🦚జ్ఞానప్రసూనాలు🚩
13/10/2025
1) : సాధన అంటే?
తానెవరో జ్ఞప్తికి తెచ్చుకొనే ప్రయత్నం.
2) ఏదో ఒక కిరణాన్ని పట్టుకుని వెళితే సూర్యుణ్ణి చేరుకున్నట్టు ఏదో ఒక మార్గాన్ని పట్టుకుని వెళితే దేవుణ్ణి చేరుకోగలం.
3) దేనినీ నిర్వచించకుండా... ఉన్నదానిని ఉన్నట్టుగా... యథాతథంగా చూడడమే... దైవదర్శనం.
4) జీవితానికి ఏదో పరమార్థం ఉందనుకోవడమే జీవితంలో సంభవించే అన్ని సుఖదుఃఖాలకు కారణం.
జీవితానికి ఏదో పరమార్థం ఉందనే భావన వదిలేయగలిగితే, అదే నిజమైన జీవిత పరమార్థం.
5) సాక్షిగా తన జీవితాన్ని తాను చూడగలిగితే చాలు.
అంతకు మించి ఆధ్యాత్మికత లేదు.
6) వైరాగ్యం అంటే వదలటం కాదు. ఏ క్షణంలోనైనా వదలటానికి సిద్ధంగా ఉండటం.
No comments:
Post a Comment