🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(241వ రోజు):--
ఈ ప్రపంచపర్యటనలో 11 విశ్వ విద్యాలయాలు దర్శించాను ; 8 దేశాల యువవిద్యార్థులతో సంభా షించాను. 21 ఉపన్యాసపరంపరలు చేశాను. వాటిలో భగవద్గీత సందేశా న్ని వివరించటం, కొన్ని కేంద్రాల్లో ఒక ఉపనిషత్తును తీసుకొని పూర్తిగా అధ్యయనంచేయటం జరిగింది..
ప్రపంచమంతటా జరిపిన ఈ సేవాకార్యక్రమం ఇంతగాజయప్రదo కావటానికి నిజాయితీతోనూ, దీక్ష తోనూ పనిచేసిన వందలాది స్వచ్చం ద సేవకులూ, పోషకులూ, దయామ యులూ, విశ్వవిద్యాలయ అధికారు లూ, ఆయావిభాగాల ఆచార్యులూ కారణమని చెప్పాలి. వారందరికీ నేను కృతజ్ఞుడిని. మనకు ఈనాడు ప్రపంచమంతటా ఉన్న ఆలోచనా పరులనుంచి ఆలంబన లభిస్తోంద ని మన చిన్మయకుటుంబం గ్రహిం చాలి. దీనంతటికీ మనం సర్వేశ్వరు నికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ; ఆయన చూపినమార్గంలో దీక్షాబద్దు లమై పయనించడంకంటే కృతజ్ఞత తెలియజేయడానికి మరొక ఉత్తమ సాధనం లేదు. ఆయన నెరవేర్చాల్సి న కార్యాలకు ఇంకాఇంకా సమర్థ వంతంగా ఉపయోగపడేలా మనను మంచి పనిముట్లుగా తీర్చిదిద్దాలని ఆయనను ప్రార్థిద్దాం.
భారతదేశానికి బయట నిర్వ హించిన మొదటి ఆధ్యాత్మికశిబిరం 1973లో కాలిఫోర్నియా రాష్ట్ర కళా శాల, సోనోమాలో జరిగింది. భారత దేశంలో జరిపిన అటువంటి శిబిరా ల గురించి తెలిసిన అమెరికన్లు "ఇక్కడ కూడా ఎందుకు చేయకూడ దు?" అని అడిగారు. ఒక గురువుతో నిజమైన ఆశ్రమవాతావరణంలో కొద్దికాలంపాటైనా జీవించగలిగితే చాలా బాగుంటుందని వారికనిపిం చింది. వారి ఉద్దేశం ఈ శిబిరం ద్వారా నిజమైంది. శిబిరం సమాప్త మయ్యాక స్వామీజీ నిర్వాహకులకు వ్రాసిన జాబులో "ఈకార్యక్రమపు అంతరార్థం మీకుభవిష్యత్తులో బోధ పడుతుంది" అని వ్రాశారు.
1975లో శాన్ఫ్రాన్సిస్కోలో జరిగి న సర్వమత సమ్మేళనానికి స్వామీజీ సరిగ్గా కార్యక్రమం మొదలయ్యే సమ యానికి నేరుగా విమానాశ్రయం నుంచి వెళ్లగలిగారు. ఈ సమ్మేళ నాన్ని సూఫీ మతపు మహాత్ముడైన పీర్ విలాయత్ ఖాన్ నిర్వహించారు. సదస్సులో అడిగిన ప్రశ్నలన్నిటికీ, లైంగికవిషయాలతో సహా, స్వామీజీ ఇచ్చిన తెలివైన సమాధానాలు చాలామంది యువశ్రోతలను కూడా మెప్పించాయి. వారిలో 'గురువు' కోసం వెతికే ఒకగుంపు దక్షిణదిశలో 40 మైళ్ళ దూరంలోఉన్న పాలోఆల్టో లోని స్టాన్ఫోర్ట్ విశ్వవిద్యాలయంలో ఆనాటి సాయంకాలం స్వామీజీ ప్రారంభించనున్న ఉపన్యాస పరం పర ప్రారంభోపన్యాసానికి కూడా హాజరయ్యారు.
ఉపన్యాసం పూర్తయ్యాక, ఆయన పద్దతిని వివరించమని వారడిగిన పుడు, తన గంభీరమైన వైఖరిని ఆయన స్పష్టంచేశారు. "నాపద్ధతి ఏదో చెప్పమంటారా? ముక్కుమీద నిలబడి ధ్యానంచేయటమే నా పద్ధతి. కాని, దీన్ని ఒంటరిగా ఉన్న పుడే అభ్యసిస్తాన్నేను." చిలిపిగా నవ్వి, వెంటనే గంభీరస్వరంతో అన్నారాయన, "ఆధ్యాత్మికతకు దగ్గరిదారి కోసమో, క్షణికమైన మాన సికోల్లాసానికో మీరు ప్రయత్నిస్తుంటే ఇక్కడికి రావడంలో తప్పుచేశారు. ఈ తప్పు మళ్లీ చేయవద్దు : రేపు రావద్దు" ఈ సందేశం వారందరికీ అర్థమైంది. వారంరోజులపాటు సాయంకాలాల్లో భగవద్గీత 12 వ అధ్యాయం, ఉదయం కేనోపనిషత్తు పై ఆయన చేసిన ఉపన్యాసాలన్నిటి కీ వారంతా నియమం తప్పకుండా హాజరయ్యారు.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment