Thursday, September 25, 2025

 ఒక కొడుకు తన తల్లిని ఇలా అడిగాడు.......

కొడుకు; అమ్మా! నాకు 18 సంవత్సరాలు వచ్చాక నాకేమిస్తావు?

ఆమ్మ; ఖచ్చితంగా మంచి బహుమతే ఇస్తాను......ముందు మంచిగా చదువుకుని
ప్రయోజకుడివి అవ్వు........ఇంకా చిన్నపిల్లవాడివేకదా!

కొద్దిరోజులు గడిచింది.......ఆ అబ్బాయికి జబ్బుచేసింది.....డాక్టర్లు అతను బ్రతకడం కష్టం అని చెప్పేశారు......

తల్లి తల్లడిల్లిపోయి తనబాధను తనలోనే దిగిమింగి బిడ్డదగ్గరికి వెళ్ళింది.......

కొడుకు; నేను చనిపోతానా అమ్మా! నాకు జబ్బు నయంకాదా!

తల్లి; నీకు ఏమీ కాదురా! నేను ఉన్నంతవరకు నీకు ఏమీ కానివ్వను రా చిన్నా!
అంటూ బిడ్డను హత్తుకుని ఏడ్చింది........

కొద్దిరోజులకు ఆ అబ్బాయికి జబ్బు నయం అయింది.......

అతనికి 18 సంవత్సరాలు
రానే వచ్చాయి.........

పుట్టిన రోజు ఆ అబ్బాయి తన తల్లి గదిలోకి వెళ్ళి తన అలమారాను వెతికాడు.......

అక్కడ అతనికి ఓ ఉత్తరం కనిపించింది.......

అందులో.....
"బాబూ! నీకు పుట్టినరోజు శుభాకాంక్షలురా ! నీకు మాట ఇచ్చిన ప్రకారం నీకు నేనుబహుమతిని ఇవ్వాలి.........అది నీకు ఎప్పుడో ఇచ్చేశాననే అనుకుంటున్నాను.......నీ ప్రాణానికి ముప్పు అని తెలిసి నేను బ్రతికి వుండటం వృథా అనుకుని నీకు నా గుండెను ఇచ్చేశాను..నా హృదయాన్ని నీకు ఇచ్చేసి
నీవు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థించాను.....నీ గుండెలోనే నేను ఉన్నానురా!

ఇంతకంటే మంచి బహుమతిని నీకు ఇవ్వడానికి నేను కడు పేదదానిని రా కన్నా!

నీవు సంతో్షంగా ఉండటానికి,బ్రతికి ఉండటానికి వేరే మార్గంలేకపోయింది."

తన తల్లి ఏదో ప్రమాదంలో చనిపోయిందని అనుకుంటున్న ఆ కొడుకుకు ఆ తల్లి
తనకోసం తన గుండెను దానంచేసిందన్న సంగతి తెలుసుకుని బోరు బోరున విలపిస్తూ......

అమ్మా! నాకు ఎన్ని జన్మలెత్తినా నీవే తల్లిగా కావాలని దేవుడిని కోరుకుంటున్నాను..........

నాగుండెలోనే నీవు నా దేవతగా నేను బ్రతికినంతకాలం నిన్ను పూజిస్తాను అమ్మా! అంటూ అమ్మ ఇచ్చిన గొప్ప బహుమతిని చేతితో తడుముకుంటూ ఉండిపోయాడు ఆ కొడుకు.......

దయచేసి తల్లి ఉన్నప్పుడే ఆమెను ఆప్యాయంగా చూసుకోండి.........ప్లీజ్.....

( సేకరణ )

No comments:

Post a Comment