[9/24, 21:32] +91 94918 93164: *సేతు రహస్యం - 5*
🌊
రచన: గంగ శ్రీనివాస్
ఇండియాకు వెళ్ళే అవకాశం వచ్చినందుకు వారు చాలా సంతోషించారు. దానికి తోడు ఒక మహత్తర కార్యంలో తాము భాగం పంచుకుంటున్నామనే ఊహ వారిని ఎంతో ఉత్తేజితులను చేసింది. శ్రీధర్ తల్లిదండ్రుల కు ఒక్కడే సంతానం. వాళ్ళిద్దరూ ఎంతో ఉన్నత సంస్కారాలు గలవారు. శ్రీధర్ కు తన విద్యను ఎంచుకునే విషయంలో గాని, తన ప్రొఫెషన్‌ను ఎంచుకునే విషయంలో గాని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అతని తెలివి తేటలపై వారికి ఎంత నమ్మకం ఉందో, అంతకంటే ఎక్కువ నమ్మకమే అతని సంస్కారం పైన ఉంది.
శ్రీధర్ ఇండియాకు ఒక ప్రత్యేకమైన అసైన్ మెంట్లో వెళ్తుండటం వాళ్ళకు చాలా సంతోషం కలిగించింది. రామసేతువు నిజమని నిరూపిస్తే విశ్వంలో భారతీయ శాస్త్ర సంపదకు ఎంత గుర్తింపు వస్తుందో వాళ్ళకు తెలుసు. తమ కొడుకు అంతటి ఘనకార్యం చేయటానికి ఆ భగవత్కృప ఉండాలని వారు మనసారా కోరుకున్నారు.
రాజేష్ తల్లిదండ్రులకు కూడా శ్రీధర్ అంటే చాలా అభిమానం. రాజేష్ కు ఒక చెల్లెలు ఉంది. ఆమె లైబ్రరీ సైన్స్ లో పి.జి చేసింది. రాజేష్ కు తన చెల్లెలు పింకీ అంటే ప్రాణం. అప్పడప్పుడు ఆమెను మంకీ అని పిలిచి ఆటపట్టిస్తుంటాడు. రాజేష్, శ్రీధర్ తో కలసి చాలా అసైన్ మెంట్స్ చేశాడు. వాళ్ళ ఎడ్యుకేషన్స్ వేరు వేరు అయినా కలసి పనిచేయాలనే కోరికతో అసైన్ మెంట్స్ కలసి చేసేవారు. ఇప్పుడు కూడా వారు కలిసిపని చేసే అవకాశం వచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషించారు.
పింకీ, రవి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఆ విషయం వారి కుటుంబాలకు కూడా తెలుసు. ఎప్పుడు ఇద్దరూ కలసి వచ్చి మేము పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్తారా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు.
📖
ఆ రోజు రామసేతు నిజ నిర్ధారణ కమిటీ ఎక్జిక్యూటివ్ మీటింగ్ ఉంది. లేక్ వ్యూ రెస్టారెంట్లో వారి సమావేశం ఆర్గనైజ్ చేసుకున్నారు. శ్రీధర్ రాజేష్ లు కలిసి ఆ సమావేశానికి వెళ్ళారు.
కాన్ఫెరెన్స్ హాలు చిన్నగా ఉంది. అయినా చాలా సౌకర్యంగాను ఎంతో రిచ్ గాను ఉంది. అక్కడ సూర్యనారాయణ, మోడి, బెనర్జీ తదితరులు, శ్రీధర్, కేట్, రాజేష్ లు ఆసీనులై ఉన్నారు. అందరూ మోడి వైపు ఆసక్తిగా చూస్తున్నారు. మోడి గొంతు సవరించుకుని..
"గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ, అండ్ వెల్కమ్ టూ యు ఆల్" అని సమావేశాన్ని ప్రారంభించాడు. ఈ సమావేశంలో మోడి, అతని సహచరులు తమ ఆలోచనలను తెలియచేసి తమ యువ సహచరులకు మార్గ నిర్దేశం చేయాలనుకున్నారు. అలాగే వారి సందేహలను తమకు తెలిసినంతలో తీర్చాలని ఉద్దేశించారు.
“మనం రామసేతువు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక భౌగోళిక స్వరూపమా లేక మానవ ప్రయత్నసిద్ధమా అనేది నిర్ధారించ డానికి పూనుకున్నాం. ఇది ఏమంత సులభమైన విషయంగా మేమెవరమూ భావించడం లేదు. అయితే మాకు భారతీయ శాస్త్రాల పై ఉన్న ప్రగాఢ విశ్వాసం వలన అది శ్రీరాముడు లంకను చేరి రావణున్ని సంహరించి సీతమ్మను రక్షించడానికి నిర్మించబడిన పవిత్రమైన సేతువుగానే అనుకుంటున్నాం. మీరు యువకులు. కేట్ అయితే భారతీయ శాస్త్రాలతో పరిచయం లేనిది. అందువల్ల మీకు నిజం ఏమిటి అనే శాస్త్రీయ దృక్పథమే ప్రధానంగా ఉంటుంది. మేము మిమ్మల్ని ఎంచుకోవటానికి అది కూడా ఒక ప్రధాన కారణం.”
"ఏదో ఒకటి చేసి అది రాముడి చేత నిర్మించబడిన సేతువు అని నిరూపించండి అని మిమ్మల్ని కోరటం లేదు. నిజం తెలుసుకోండి. దాన్ని జనసామాన్యానికి, శాస్త్రవేత్తలకు అర్థమయ్యేలా తగిన సాక్ష్యాలు సేకరించండి. అని మాత్రమే కోరుతున్నాం"..
