49e5;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నిరంతర భగవత్స్మరణం ఎలా సాధ్యం?*
➖➖➖✍️
```
సాధ్యమే! రోజూ ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. లేవగానే ఒక అయిదు నిమిషాలు భగవంతుణ్ణి ధ్యానించాలి.
స్నానం చేసే నీటిని గంగగా భావిస్తూ స్నానం చేయాలి. తరువాత కనీసం ఒక అరగంట పూజగదిలో ఒక నిర్దిష్టమైన చోట కూర్చుని మనకు వచ్చిన స్తోత్రాలు నోటికి రాకపోతే పుస్తకం చూసైనా చదువుతూ పూజ కానీ ధ్యానం కానీ చెయ్యాలి.
ఇంట్లో ఎటుచూసినా పడక గదిలో తప్ప దేవుని ఫోటోలు కనబడేలా ఉండాలి.
ఈశ్వరుడు అష్ట మూర్తి అని చెప్పారు. అంటే ఎనిమిది రూపాలలో ఉంటాడు.
*అవి మనం నిలబడే భూమి. మనకు పంటల ద్వారా ఆహారాన్ని సమకూర్చే భూమి. మనం దాహం తీర్చే మూడువంతులు నీరు గల భూమి. మనం కాలితో తన్నినా నీటి కోసం త్రవ్వినా, పంటల కోసం నాగళ్ళతో దున్నినా భరించే భూమి.
ఈ సంగతి ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞతతో ఉండాలి.
*రెండవది ప్రాణాధారమైన నీరు.మన శరీరాన్ని పరిసరాలను శుభ్రపరిచే నీరు.
*మూడవది గాలి. ప్రాణ వాయువు. ఒక రెండు నిమిషాలు గాలి పీల్చకపోతే ప్రాణం నిలవదు. అది శరీరంలో పది రకాలుగా పని చేస్తుంది. మలమూత్రాలు బయటకు పోవటానికి, ఆహారం అరగటానికి, ఆకలి పుట్టటానికి, దగ్గు తుమ్ము ఆవలింత అన్నింటికీ వాయువే కారణం.
*ఆహారం వండుకోవడానికి, కడుపులో జఠరాగ్నిగా ఉండేది అగ్ని.
ఇక మనమూ, మిగిలిన భూతాలకూ ఆశ్రయం ఆకాశం. అవకాశం. ఇది అయిదవది.
ఇవి ఒకదాని కంటే ఒకటి సూక్ష్మం.
*తరువాత మనకు వెలుగునిచ్చి, వర్షాలకు కారణమయ్యే సూర్యుడు.
ప్రత్యక్షదైవం.
*సస్యాలను అమృత మయం చేసే చంద్రుడు.
*ఇక చివరిది సృష్టిలో, జీవులలో చైతన్యం గా ఉండే పురుషుడు.
అంటే దేవుడు మనలో మనచుట్టూ ఉన్నట్లేగా!
ప్రహ్లాదుడు..```
*కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ దిక్కులన్*
*కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్*
*కలడోంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటన్*
*కలడీశుండు కలండు తండ్రి వెదుకంగా ఏల ఈయాయెడన్||*
```
అన్నాడు. కనుకనే అతడు ఏ పని చేస్తున్నా భగవంతుని చూడగలిగాడు.
అందుకే వీలు ఉన్నప్పుడల్లా రోజూ పురాణాలు చదవాలి.
ప్రవచనాలు వినాలి. కొంత కాలానికి అలవాటై రోజంతా భగవంతుని ధ్యానించటం అలవాటై పోతుంది.
ఎంతలా అలవాటు అవుతుందంటే రాత్రి నిద్రలో మెలుకువ వస్తే వెంటనే మనసు దేవుని వైపు మళ్ళి ఏదో స్తోత్రమో మంత్రమో అప్రయత్నంగానే అందుకుంటుంది.✍️```
ప్రయత్నించండి. శుభం భూయాత్
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
No comments:
Post a Comment