Thursday, September 25, 2025

 *ఆకలి రక్కసిని దునుమాడే అన్నపూర్ణ* 

*ఈ నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో ఎంతో మంది రక్కసులను సంహరించి దుష్టశిక్షణ చేసింది. సజ్జనులను కాపాడింది. మరో విధంగా చూస్తే అన్నపూర్ణాదేవి ఆకలి రక్కసిని కూడా దునుమాడి ప్రజలను రక్షించింది. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది. అన్నదాన వైశిష్ట్యం విష్ణు ధర్మోత్తర, అగ్ని, పద్మ, కూర్మ, నంది, వాయు పురాణాల్లో విస్తృతంగా ఉందని విజ్ఞులు చెబుతారు.*

*అన్నపూర్ణా దేవి పార్వతీ దేవి రూపాలలో ఒకటి. అటువంటి అన్నాన్ని ఇచ్చే దేవత అన్నపూర్ణ. ఒకప్పుడు దేవాది దేవుడైన శంకరునికే ఆమె అన్నం పెట్టిందనే కథ కూడా ప్రసిద్ధం. ఈ నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో ఎంతో మంది రక్కసులను సంహరించి దుష్టశిక్షణ చేసింది. సజ్జనులను కాపాడింది. మరో విధంగా చూస్తే అన్నపూర్ణాదేవి ఆకలి రక్కసిని కూడా దునుమాడి ప్రజలను రక్షించింది. అన్ని దానాలలోకెల్లా అన్నదానం* *గొప్పది. అన్నదాన వైశిష్యం విష్ణు ధర్మోత్తర, అగ్ని, పద్మ, కూర్మ, నంది, వాయు పురాణాల్లో విస్తృతంగా ఉందని విజ్ఞులు చెబుతారు. అన్నపూర్ణాదేవి ఆలయాలు తక్కువే అయినా వారణాసిలోని అన్నపూర్ణాదేవి ఆలయం ఎంతో ప్రముఖమైనది, మహిమాన్వితమైనది. అన్న పూర్ణాదేవి ప్రస్తావన మన వాఙ్మయంలో చాలా చోట్ల ఉందని చెబుతారు. రుద్రయామల, శివ రహస్యం, మహాత్రిపుర సిద్దాంత, అన్నపూర్ణ కవచాలు వాటిలో కొన్ని, పార్వతి హిమ వంతుని కుమార్తె. ఆమె మరో రూపమైన అన్నపూర్ణ కూడా హిమవంతుని కుమార్తె అవుతుంది. అందుచేతనే హిమాలయాలలోని ఒక శిఖరాన్ని అన్నపూర్ణ పేరుతో పిలుస్తారని. అంటారు. అన్నపూర్ణాదేవి ఎర్రటి శరీర ఛాయతో, పూర్ణ చంద్ర బింబం వంటి ముఖంతో మూడు నేత్రాలు నాలుగు చేతులతో ఉంటుందని వర్ణిస్తారు. కింది ఎడమ చేతిలో పరమాన్న పాత్ర, కుడి చేతిలో రత్న మాణిక్య ఖచితమైన గరిటె ఉంటుంది. మిగతా రెండు చేతులు వరద అభయ హస్తాలతో ఉంటాయి. అని వర్ణన. అలాగే శివుడు భిక్షా పాత్ర పుచ్చుకుని వచ్చినట్లు, అన్నపూర్ణాదేవి ఆయనకు ఆహారం వడ్డిస్తున్నట్టు చిత్రాలు చూస్తుంటాం. దానికి సంబంధించి చాలా కథలు ఉన్నాయి. వాటిలో ఒకటి...*

*కైలాసంలో ఒకసారి శివపార్వతులు సంభాషించుకుంటూ ఉండగా శివుడు ఈ ప్రపంచమంతా మాయ అని, ఆహారం కూడా దానిలో భాగమేనని అన్నాడు. ఆహారంతో పాటు భౌతిక విషయాలకు అధిదేవత అయిన పార్వతీ దేవికి ఈ మాటతో కోపం వచ్చింది. దానితో ఆమె ఒక్కసారిగా భూమిపై నుంచి అంతర్ధానమయింది. భూమి బీడుగా మారింది. ఎక్కడా ఆహారం లేదు. అన్ని ప్రాణులూ ఆకలితో అలమటించాయి. అయితే కరుణా స్వరూప అయిన పార్వతీ అమ్మవారు తన బిడ్డలైన ప్రజలు బాధపడడం చూసి కాశీకి తరలివచ్చి అక్కడ అన్నశాల ఏర్పాటు చేసి అందరికీ ఆహారం పంచడం మొదలుపెట్టింది. పార్వతీదేవి వచ్చిందని తెలిసిన శివుడు తన భిక్షా పాత్రతో ఆమె వద్దకు వెళ్ళి ఈ భౌతిక ప్రపంచాన్ని మాయగా పేర్కొనలేమని గ్రహించాను అని అన్నాడు. దానితో పార్వతీ దేవి చిరునవ్వుతో ఆయనకు ఆహారం వడ్డించింది. అప్పటి నుంచి ఆమె అన్నపూర్ణాదేవి అయిందని చెబుతారు. అన్న పూర్ణాదేవి అన్నమే కాక ముక్తికి అవసరమైన జ్ఞాన వైరాగ్యాలు కూడా ఇస్తుంది. అది అన్నపూర్ణా దేవిని స్తుతిస్తూ ఆది శంకరులు రాసిన శ్లోకం ఎంతో ప్రసిద్ధి చెందింది. అది*

*అన్నపూర్ణే సదా పూర్లే శంకర ప్రాణ మ్లభే*
*జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి*
*మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః*
*బాంధవాః శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం*

*ఓ అన్నపూర్ణా, ఎప్పుడూ పూర్ణురాలిగా ఉండేదానా, శంకరునికి ప్రాణం కంటె మిన్న అయినదానా, జ్ఞాన వైరాగ్యాలనే భిక్ష నాకు పెట్టు. నా తల్లి పార్వతీ దేవి, నా తండ్రి మహేశ్వరుడు. బంధువులు ముల్లోకాల్లోని శివభక్తులు అని దీని అర్ధం.*

*┈┉━❀꧁మాత్రేనమః꧂❀━┉┈*
          *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌺🌺🌺 🙏🕉️🙏 🌺🌺🌺

No comments:

Post a Comment