"ఆ నిరూపణ ఎలా జరుగుతుంది. దేని వలన సాధ్యపడుతుంది. అని మాత్రం మమ్మల్ని అడగకండి. అది మాకంటే మీకే బాగా తెలుస్తుంది."
"కేట్ కి ఒక అదనపు భాద్యతను కూడా అప్పగిస్తున్నాం. ఆమె పర్యావరణ రక్షణ కోసం ఎంతో శ్రమించింది. సాగర జలాలను ఆధారంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న సూక్షజీవుల మొదలుకొని అతి పెద్దవైన బ్లూ వేల్స్ వరకు సురక్షితంగా, స్వేచ్ఛగా మనగలగాలని ఆమె ఆశయం. ప్రకృతి సిద్ధమైన వాటి జీవనం మానవుడి స్వార్ధానికి బలి కాకూడదని ఆమె కోరిక. అందుకే రామ సేతువుని ముక్కలు చేసి షిప్పింగ్ కెనాల్ నిర్మించాలన్న ప్రతిపాదనని వ్యతిరేకించేలా భారతదేశంలో ఒకరకమైన ప్రజా ఉద్యమం తీసుకురావలసిన బాధ్యత ఆమెకు అప్పగించాము.”
"ఈ బాధ్యత ఆమెకు ఇష్టమే అని మేము విశ్వసిస్తున్నాం. అయితే ఆ పని కొంచెం రిస్క్ తో కూడుకున్నదని ముందుగానే హెచ్చరించాలనుకుంటున్నాం.
రామసేతువు కూల్చడం అడ్డుకుంటుందనే ఉద్దేశంతో కొన్ని హిందూ మత సంస్థలు ఆమెకు మద్దతు ప్రకటించవచ్చు. అది సాకుగా తీసుకొని ప్రత్యర్థులు ఆమె ప్రయత్నాలకు మతం రంగు పులమవచ్చు. అందుకే ఆమె అటువంటి మద్దతులను స్వీకరించకూడదు. ఈ విషయం చాలా సున్నితమైనది. కేట్ చాలా ఆచితూచి వ్యవహరించాలి. కేట్ భారతీయురాలు కాకపోవటం ఆమెకు ఈ విషయంలో చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆమె హిందువేతరురాలు కావటం కూడా ఆ విధంగా మంచిదే"..
"మీరంతా కలసి "వరల్డ్ విశ్వశాంతి ఫెడరేషన్” తరఫున అక్కడ పని చేస్తున్నారనేది అందరికి తెలిసేలాగే ఉంటుంది. దాన్ని మేము ఇక్కడి నుంచే మానేజ్ చేస్తాం. మీకు కావలసిన అన్ని వసతులు సమకూర్చబడ్డాయి.”
"మన అనుబంధ సంస్థలు అన్ని దేశాల లోను ఉన్నాయి. అవి మతానికి అతీతంగా పనిచేస్తాయి. ఏ మతం పట్ల సంకుచితంగా ఆలోచించక విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని అంతటా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో పని చేస్తాయి. అవి మీకు ఎప్పటికప్పుడు సహాయపడతాయి. ఇక మీకు సందేహాలు ఏమైనా ఉంటే నిస్సంకోచంగా అడగవచ్చు" అంటూ సుదీర్ఘమైన తన ఉపన్యాసాన్ని ముగించాడు మోడి.
మోడి పక్కనే కూర్చున్న వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతన్ని ఇదివరకు ఎప్పుడు శ్రీధర్ గాని మరెవరు గాని కలవ లేదు. ఏ కారణం చేతనో మోడి అతన్ని అక్కడ అందరికీ పరిచయం చేయడం విస్మరించాడు. ఆ వ్యక్తి మోడి మాట్లాడటం ఆపగానే తన లాప్ టాప్ ఆన్ చేసి అక్కడి ప్రొజెక్టర్ కి కనెక్ట్ చేసుకున్నాడు.
కేట్ చిన్న నోట్ బుక్ లో కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంది. అవి ఆమెను బాగా సతాయిస్తున్న కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలుసుకోవాలని ఆమె అనుకుంటుంది.
"భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది." తన ప్రశ్నను సూటిగా అడిగింది.
బెనర్జీ గొంతు సవరించుకుని "ఐ విల్ టేకిట్" అని అనౌన్స్ చేసి, దగ్గర ఉన్న ఫైల్స్, పేపర్లు ఒకసారి చూసుకున్నాడు.
అందరూ ఆయనవైపు చూసారు ఒళ్ళంతా చెవులు చేసుకుని. బెనర్జీ ప్రెసిడెంట్ బుష్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న కొద్దిమంది ప్రవాస భారతీయులలో ఒకడు. ఆయన లా లో పోస్ట్ గ్రాడ్యుయేట్. న్యాయ సలహాలు ఇవ్వటంలో ఆయనకు అపార అనుభవం ఉంది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"పర్యావరణ పరిరక్షణకు సంబంధించి భారతదేశం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే చాలా త్వరగా స్పందించింది. 1986లో ఎన్వైరన్ మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను పాస్ చేసింది. ప్రపంచంలోనే టెక్నికల్ నాలెడ్జి ఉన్న జనాభాలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉండటం చేతనో, సహజంగా ప్రకృతిని గౌరవించి పూజించే మనస్తత్వం నరనరాన, తరతరాలుగా జీర్ణించుకుని ఉండటం చేతనో గాని 1985 లోనే పర్యావరణానికి సంబంధించి స్పష్టమైన పాలసీని ఏర్పరుచుకుంది.”
"ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో చేసిన రిజల్యూషన్స్ అన్నింటి లో భారతదేశం సంతకం చేసి తన చిత్తశుద్ధిని చాటుకుంది. భావితరాల పట్ల తనకు గల బాధ్యతను ప్రకటించింది. యుఎన్ ఇ పి. అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రాం సభ్యదేశాలలో భారత్ కూడా ఉంది".
"కేంద్ర ప్రభుత్వంలో పర్యావరణ శాఖను ఒక పోర్టుఫోలియోగా చేసి పరిశ్రమలు నెలకొల్పేటప్పుడు, అభివృద్ధి పరమైన ప్రాజెక్టులు చేసేటప్పుడు ఆ శాఖ క్లియరెన్స్ తెచ్చుకోవడం తప్పని సరి చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కూడా తమ పరిధిలో నిర్మించబడే పరిశ్రమలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు అటువంటి.. క్లియరెన్స్ తప్పని సరిగా చేసే నిబంధనలు విధించాయి.
"అయితే పర్యావరణశాఖ పరిశీలనా విధానం పూర్తిగా శాస్త్రీయంగా లేదు. అది కొంత రాజకీయ ప్రభావాలకి లోనుకావట మే అక్కడ చట్టాల అమలుకు ఉన్న పెద్ద లోటు”.
"అయితే భారతదేశంలో న్యాయస్థానాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయి. కొంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాయి. అందుకే ప్రజలు పర్యావరణ సంబంధమైన విషయాలలో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ద్వారా కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందుతున్నారు.”
“ఇంకా ఏమైనా వివరాలు కావాలా ?” అని ముగించాడు బెనర్జీ.
"సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టుకి పర్యావరణశాఖ అనుమతి లభించిందా? ఒకవేళ లభిస్తే ఎవరైనా ఆ విషయమై కోర్టులను ఆశ్రయించారా?” తను ఆర్టికల్ తయారు చేసేటప్పుడు చదివిన వివరాలు మనసులో మెదులుతుంటే క్లారిఫై చేసుకోవాలని అడిగింది కేట్. ఆమె అడుగుతున్న పద్ధతికి, ఆమె ఎంచుకొనే ప్రశ్నల సరళత్వము చూసి ఆమె తెలివి తేటలను అప్రిషియేట్ చేస్తున్న ట్లు అక్కడి పెద్దలు తలలు పంకించారు.
బెనర్జీ తన కళ్ళజోడు తీసి వాటిని టిష్యూ పేపర్ తో శుభ్రం చేసుకుంటూ చిరునవ్వు నవ్వాడు.
"యు ఆర్ రైట్, నువ్వు ఊహించింది నిజమే. ఆ ప్రాజెక్టు పర్యావరణశాఖ క్లియరెన్సును సంపాదించుకుంది. ఒక విధంగా అది తమిళ ప్రజల డ్రీమ్ ప్రాజెక్టు. అయితే ఇక్కడ ఒక విషయం మరిచిపోకూడదు".
"వాళ్ళు రామసేతువుకి వ్యతిరేకం కాదు. సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టు వల్ల దక్షిణ భారతదేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని వారి ఆశ. ఎన్నూరు, కద్దలూరు, నాగపట్టిణం, తొండి, వాలినోకమ్, కోలాచెల్ ఇంకా కన్యాకుమారి వంటి 13 చోట్ల పోర్టులు బాగా అభివృద్ధి చెందుతాయి. ట్యుటికోరిన్ ముఖ్యమైన రేవు పట్టణం అవుతుంది. కొన్ని వేలకోట్ల వ్యాపారం అభివృద్ధి చెంది ఆ ప్రాంతాల లోని రోడ్లు, విద్యుత్, మౌలిక అంశాలు అన్ని కూడా అభివృద్ధి చెంది నిరుద్యోగుల కి ఉద్యోగవకాశాలు కూడా మెరుగుపడతాయి."
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"ఇదంతా అక్కడ ప్రజల నమ్మకాలతో ఆడుకుంటూ అరచేతిలో వైకుంఠం చూపుతున్న రాజకీయవేత్తల లౌక్యం అనే విమర్శలు కూడా ఉన్నాయి." అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అంత ధైర్యంగా రాముడి గురించి అవాకులు చెవాకులు మాట్లాడగలిగాడు. కాని తానొకటి తలిచిన..దైవము వేరొకటి తలచును అన్నట్లు కరుణా నిధి ఎందుకు అన్నాడో తెలియదుగాని, ఆయన చేసిన విమర్శల వల్ల ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమై ఇప్పుడు మనం ఇటువంటి కార్యక్రమం చేపట్టడానికి ప్రేరణ లభించింది.”
"ఇకపోతే అక్కడి ప్రజలు కోర్టుకెళ్ళడం విషయానికి వస్తే చాలా విచిత్రమైన విషయాలు తెలుస్తాయి. విద్యావంతులు, రిటైర్డ్ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లు, కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్, న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించారు. రామసేతువుని ఏ విధంగా దెబ్బ తీసినా అది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరుస్తుందని వారు వాదించారు. రాముడు త్రేతాయుగానికి చెందినవాడైనా, నేటికీ రామరాజ్యమే స్పూర్తిదాయకం. శ్రీరాముని ఏక పత్నీవ్రతమే తన భర్త పాటించాలని లోకంలో ప్రతి భార్య తప్పక కోరుకుంటుంది. ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యమే నేటికీ శ్రీరామరక్ష.”
