Thursday, September 25, 2025

 *ఆచార్య సద్భోదన*
                  ➖➖➖

*ఉన్నదంతా ఈ క్షణమే!*

*జీవాత్మ పాత శరీరము త్యజించి కొత్త శరీరంలోకి ప్రవేశించినప్పుడు, భోగాలను అనుభవించినప్పుడు అజ్ఞానులు తెలుసుకోలేరు. కాని జ్ఞానదృష్టి కలవారు మాత్రమే వాటన్నింటిని చక్కగా తెలుసుకోగలరు. --భగవద్గీత* 🚩 

*లోకంలో శాశ్వతమైనదంటూ ఏదీలేదు. బంధుమిత్రులంతా మనలను ఏదో ఒక రోజు  వదలిపోవాల్సిందే.*

*చివరికి 'నేను.. నాది' అనే మమకారం పెంచుకున్న ఈ శరీరాన్ని కూడా మనం వదలిపోవాల్సిందే.*

*సంపద, అందం, అధికారం మనం పోయాక మనతో వచ్చేవి కావు.*

*మన మంచి చెడ్డల ఫలమే మనల్ని వెంటాడుతూ వస్తుంది.*

*మనిషి జీవితంలో తరువాత అనేదంటూ మన చేతిలో లేదు.*

 *ఉన్నదంతా ఈ క్షణమే.*

*కనుక మంచిని మాత్రమే చేయాలి. మంచినే ఆశ్రయించాలి.*

*నాస్తికత అనేది ఒక పెద్ద అంటువ్యాధి. దానిని దగ్గరికి రానివ్వొద్దు.*

*మన వలన పదిమంది సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.*

 *నిస్వార్ద పరులకే భగవంతుడు చిక్కుతాడు.*

No comments:

Post a Comment