Saturday, October 18, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

       మహర్షి యొక్క సన్నిహితమైన సేవకులలో వైకుంఠవాసులు అనే భక్తుడు ఒకరు. వైకుంఠవాసులు కొంతకాలం మహర్షికి సేవచేస్తూ వచ్చారు.

      ఒకరోజు వైకుంఠవాసులు మహర్షితో పాటు పడుకొని ఉన్నపుడు వైకుంఠవాసుల తలవద్దకు చాలా దగ్గరగ ఒక పెద్ద నాగుపాము వచ్చుట చూచిరి. ఆ పామును చూచినంతనే భీతి చెందిన వైకుంఠవాసులు కలవరముతో మహర్షి దగ్గరకు పరుగెత్తిపోయి భయకంపితులై నోట మాటరాక నోరు తెరుచుకొని అట్లే వ్రేలుతో ఆ పామును మహర్షికి చూపిరి.

     ఆ పామును చూచిన మహర్షి బడిపిల్లవానివలె ఎగిరిలేచి కూర్చొని సంతోషముతో "హా! ఎంత అందముగా ఉన్నది! ఓయ్ వైకుంఠవాసా! మీ పడక మిమ్ము వెతుక్కుంటూ తానుగానే వచ్చిందోయ్! ఎంత నున్నగా నిగ నిగ లాడుచున్నదో చూడు?" అని రెండు అర్థాలతో సెలవిచ్చారు. 

       మహర్షి యొక్క ఈ సమయోచితమైన చమత్కారపు మాటలను విన్న వైకుంఠవాసులకు భయము, ఒణుకు పోయి తాము కూడ ఆనందించారు.

    (నిజమైన వైకుంఠవాసులు విష్ణువునకు సహజమైన పరుపు శేషశయనము అయిన పామే కదా!)

No comments:

Post a Comment