"రామసేతువు 1916 కి ముందు కాలంలో శ్రీలంకను కాలినడకన చేరడానికి చాలా అనువుగా ఉండేదని బ్రిటిష్ కాలంలో తయారు చేసిన గెజిట్ల వలన తెలుస్తుంది. ఇటువంటి గెజిట్లను క్రోడీకరించి ఆధునిక కాలంలో ప్రచురించినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి అప్పుడు వాటిని మెచ్చుకున్నారు.
"అంతేగాక ఆ ప్రాంతంలో వాడుకలో ఉన్న పేర్లు వాటి వ్యుత్పత్తులు గమనించినా శ్రీరాముడికి ఆ ప్రాంతానికి ఉన్న సంబంధం నిరూపించబడుతుంది. అలాంటి వాటిల్లో ధనుష్కోటి, రామేశ్వరం, మండపం, పంబన్ వంటివి కొన్ని. "
"మరొక వైపు సేతుసముద్రం ప్రాజెక్టు 1860 లో మొదటిసారిగా తెరపైకి వచ్చినప్పటి నుంచి అనేక కమిటీలు అధ్యయనం చేసాయి. వాటిలో చాలా భాగం రామ సేతువుని ఏ విధంగాను కదల్చకుండా ఈ ప్రాజెక్టును ఎలా నిర్మించాలో వివరించాయి."
"వాటిలో ఏ మార్గాన్ని అనుసరించినా రామసేతువుకి ప్రమాదం వాటిల్లదు. యునెస్కో స్కీము ప్రకారం మానవాళికి తరగని అపురూప సంపదగా హెరిటేజ్, రామసేతువుని ప్రకటించాలని తద్వారా రామసేతువు పరిరక్షిత మాన్యుమెంట్ గా ఉంటుందని కూడా కోరుకున్నారు. "
“సూయజ్ కెనాల్, పనామా కెనాల్లు రెండు అత్యంత ప్రాముఖ్యత గల షిప్పింగ్ కెనాల్స్. సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టుని కూడా ఆ విధంగానే భూ భాగం లో నిర్మిస్తే బాగుటుందని కూడా కొన్ని కమిటీలు ప్రతిపాదించాయి. అటువంటి ప్రతిపాదనను ఎంచుకున్నా రామసేతువుకి ఎలాంటి సమస్య ఉండదు.”
“అన్నిటికంటే చమత్కారమైనది తమిళనాడు ప్రజలపై రాజకీయ నాయకులు చేస్తున్న మోసాన్ని బయట పెట్టే రిసెర్చ్ పేపర్.”
తన ఉపన్యాసాన్ని వింటున్న వారందరి ముఖాల వైపు ఒకసారి పరిశీలనగా చూశాడు బెనర్జి. అందరూ ఆసక్తితో తన వైపే చూస్తుండటంతో తృప్తి చెంది మళ్ళీ కొనసాగించాడు.
“ఆ రీసెర్చ్ పేపర్ లో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొత్తగా కట్టిన షిప్పింగ్ కెనాల్‌ని ఒక సంవత్సరంలో ఎన్ని షిప్పులు సరిగ్గా ఉపయోగించుకుంటాయి అనేది.”
“ఎందుకంటే ఎక్కువ షిప్పులు ఉపయోగించు కుంటే ఎక్కువ టోల్ వసూలు అవుతుంది. అంతకు మించి ఎక్కువ ట్రాఫిక్ ఉండటం వలన మౌలిక వసతులు కూడా పెరుగుతాయి. ఉద్యోగావ కాశాలు పెరుగుతాయి. ఇతరత్రా ఆదాయ మార్గాలు పెరుగుతాయి.”
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
“ప్రస్తుతం అరేబియన్ సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు వెళ్ళే షిప్పులు శ్రీలంకను చుట్టి పై నుండి వెళుతున్నాయి. రామసేతువు ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ లోతు తక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల అది 15 నుంచి 20 మీ లోతు మాత్రమే ఉంటుంది. అక్కడ ఎక్కువ సరుకులు తీసుకువెళ్తున్న ఓడలు ఆ మార్గంలో
ప్రయాణించలేవు. అందుకే షిప్పింగ్ కెనాల్ లోతుగా తవ్వబడుతుంది. కాని ఆ కెనాల్
లో నుంచి ప్రయాణించే షిప్పులు కొన్ని సాంకేతిక కారణాల వల్ల తమ వేగాన్ని మూడో వంతుకు తగ్గించుకోవలసి ఉంటుంది. అందువలన షిప్పులు ప్రయాణించే దూరం మూడు వంతులు తగ్గినా వేగం కూడా అదే పరిమాణంలో తగ్గటం వలన ఆదా అయ్యే సమయం శూన్యం అవుతుంది. ఆ విధంగా కట్టిన లెక్కల వలన మొత్తం మీద ఆదా అయ్యే సమయం అంచనాల ప్రకారం కొన్ని పదుల గంటలలో ఉండే అవకాశం ఉంది. అలాగే తగ్గే దూరం కొన్ని వందల నాటికల్ మైల్స్ ఉంటుంది.”
“అదే మరి సూయజ్ గాని పనామాగాని తీసుకుంటే అవి ఆదా చేసే దూరాలు కొన్ని వేల నాటికల్ మైల్స్ గాను సమయం కొన్ని వందల గంటల గాను కనిపిస్తుంది. అందువలన ఈ షిప్పింగ్ కెనాల్ సూయజ్ పనామాల స్థాయిలో ఆదాయపు వనరుల్ని సృష్టించలేదు. ఈ కారణాల వలన మౌలికంగా ఈ ప్రాజెక్టు ప్రజల మేలుకంటే రాజకీయ నాయకులకు లాభించేలా ఉందని ఆ పేపర్ రుజువు చేస్తుంది.”
“ఇవన్నీ కూడా కోర్టు ముందు వాదోప వాదాలుగా వినబడ్డాయి. అయితే సుప్రీం కోర్టు ఇంకా ఈ విషయమై ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు.”
“ఇకపోతే గ్రీన్ గ్రూప్‌లు గాని, బ్లూ గ్రూప్‌లు గాని అంత ఏక్టివ్‌గా లేవు. కేట్, నువ్వు ప్రణాళిక రచించి ఈ గ్రూప్‌ల యాక్టీవిటీస్‌ని బాగా పెంచాల్సి ఉంటుంది” అని చెప్పి తన సుదీర్జ ఉపన్యాసాన్ని ముగించాడు బెనర్జీ.
ఆయన తెలియచేసిన వివరాలను సభ్యులందరు ఎంతో ఆసక్తితో విన్నారు. యువ సభ్యులు తమ ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయారు. ఆయనను అభినందిస్తూ అందరూ బల్లలను తట్టారు.
🌊
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
[9/24, 22:28] +91 94918 93164: *సేతు రహస్యం - 6*
🌊
రచన: గంగ శ్రీనివాస్
“ఇంకా ఏవైనా వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మాకు తెలిసినంతలో మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం” అన్నాడు బెనర్జీ.
శ్రీధర్ చేయి పైకెత్తాడు.
"అడుగు శ్రీధర్ ఏమిటి నీ సందేహం”
"రామసేతువు గురించి ఇంతకుముందు ఎవరైనా పరిశోధించారా ?”
"ఈ మధ్య నాసా తీసిన శాటిలైట్ ఫోటోల్లో నీట మునిగి ఉన్న రామసేతువు ఒక్కసారి గా వెలుగులోకి వచ్చింది. ధనుష్కోటి నుంచి తలైమన్నార్ వరకు దాదాపు 35 కి.మీ పొడవున ఈ సేతువు ఉంది. కార్టో గ్రాఫర్స్ ఈ నిర్మాణాన్ని ఆడమ్స్ బ్రిడ్జిగా 18వ శతాబ్దం నుంచి పేర్కొంటున్నారు. అంతకు పూర్వం దానిని సేతువుగానే వ్యవహరించారు”.
"అవి పగడపు దీవులని, సున్నపురాయితో సహజంగా ఏర్పడిన నిర్మాణం అని, దానిని పరిశీలించిన నిపుణులు భావించారు.”
"ఈ ప్రాజెక్టు వచ్చాక డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ లో ఎంత తవ్వినా సున్నపురాయి వస్తోందని డ్రెడ్జింగ్ చేస్తున్న నిపుణులు తెలిపారు. అంతేగాని రామసేతువుకి సంబంధించి పూర్తిస్థాయి సత్యశోధన ఇంతవరకు జరగలేదనే చెప్పాలి. ఇప్పుడు మీరంతా చేయబోయే ఈ పరిశోధన ఎంతో ముఖ్యమైనది. అప్పుడే ప్రపంచదృష్టిని ఇది ఆకర్షించింది కూడా. మీ పరిశోధన ఎలా ప్లాన్ చేయాలనుకుంటున్నావు, శ్రీధర్.”
శ్రీధర్ ఒకసారి కళ్ళు మూసుకుని ఒక క్షణం తన మనస్సు నిర్వికారంగా చేసుకున్నాడు. ఆ తర్వాత కనులు తెరిచి ఇలా అన్నాడు.
“రామసేతువు గురించి పరిశోధన అంటే సముద్రంలో మునిగి ఉన్న శిలల పరిశోధన మాత్రమే అని నేననుకోవటంలేదు. త్రేతా యుగంలో నిర్మించబడి ఉన్న రామసేతువు ఇంతకాలంలో ఎన్నో మార్పులు చెంది ఉంటుంది. అది మొత్తం నీటిలో మునిగి పోయిందా లేక పాక్షికంగా మునిగి ఉందా అని కూడా తెలియదు.”
సభ్యులంతా చాలా ఆసక్తితో అతను చెప్తున్న ప్రతి మాటను వింటున్నారు. కొత్త కోణాలలో ఆలోచిస్తూ సమస్యను అన్ని విధాలుగా ఎదుర్కొని పరిష్కారం కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నాడని వారికి అర్థయింది.
"అంతేగాక ఇది భారతదేశంలో మాత్రమే చేయవలసిన పరిశోధనగా కూడా నేను భావించడంలేదు. రామసేతువు ఒక చివర భారతదేశంలో ఉంటే రెండవ చివర శ్రీలంకలో ఉంది. అందువలన శ్రీలంక భూ భాగంలో కూడా కొన్ని పరిశోధనలు చేపట్టాల్సి వస్తుంది. అలాగే శ్రీలంక వైపు సముద్రంలో కూడా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికి ఇంతే. నేను కొంత మందిని ఎంపిక చేసుకుని పరిశోధనలు రెండు మూడు చోట్ల ఏకకాలంలో మొదలు పెట్టిస్తా. వాటికి కావలసిన అనుమతులు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీరు త్వరగా తెప్పించాలి.”
శ్రీధర్ ఆలోచనా సరళికి ముగ్ధులయ్యారు సభ్యులు, బెనర్జీ చిరునవ్వు నవ్వుతూ “నన్ను క్షమించాలి, ఈ సమావేశానికి వచ్చిన ఒక ముఖ్య అతిధిని ఇంతవరకు మీకు పరిచయం చేయలేదు, నా పక్కనే ఉన్న ఈ జెంటిల్ మేన్ డా॥ విజయ సోమదేవ, ఆర్కియాలజిస్టు. శ్రీలంక ఆర్కియాలజీ డిపార్టుమెంట్లో పని చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఆయన చెప్పే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ సోమదేవ విల్ యూ ప్లీజ్ అడ్రస్ ది గేదరింగ్” అన్నాడు బెనర్జీ."
“థ్యాంక్యూ బెనర్జి, విత్ ప్లెజర్" అంటూ సభ్యులందరి వైపు చూశాడు డా॥ సోమదేవ. తన లాప్టాప్ ఆపరేట్ చేసి తన ప్రెజంటేషన్ మొదలుపెట్టాడు.
ఆర్కియలాజికిల్ ఎక్సకవేషన్స్ ఇన్ శ్రీలంక అనే టైటిల్ స్క్రీన్ పైన కనిపించింది. ప్రెజంటేషన్ ప్రారంభం కాగానే కాన్ఫరెన్స్ హాలులో లైట్లు గ్రాడ్యుయల్ గా డిమ్ అయ్యాయి. అందరి దృష్టి స్క్రీన్ పైకి మారింది. సోమదేవ చెప్తున్న విషయాల్ని ఆసక్తిగా వింటూ వారంతా స్క్రీన్ వైపు తదేకంగా చూస్తున్నారు.
"భూమి పైన మానవుని ఉనికి ఆధారంగా అతను ఉపయోగించిన పరికరాల ఆధారం గాను కొన్ని యుగాలను వర్గీకరించారు.”
అవి పాలియోలిథిక్ ఏజ్, మిసోలిథక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ లు.”
"లిథో అంటే గ్రీకు భాషలో రాయి అని అర్థం. ఆ కాలాలలో మానవులు రాతి పరికరాలనే వాడేవారు. వారికి లోహాలకు సంబంధించిన జ్ఞానం మొదట్లో లేదు.”
"పాలియోలిథిక్ ఏజ్ ని పాత రాతియుగం అంటారు. ఇది షుమారు 2 లక్షల 50 వేల సంవత్సరాల క్రితం నుంచి షుమారు 13 వేల సంవత్సరాలు క్రితం వరకు ఉంది. "
"నియోలిథిక్ ఏజ్ అంటే కొత్త రాతియుగం షుమారు 10 వేల సంవత్సరాల నుంచి 5 వేల సంవత్సరాల వరకు ఉంది."
"ఈ రెండు యుగాల మధ్య సంధికాలాన్ని మీసో లిథిక్ ఏజ్ అంటారు. ఆయా కాలాల లో మానవులు ఉపయోగించే రాతి పనిముట్లు ఎలా ఉండేవో తెలిపే చిత్రాలను స్క్రీన్ పైన చూపించాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
వీటి తర్వాత వచ్చిన కాలాన్ని అంటే ఇప్పటికి 5 వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కాలాన్ని మెటల్ ఏజ్ అంటారు. ఈ కాలంలో మానవుడు లోహాలను ఉపయోగించటం నేర్చుకున్నాడు."
అలాగే మానవపరిణామ దశలలో మొదట్లో ఆస్ట్రోపిథికస్, రామా పిథికస్, హోమో ఎరక్టస్, నియాండెర్తల్ మాన్ అనే దశలను గుర్తించారు. ఇందులో మొదటి దశ షుమారు లక్షాడెభ్బై వేల సంవత్సరాల క్రితం మొదలైంది అని అంటారు. అలా కాలక్రమేణా మానవ పరిణామంలో నేటి మానవుడ్ని పోలిన మానవ జాతినే నియాండెర్తల్ దశ. తర్వాత వచ్చిన హోమో సేపియన్స్ అని లేదా క్రోమాగ్నన్ మానవుడు అని అంటారు.”
నేటి మానవుని పోలిన మనిషి నాలుగు లేదా ఐదు వేలసంవత్సరాల క్రితం నుంచి మాత్రమే ఈ భూమి పై నడిచినట్లు ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి.”
భూమి పొరలలో సముద్ర గర్భాలలో నిక్షిప్తమైన అనేక విషయాలు మానవ మేధస్సుకి ఇంకా అందలేదు. ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలు మీ అందరికి తెలిసినవే అయి ఉండవచ్చు.".
కాని ఈ మధ్యకాలంలో శ్రీలంకలో జరిగిన కొన్ని ఆర్కియలాజికల్ అధ్యయనాలు కొన్ని విశేషాంశాలను ఆవిష్కరించాయి. అవి మీ పరిశోధనకు ఉపయోగపడవచ్చనే ఉద్దేశ్యంతో నన్ను ఎంగేజ్ చేశారు మిస్టర్ బెనర్జీ".
శ్రీలంకలోని తీర భాగంలోని 'బుందల' సమీపంలో ఆర్కియలాజికల్ సైట్లు రెండు ఉన్నాయి. వాటిలో ఒక దానిలో ఒక మానవ అవశేషం లభించింది. అది ఎంత కాలం క్రితమైనదో కనుక్కుంటే అత్యంత ఆశ్చర్యమైన విషయం బైటపడింది. అది షుమారు లక్షా డెబ్బైఐదు వేల సంవత్సరాల క్రితందని వెల్లడయింది.
నేటి మానవుని పోలిన మనిషి నాలుగు వేల సంవత్సరాల క్రితం నాడే అనుకునే శాస్త్రవేత్తలు ఒక్కసారి ఉలిక్కిపడి, మేలుకొనేలా ఉంది ఆ విశేషం”.
"దీనిని బట్టి చూస్తే లక్షల సంవత్సరాల క్రితమే మానవుడు నేటి మానవుడ్ని పోలి ఉన్నాడని తెలుస్తుంది. కొంచెం విశ్లేషణ చేస్తే అదే కాలానికి సంబంధించిన ఆఫ్రో పిథికస్, రామా ఫిథికస్ అవశేషాలు వానరజాతిగానో, జంబూక జాతిగానో రామాయణ కాలంలో పేర్కొన్న వారివి ఎందుకు కాకూడదు.”
అంటే హిందూ శాస్త్రంలోనున్న యుగాల వర్ణన, కాలం వివరాలు కరెక్ట్ అని అనుకోవడానికి కొంత ఆధారం లభించినట్లే. భూమిలో ఉన్న ఈ పొరలు చూడండి. ఇవి ఏర్పడిన కాలాన్ని బట్టి అక్కడ దొరికే అవశేషాల వయసు లెక్కిస్తాము”.
అనేక చిత్రాలను స్క్రీన్ పై ప్రొజెక్ట్ చేసి వాటి వివరాలు తెలియ చేశాడు డా॥ సోమదేవ.
“మీకు ఇప్పుడు ఇంకొక విచిత్రమైన విషయాన్ని తెలియచేస్తాను. ఆఫ్రికా, ఆసియా ఖండాలను కలుపుతూ ఒక భూ భాగం ఉండేదని ఆర్కియాలజిస్టులు కొందరు భావించారు. దానికి బ్రిటిష్ జూవాలజిస్ట్ ఫిలిప్ టట్టీ స్కట్టర్ అనే ఆయన 'లెమూరియా' అని నామకరణం చేశాడు”..
"ఆ లెమూరియాలో ఉండే మానవజాతి దాదాపు పన్నెండు అడుగుల ఎత్తు ఉండే వారని, కొందరికి నాలుగు చేతులు కూడ ఉండేవని భావించారు. వారు డైనోసార్లకు సమకాలీనులు. అంతేకాకుండ వాళ్ళు మనం ఈనాడు కుక్కలను, ఆవులను పెంచుకున్నట్లు, డైనోసార్లను మచ్చిక చేసి పెంచుకొనే వారని కూడా సిద్ధాంతీకరించారు”.
"కాలక్రమేణా ప్రకృతి ఉత్పాతాల కారణంగా ఈ లెమూరియా హిందూ మహా సముద్రంలో జలసమాధి అయిపోయిందని వారి ఊహ".
"ఇవి గాక రామసేతువుకి సంబంధించిన శిలలను కార్బన్ డేటింగ్ ద్వారా పరిశీలించినప్పుడు అవి కూడా షుమారుగా 1,75,000 సంవత్సరాల వయసువిగా తెలుస్తున్నది".
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"ఐతే ఆర్కియాలాజికల్ ఎవిడెన్స్ ప్రెజెంట్ చేయడం జనసామాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత సులువుగాదు. ఇంకా ఈ దిశలో పరిశోధనలు విస్తృతంగా జరగవలసిన ఉంది”.
“ఇక మీకు ఏమైనా సందేహాలుంటే నాకు తెలిసినంతలో క్లియర్ చేయడానికి చాలా సంతోషిస్తాను” అని చెప్పి తన ఉపన్యాసం ముగించాడు. డా॥ సోమదేవ చెప్పిన విషయాలు అత్యంత ఉత్కంఠభరితంగా ఉండి యువ శాస్త్రవేత్తలను కొత్త కొత్త ఆలోచనలవైపు పురికొల్పాయి.
కేట్ కి లెమూరియా గురించి డా॥ సోమదేవ చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తి కలిగించాయి. డైనోసార్లను పెంపుడు జంతువులుగా ఉపయోగించిన ఆ మానవ జాతి మేధాశక్తికి జోహార్లు అర్పించ వలసిందే. అదే తన పక్కనే కూర్చున్న శ్రీధర్ కి చెప్పింది.
శ్రీధర్ కేట్ వైపు నవ్వుతూ చూసి, “ఇదంతా బేస్ లెస్. ఒక కథలాగా ఉంది" అన్నాడు. కేట్ కి అలా అనిపించలేదు. హెచ్ జి వెల్స్ కథ చెపితే అది భవిష్యత్ లో నిజమైంది. అందువలన దీనిని తీసి పారేయలేం. ఒకప్పుడు జరిగింది ఇప్పుడు కథల రూపంలో పాటల రూపంలో మనకు అంది ఉండవచ్చు కదా" అంది.
"నిజమే కాని లెమూరియా కథ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మనం డా॥ సోమదేవ్ నే ప్రశ్నించాలి” అన్నాడు శ్రీధర్.
