Thursday, September 25, 2025

 నిజం నిద్ర బోతూ కూడా 
చెప్పవచ్చు..
వెతుక్కునే అవసరం లేదు కనుక..

అబద్ధాన్ని  మెలుకువ లో కూడా
ఆదమరచి చెప్పలేము...
మోసపు ధోరణి సమర్థింపు ని  అలవాటు చేస్తుంది.....

నిజాయితీ అనేది స్వాభావికం..
అబద్ధం అనేది వ్యక్తిగతం...
  
అబద్దం కంటే,
 నిజం గొప్పది,  
సమస్యలు ఎదురైనా,
 దారిని చూపుతుంది.  

నిజం పట్ల నిబద్ధత,  
జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తుంది...

శూన్యం లో కూడా నిలబడగలిగే
సత్తా నిజాయితీ కి ఉంటుంది ....

*అబద్ధాన్ని ఎందరు భుజాలపై మోసినా  తొణుకుతూనే ఉంటుంది...!!*

No comments:

Post a Comment