Thursday, September 4, 2025

జీవ సమాధి రహస్యం 🌌✨

జీవ సమాధి రహస్యం 🌌✨

https://youtu.be/StMY0bVNL3s?si=A7J9pRax1blsPHBd


మనిషి జీవితంలో రెండు తప్పించలేని నిజాలు ఉన్నాయి. జననం మరియు మరణం ఈ రెండు మనిషి చేతిలో లేని సత్యాలు కానీ ప్రాచీన భారతదేశంలో కొన్ని మహాయుగులు మహాపురుషులు ఈ సత్యాన్ని తలకిందులు చేశారు వారు మరణం అనే పదాన్ని సవాలు చేశారు తమ శరీరాన్ని వదిలిపెట్టకుండా జీవ సమాధిలోకి ప్రవేశించారు. జీవ సమాధి అంటే ఏమిటి? అది ఎలా సాధ్యమైంది? ఈ రహస్యం తెలుసుకోవడానికి మనం ఈ రోజు ఓ అద్భుతమైన యాత్రకు బయలుదేరుదాం. అయితే సమాధి అంటే ఏమిటి? సాధారణంగా మనం సమాధి అంటే ఒక మృత దేహాన్ని గుర్తు చేసుకుంటాం. కానీ యోగ సంప్రదాయంలో సమాధి అనే పదానికి పూర్తిగా భిన్నమైన అర్థం ఉంది. సమాధి అంటే మనసు నిశ్చల స్థితి. మనిషి తన ఆలోచనలు, తన ప్రాణవాయువు, తన ఇంద్రియాలను సంపూర్ణంగా నియంత్రించి ఒక చైతన్యంలో లీనమయ్యే స్థితి. యోగులు దీన్ని సాధించడానికి ఎన్నో సంవత్సరాల తపస్సు చేస్తారు. ప్రాణాయామం, ధ్యానం, తపస్సు ఇవన్నీ సమాధి స్థితిని పొందటానికి మార్గాలు. అయితే జీవ సమాధి ప్రత్యేకత, ఇప్పుడు ప్రశ్న వస్తుంది. సమాధి సాధారణమైనది, అయితే జీవ సమాధి అంటే ఏమిటి? జీవ సమాధి అనేది ఒక అద్భుత స్థితి. ఇక్కడ యోగి తన శరీరాన్ని పూర్తిగా నియంత్రించి తన ఆత్మను విశ్వ చైతన్యంలో లీనం చేస్తాడు. కానీ ఆయన శరీరం మాత్రం మృతదేహం కాదు ఆ శరీరంలోనికి శక్తిని ప్రసరించే ఒక కేంద్రంగా మారుతుంది. ఇకపై ఆ యోగి కనపడకపోయినా ఆయన శక్తి, ఆయన ఆశీర్వాదం, ఆయన దివ్య స్ఫూర్తి, ఆ సమాధి చుట్టూ శాశ్వతంగా ఉంటాయి. ఇందుకే జీవ సమాధులు ఇప్పటికీ ఆలయాల దగ్గర ఆశ్రమాల దగ్గర కనిపిస్తాయి అయితే ప్రాచీన కాల ఉదాహరణలు కొన్ని ఉన్నాయి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి జీవ సమాధులు ఉన్నాయని తెలుసు అయితే తమిళనాడు సమీపంలో కొంతమంది మహాయోగులు జీవ సమాధులు కాంచీపురంలో ఉన్న దివ్య మునుల సమాధులు మరియు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొందరు యోగులు జీవ సమాధిలోకి వెళ్లారని పుస్తకాల్లో వ్రాయ రాయబడ్డాయి. భక్తులు చెబుతారు అలాంటి సమాధి దగ్గర కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది అక్కడ ధ్యానం చేయగానే అంతరంగంలో శాంతి ఒక శక్తి అనుభవిస్తారు. ఇవి కేవలం నమ్మకాలు కాదు. ఇవి యోగుల సాధన, శక్తికి ప్రత్యేక సాక్షాలు. ఒక యోగుల శక్తి రహస్యాలు కొన్ని ఉన్నాయి. ఇక మీరు ఒకసారి ఆలోచించండి. సాధారణ మనిషి తన శరీరాన్ని నియంత్రించుకోలేడు. ఆకలి వేస్తే ఆకలి తినాలి. అన్నం తినాలి. నిద్ర వేస్తే నిద్ర వస్తే నిద్ర పడుకోవాల్సిందే కానీ మహాయోగులు వేరు వారు తమ శరీరాన్ని ఒక యంత్రంలా మార్చుకున్నారు. హృదయం ఎప్పుడు కొట్టుకోవాలో శ్వాస ఎప్పుడు ఆగిపోవాలో ఇవన్నీ వారు తమ ఇష్ట ప్రకారం నియంత్రించగలరు. ఇది విన్నప్పుడు మనకు నమ్మచకం కాకపోవచ్చు. కానీ ప్రాణాయామం తపస్సు యోగబలం వలన ఇది సాధ్యమవుతుంది. అందుకే జీవ సమాధి అనేది కేవలం ఒక మతపరమైన విశ్వాసం కాదు అది ఒక శాస్త్రీయ ఆధ్యాత్మిక స్థితి. కొన్ని ఉదాహరణలకు ముని శిష్యుల సంభాషణ ఒకసారి ఈ విధంగా జరిగింది. శిష్యులు గురుదేవా మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నారా అప్పుడు ముని ఇలా అంటాడు లేదు బిడ్డలారా నేను వెళ్ళిపోవడం లేదు నా శరీరం ఇక నుండి ఒక శక్తి క్షేత్రంగా మారుతుంది మీరు నన్ను చూడలేరు కానీ మీరు నా శక్తిని అనుభవించగలుగుతారు అని చెప్తాడు. ఈ సమాధి వద్ద కూర్చుంటే మీరు శాంతిని పొందుతారు మీ మనసు నిశ్చలమవుతుంది నేను మీతోనే ఉంటాను శాశ్వతంగా అని చెప్తాడు. అయితే మానవ జీవితానికి ఒక పాఠం జీవ సమాధి మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ఈ శరీరం నశించేది కానీ ఆత్మ నశించదు. మరణం అనేది ఒక మార్పు మాత్రమే యోగులు ఆ మార్పును అంతిమ దశలో ఆపేశారు. శరీరాన్ని శక్తి కేంద్రంగా మార్చి తమ ఆత్మను విశ్వంలో కలిపేశారు. అందుకే జీవ సమాధి దగ్గరకు కూర్చుంటే మనకు శాంతి కలుగుతుంది. అందుకే జీవ సమాధి అనేది సనాతన ధర్మం యొక్క ఒక అమృత రహస్యం అయితే ఇదంతా విన్న తర్వాత జీవ సమాధులు మనకు చెబుతున్న సందేశం ఒక్కటే మరణం భయంకరం కాదు శరీరం మాయమవుతుంది కానీ ఆత్మ ఎప్పటికీ మాయమవ్వదు. మహయోగులు చూపించిన ఈ మార్గం మనిషికి శాశ్వతమైన శాంతి శాశ్వతమైన జ్ఞానం అందిస్తుంది. ఇదే జీవ సమాధి రహస్యం ఇలాంటి పురాణాల కథల కోసం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఇప్పుడే మన ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి, అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.

No comments:

Post a Comment