వారిద్దరి సంభాషణ క్లోజ్ గా ఫాలో అవుతున్న డా॥ సోమదేవ ముసిముసి నవ్వులు నవ్వుతూ "కథలకు వాస్తవానికి ఉండే కనెక్షన్ గురించి మిస్ కేథరిన్ బాగా చెప్పింది. లెమూరియా ఆమెకు ఆసక్తి కలిగించిందంటే నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే జూలాజిస్టులు, ఆర్కియాల జిస్టులు లెమూరియా గురించి పూర్తిగా మరచిపోయినా థియసోఫికల్ సొసైటీని నెలకొల్పిన మాడమ్ బ్లవెస్కీ వలన లెమూరియా గురించి 'కథలలాంటి' కొన్ని విషయాలు తెలిసాయి".
"జిడ్డు కృష్ణమూర్తి, ఒక యోగి ఆత్మకథ రచయిత యోగానంద వంటి మహనీయు లకు మాడమ్ బ్లవెస్కీ చాలా బాగా తెలుసు. ఆమె వారికి పరమపూజ్యురాలు"
"మాడమ్ బ్లవస్కీ తన దివ్య దృష్టి వలన కొన్ని విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొందేది. ఆమె మానవ పరిణామాలను ఏడు రకాలుగా చెప్పింది. మానవుడు శుద్ధ చైతన్యానికి దగ్గరగా ఉండేవాడు. అది ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉండేది. రెండవ దశలో మానవులు 'హైపర్ బోరియా' అనే ఖండంలో ఉండేవారు. ఈ ఖండం ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండేది. తర్వాత జలసమాధి అయిపోయింది”.
"లెమూరియా మూడవ దశకు చెందినది. ఈ దశలో మానవునికి ఆడా, మగకు సంబంధించిన అవసరం ఉండేది కాదు. అయితే వారు సెక్స్ గురించి తెలుసుకొన్న తర్వాత వారిని గాడ్స్ దూరం చేసారని అంటారు. వారే ఈనాటి మానవజాతికి కారణభూతమయ్యారని తెలుస్తుంది”.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"నాల్గవ దశలో మానవులు 'అట్లాంటియన్' అని పిలవబడేవారు. శుక్రగ్రహవాసులు వీరిని ప్రభావితం చేసారు. తర్వాత అట్లాంటిక్ కూడ జలసమాధి చెందింది. దాని తర్వాత ఉద్భవించింది ఐదవది ఐన నేటి మానవదశ”.
“దీని తర్వాత వచ్చే ఆరవదశ ఉత్తర అమెరికాలోను, యేడవ దశ దక్షిణ అమెరికా లోను ఉద్భవిస్తాయని మాడమ్ బ్లవెస్కీ చెప్పిన ఈ విషయాలను థియసాఫికల్ సొసైటీ వారంతా నమ్ముతారు”.
డా॥ సోమదేవ చెప్పిన వివరాలు సైన్స్ కి ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న సరిహద్దును చెరిపేస్తున్నట్లున్నాయి.
చాలామంది అనుకునేట్లు సైన్స్, స్పిరిట్యుయాలిటీ వేరుకాదు, అవి ఎక్కడో ఒక చోట కలిసి తీరుతాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక సైంటిస్టులు స్పిరిట్యుయాలిటీ వైపు మొగ్గు చూపడం మనకు తెలుసు. సర్ ఐజాక్ న్యూటన్ నుంచి ఐన్ స్టిన్ వరకు ఎందరో అటువంటి వారు ఉన్నారు.
📖
మోడీ సభ్యుల పార్టిసిషేషన్ తో సంతృప్తి చెందాడు. వారి ప్రయాణ వివరాలు తెలియచేసే కవర్లు వారికి ఇచ్చాడు. ఇండియాలో శ్రీధర్ కలుసుకోవాల్సిన వారి వివరాలు కూడ అందులో ఉన్నాయి. కేట్ కి ఇండియాలోని గ్రీన్ గ్రూప్స్ వారికి ఆమె ఎంత ఫండ్ ఆథరైజ్ చేయొచ్చో కూడ అందులో వివరించారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్.
సమావేశం ముగిసిన తర్వాత అంతా బైటికి వచ్చారు. కేట్ తో శ్రీధర్ అన్నాడు. "మీతో కలసి పని చేయగలగటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను”.
కేట్ నవ్వుతూ “థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్స్, కాని మనకు అప్పగించిన పనులు వేరు. మనం ఎంతకాలం కలసి పని చేస్తామో ఎవరికి తెలుసు" అంది.
" నిజమే కాని మీతో మాట్లాడుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ కథలు తెలుస్తాయని అనిపిస్తుంది" అన్నాడు శ్రీధర్ కొంటెగా. కేట్ నవ్వింది. రాజేష్ కూడా నవ్వాడు. మనసు లో మాత్రం ఆశ్చర్యపడ్డాడు. జనరల్ గా శ్రీధర్ ముభావంగా ఉంటాడు. కాని ఈ రోజు కేట్ తో కావాలని వాళ్ళ మధ్య సంభాషణ పెంచుతున్నాడు. పైగా ఎలా మాట్లాడుతున్నాడో పెద్దగా పట్టించుకో కుండా అర్థం పర్ధం లేకుండా సిల్లీగా మాట్లాడుతున్నాడు. సమ్ థింగ్, సమ్ థింగ్ అనుకున్నాడు రాజేష్.
🌊
*సశేషం* ꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment