246వ భాగం
🕉️అష్టావక్ర గీత🕉️
అధ్యాయము 18
శ్లోకము 34
శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం|
ఆత్మానం తం న జానన్తి
తత్రాభ్యాసపరా జనాః||
అనేక సాధనలకు అభ్యాసాలకు అంకితమైన జనులు శుద్ధము ,జ్ఞాన స్వరూపము ,ప్రియమూ,పూర్ణము, ప్రపంచాతీతం, నిష్కలంకము అయిన ఆత్మ తత్వానుభూతిని పొందజాలరు.
ఈ శ్లోకాలను చూసి సాధన తో అవసరమే లేదని పొరపడకూడదు. సాధన చెయ్యకుండా సంసిద్ధత లేకుండా ఉన్న వారిని గూర్చే మహర్షి "మూఢ" అన్న పదాన్ని ప్రయోగించారు. అయితే సాధన మార్గమని ,ఆత్మా అనుభవం గమ్మమని సాధకుడు స్పష్టంగా తెలుసుకోవాలి .తరచుగా చాలామంది మార్గాన్నే లక్ష్యంగా పొరపడుతూ ఉంటారు .సామాన్య జీవితంలో ఇది సహజంగా సంభవిస్తుంది .సంపద సంతోషమయమైన జీవితానికి అవసరమైనదే ,అయితే బుద్ధిహీనులు మార్గాన్నే లక్ష్యంగా భావించే సంపదను సంపాదించడంలోనే నిత్యము ఆసక్తులై వారి లోబత్వముతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
ఆధ్యాత్మిక జీవితము పేరుతో మూఢత్వముతో అట్టి దుర్భరమైన జీవితాన్ని జీవించకు .భగవత్ భక్తి, సమాజ సేవ,శాస్త్ర అధ్యయనము,శ్రవనము, ధ్యానము నిధిథ్యాసన కూడా అన్ని మార్గాలే .అహంకారం చూపించే జాగ్రత్ప్రపంచ స్వప్నాన్ని దూరము చేసి మన సహజ స్వరూపాన్ని చేరుకోవటానికి ఇవన్నీ ప్రయోజన కారులే. ధ్యానములో ఏకాగ్రతను ప్రగతి సాధించిన సాధకులు అందరికీ ఈ హెచ్చరిక సముచితమైనది .మరి ఎంతో అవసరమైనది కూడా .ఒక మహా ఋషికి అంతటి మహనీయుడైన శిష్యుడు జనకునికి మధ్య జరిగిన సంవాదమే అష్టావక్ర గీత.కాబట్టే ఇందులోని వాదం అంతా ఇంతటి ఉన్నత స్థాయిలో ఉంటుంది .సాధన ప్రధమ దశలో ఉన్న సాధకులు ఇక్కడ పొరబడరాదు.🙏🙏🙏
No comments:
Post a Comment