🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(247వ రోజు):--
బ్రహ్మచారి హరిదాసు ఆయన్ను చూడటానికి కలకత్తా నుంచి వచ్చాడు. స్వామీజీ ఆరోగ్యం బాగుం డక పోవటంచేత ఎవరైనా ఒక బ్రహ్మ చారి ప్రయాణాల్లో ఆయనవెంట ఉండాలని సూచించాడు. "హుహ్! నా సంరక్షణా! ఏం కావాలి నాకు? అప్పుడప్పుడు ఓ కప్పుడు టీ మాత్ర మే కదా? నాకు టీ కాచడానికి దేశ మంతటా వందలాది స్త్రీలు పోటీ పడుతున్నారు. వీల్లేదు మీ బ్రహ్మచా రులంతా మీ పని కొనసాగించాల్సిం దే. మీ అవసరం ఎప్పటికన్నా ఇప్పుడే ఎక్కువగా ఉంది." అని ఆ సూచనను త్రోసిపారేశారు.
చాలామంది సభ్యులు ఆహ్వానిం చగా, ఆసుపత్రిలో ఉన్న స్వామీజీని చూడటానికి సత్యసాయిబాబా వచ్చారు. ఆయన ఇచ్చే విభూతి తరుచూ రోగాలను నయం చేస్తుం దనే ఖ్యాతి ఉంది. కాని, తను భగ వంతుని రక్షణలోనే ఉన్నాననీ, అంతా భగవంతుని పథకం ప్రకార మే జరుగుతుందనీ తెలిసిన స్వామీజీ విభూతి స్వీకరించడానికి అంగీకరించలేదు. ఆయనకు రోగ మన్నా, రోగబాధన్నా భయంలేదు.
ఎంతగొప్ప ఋషియైనప్పటికీ భౌతికంగా అతనిలో మానవుని అంశ, దేవునిఅంశ కూడా ఉంటా యి. భౌతికతత్వం ప్రకృతి న్యాయాన్ని అనుసరించాల్సిందే. జననం, పెరు గుదల, క్షీణించడం, మరణం - ఇవ న్నీ జరగాల్సినవే. అనారోగ్యం వంటి సామాన్యసంఘటనకు గొప్ప ఆధ్యా త్మిక వివరణ ఏదీ అవసరంలేదు. ఈ విషయాన్ని స్వామీజీ ఇలా వ్యక్తం చేశారు :
రోగం, బాధ శరీరానికి సహజ మైన లక్షణాలు. శరీరమున్న ప్రతి వాడూ వాటిననుభవించాల్సిందే. వీటిని ప్రశాంతంగానూ, ఆనందం గానూ అనుభవించడానికి మనకు ధైర్యం ఉండాలి. వ్యాధి నిర్మూలన కోసం ఎప్పుడూ ప్రార్థించకండి. భగవంతుడు ఎవరికైనా - తన శత్రువుకైనా సరే - తగినంత బాధ ను మాత్రమే ఇస్తాడు. దానిని భరించే శక్తినీ, దైర్యాన్నీ ఇమ్మని ప్రార్థించండి. భగవంతుని ప్రేమ కోసం తీవ్రంగా ప్రార్థించండి. ఎప్పు డూ, అన్ని పరిస్థితుల్లోనూ నవ్వుతూనే ఉండండి.
వైద్యుల నిర్బంధంవల్ల స్వామీజీ ఒక ఏడాదంతా వ్యాధినుంచి కోలు కోవడంలోనే గడిపారు. ఎన్నిపనులు తనకోసం వేచిఉన్నాయో అలోచించి నపుడెల్లా ఆయన మనసులో అలజడి చెలరేగేది. క్రమేణా, బాధ్య తలను ఇతరులకు అప్పగించడం మొదలుపెట్టారు. మద్రాసుకు చెంది న శ్రీ నటరాజ అయ్యర్ కు 1962లో స్వామీజీ సన్యాసదీక్ష ఇచ్చారు. ఆ విషయంలో ఆయన చాలా కఠిన మైన నిబంధనలు పాటించేవారు. అందుచేత, అటువంటిది చాలా అరుదైన సంఘటన. కాని స్వామీజీ కుడిభుజంగా చిన్మయమిషన్ ను పదేళ్ళపాటు విశ్వాసంతో సేవించి, ఏ సమస్యవచ్చినా పరిష్కరించ డానికి ముందుండటంచేత, నటరా జన్ విషయంలో కొంత సడలింపు సమంజసమే. ఆరోజుల్లో నటరాజన్ కు ఒక ఆరోగ్యసమస్య వచ్చింది. శస్త్రచికిత్సకు ముందుగానే దీక్షతీసు కోవాలని అనిపించిందాయనకు. అందుచేత దీక్షాకార్యక్రమం సాధార ణంగా జరిగేలా హిమాలయాలలో కాక, మద్రాసులో శ్రీ ఎం.సి. పెటాఛి గారి బెడ్ ఫోర్డ్ విల్లాలో జరిగింది. కోలుకున్నతర్వాత స్వామి దయా నంద (నటరాజ అయ్యర్) అధ్యయ నానికీ, నిష్ఠామయమైన జీవితానికీ హృషీకేశ్ పయనమై, అక్కడే చాలా కాలం గడిపారు.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment