🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(243వ రోజు):--
స్వామీజీ ప్రారంభోపన్యాసం
ఈ పుణ్యదినాన ఒకగొప్ప స్వప్నం నిజం కాబోతోంది. ఈనాటిసాంకేతిక యుగపు యువతకు జీవితానికి అర్థ మేమిటో బోధించటంకోసం ఒక నూతన సంస్థను స్థాపించాలనే ఆలోచన 20 ఏళ్ళనాటిది. మానవు ని అంతఃకరణకు సంబంధించిన ఈ వేదాంతజ్ఞానం నిజానికి మనందరి జన్మహక్కు ; కాని, చరిత్రచే నెట్టబడు తూ ముందుకు సాగుతున్న సమా జంలో మనం మన వారసత్వమైన ఈ ఆత్మవిద్యనుంచి వేరుచేయబడి కోరికలపుట్ట అనే అరణ్యంలో మానా భిమానాలు లేకుండా నిరాశా దుఃఖా లతో దిక్కుతెలియకుండా తిరుగు తున్నాం.
ఇరవయ్యేళ్ళక్రితం ఈఆలోచన నాకు వచ్చినపుడు ఎవరూ దానిని పట్టించుకోలేదు. ఆఖరుకు మతాచా ర్యులు కూడా నన్ను వింతగాచూచి జాలిపడ్డారు, ఈ చురుకైన,తెలివైన యువకునికి పిన్నవయసులోనే ఎలా వచ్చిందా ఈ ఉన్మాదం అని.
చాలా ఏళ్ళు శ్రమపడాల్సి వచ్చింది - ప్రతిఘటనలు ఎదుర్కొం టూ, నిరసనలను సహిస్తూ, ఎన్ని ఆటంకాలు వచ్చినా బాధాకరమైన జడత్వాన్ని అధిగమించి నిర్భయం గా ముందుకు సాగుతూ. భారత దేశంలో మా ఘనవిజయాన్ని చూచి మతంలో ఎంతో నమ్మికఉన్నవారు కూడా ఆశ్చర్యపోయారు, అడ్డంకు లన్నీ ఎలా తొలిగిపోయాయోనని. భారతదేశంలోని మా హిందూసమా జంనుంచి చైతన్యవంతమైన భక్తి బ్రహ్మాండమైన ప్రవాహంగా ఉవ్వె త్తున లేచింది. ఆ మహాకెరటపు శిఖ రాన తేలుతూ చిన్మయమిషన్ అమెరికా ఖండాన్ని చేరి, చిన్మయ మిషన్ వెస్ట్ గా ఆవిర్భవించింది.
మీరంతా శ్రద్ధగా, నిస్వార్ధంగా, అంకితభావంతో, పూర్ణాహుతితో, చక్కని క్రమశిక్షణతో కష్టించి సాధన చేస్తారని ఆశిస్తున్నాం. మిమ్మల్ని
మారమని మేం కోరటంలేదు ; అంత రంగంలో మీకు కలుగుతున్న వికాసంవల్ల బాహ్యప్రపంచంలో కూడా మీరు ప్రవర్తించే వైఖరిలో కలుగుతున్న మార్పులను గమనించ మని మాత్రమే మిమ్మల్ని కోరుతు న్నాం.
మీరు పరిపూర్ణులు కావాలి; ఆ విధంగా మరెందరో పరిపూర్ణులు కావటానికి మీరు చేయూత నీయాలి.
—***—
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment