలా  పక్కరోజు పంపి మల్లెపూలు తెండి అని అశ్రమం కి పంపారు.ఈ పిల్లలు మరల అశ్రమం లో వెతకడం మొదలు పెట్టారు.
ఈ పిల్లలు మల్లెచెట్టు లక్షణాలు మాట్లాడుకోవడం,ఆ చెట్టు  వెతకడం అన్నీ అక్కడే కూర్చున్న సాధువు ఇవి అన్ని గమనిస్తున్నారు, వారికి  అర్ధం అయింది.ఈ పిల్లలను ఆ సాధువు నేర్పుగా  మల్లె చెట్టు దగ్గరకు తీసుకెళ్లి
నుంచోపెట్టి,మీకు మీ నాన్నగారు చెప్పిన,మల్లె చెట్టు ఇదే అని చూపించారు.
మనకు భగవంతుని గురించి అనేక గ్రంధాల ద్వారా,పెద్దల ద్వారా వింటూ ఉంటాము.మన శక్తి కొలది ఒక అభిప్రాయం ఏర్పరుకుంటాము. మనకు.తెలిసిన  జ్ఞానం అంతా  ఉపయోగించుకొని సాధన చేస్తుంటాము.

కానీ సాధువు లాంటి నిజమైన  సద్గురువు మనకు దొరికితే మన జ్ఞానం ఆయన గమనించి అనుభవ జ్ఞానం క్రింద చేసి, మనలను  మోక్షము దగ్గరకు తీసుకెళ్లి దానిని అనుభవ జ్ఞానం  పొందెలా ఎలా సహకరిస్తారో ఉదాహరణకు ఈ కధ.

No comments:

Post a Comment