*దినచర్యలో భగవద్దర్శనమును ఒక దీక్షగా ఎవరు నిర్వర్తించుకుంటారో, వారు పాలు పెరుగుగా మారినట్లు మారిపోతారు. ఎందుకంటే దైవాన్ని 'తోడు' పెట్టుకున్నాడు కాబట్టి.
నిజమైన భక్తులు లోపల మార్పు చెందుతూ ఉంటారు. లోపలి నుంచి పండే కార్యక్రమము చూసుకోవాలి.*
*ఇలా సాధన చేస్తే జీవులయందు దయ పుట్టి, నిత్యము సంతోషము ఉంటుంది.
నిత్యసంతోషి, నిత్య తృప్తి పక్షికి రెండు రెక్కల లాంటివి. ఏమీ లేకపోయినా సంతోషముగా ఉన్నవారుంటారు.*
*ఎక్కడ ఉంటే అక్కడే నీ లోపల, బయట, నీ చుట్టూ ఉన్నదంతా దైవమే.*
*దుఃఖపుటాలోచనలు మన ఆరోగ్యానికి, ఆనందానికి చాలా హాని చేస్తాయి.
జయాపజయాలు, సుఖ దుఃఖాలు అనేవి వస్తాయి, పోతాయి. అవి శాశ్వతంగా ఉండవు. అటువంటప్పుడు వాటిని ఎందుకు తీవ్రంగా పట్టించుకొని మనల్ని మనం విచార గ్రస్తులుగా చేసుకోవాలి?
సూర్యుడు దేనికి చిహ్నం? కాంతికి, ఆనందానికి చిహ్నం. జీవితాన్ని ఆనందమయం చేసే ఆ ప్రకాశాన్ని మనలోనే కనుగొనాలని సూర్య తేజం మనకు బోధిస్తున్నది.
అయితే సర్వదా మనల్ని పరిరక్షించే భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా మనలోని ఈ చిరుదివ్వెను ఉజ్జ్వలంగా ప్రకాశించేలా చేయగలం.*
🌹🙏
No comments:
Post a Comment