నీ అభీష్టమే నెరవేరుగాక..
అని మీరు అనుకున్న తర్వాత..
మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని
ఆయన ఇష్టానికే వదిలిపెట్టిస్తారు.
ఈ సృష్టిలో అన్ని సహజంగా జరుగుతున్నాయి.
నదులు సహజంగా పారుతున్నాయి.
సూర్యుడు సహజంగానే ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు.
ప్రకృతిని ఒకసారి మీరు గమనించండి
ప్రకృతిలో అంతా సహజంగానే జరుగుతుంది.
మరి మనం కూడా ప్రకృతిలో భాగమే కదా..
కాబట్టి మన జీవితం కూడా సహజంగానే జరుగుతుంది.
మన ప్రమేయం ఏమి లేకుండానే మన జీవితం ముందుకు వెళుతుంది.
కానీ అహంకారం వల్ల అన్ని మన తలపైనే వేసుకుంటున్నాం.
మంచి చెడులకు బాధ్యులుగా మనల్ని మనమే గుర్తుంచుకుంటున్నాం.
అన్నింటికీ కర్తలం మనమే అని మనం నమ్ముతున్నాం.
మనకు తెలియకుండానే మనం ఒక విష వలయంలో
చిక్కుకున్నాం.
కాబట్టి మనం చేయాల్సిన మొట్టమొదటి అని ఏమిటంటే
ఈ కర్తృత్వ భావనను వదిలిపెట్టాలి.
మీలో డూయర్ షిప్ (కర్తృత్వ భావన)
క్రమక్రమంగా తగ్గిపోయి..
మొత్తానికి పోవాలి.
ఎప్పుడైతే ఈ కర్తృత్వ భావన పోయిందో
అప్పుడు కర్మ సిద్ధాంతం మీపై పని చేయదు.
ఎందుకంటే అక్కడ కర్తనే లేడు కాబట్టి.
ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక విషయం.
అర్థం చేసుకుంటేనే అవగాహన వస్తుంది.
అవగాహననే ఒక గొప్ప జ్ఞానముగా మారుతుంది.
ఆ జ్ఞానమే మన జీవితాన్ని అద్భుతంగా రూపొందిస్తుంది.
--- సాక్షి వేణుగోపాల్.
No comments:
Post a Comment