🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
మిత్రమా…!
*నీప్రేమను*
*ఇపుడే వ్యక్తం చెయ్!!*
➖➖➖✍️
*"నేనిక లేనని తెలిశాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు..!*
*కానీ నేస్తం అది నా కంట పడదు! ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా!*
*నీవు పంపించే పుష్పగుచ్ఛాలను నా పార్ధివదేహం ఎలా చూడ గలదు? అందుకే... అవేవో ఇప్పుడే పంప రాదా!*
*నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావ్, కానీ అవి నా చెవిన పడవు..!*
*అందుకే ఆ మెచ్చేదేదో ఇపుడే మెచ్చుకో !*
*నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు !*
*కానీ నాకా సంగతి తెలీదు.. అదేదో ఇపుడే క్షమించేస్తే పోలా?!*
*నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది!*
*కానీ అది నాకెలా తెలుస్తుంది?*
*అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !*
*నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపరాదూ!*
*సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. నా మరణ వార్త విన్నాక!*
*సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?*
*ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకు వస్తుంది!"*
*( ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకొందాం. కష్ట సుఖాలు పంచుకొందాం. ఈ రోజు కలిసిన , మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో, మాట్లాడతాడో లేదో అన్న భయానక పరిస్థితిని సృష్టిస్తున్నాయ్ నేటి పరిస్థితులు.*
*అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మీయులతో…*
*ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదిద్దాం. )*✍️
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment