🦚జ్ఞాన ప్రసూనాలు🚩
26/10/25
1) అల సముద్రం కోసం వెతికినట్లు వస్త్రం ప్రత్తి కోసం వెతికినట్లు కుండ మట్టి కోసం వెతికినట్లు జీవుడు దేవుని కోసం వెతకడం కూడా.
2) తలంపు రూపంగా ఉన్నది ఆత్మయే అని తెలుసుకుంటే తలంపులు వచ్చినా నీవు తలవని వాడివే అవుతావు.
3) క్షణాన్ని యుగంగా అనుభవించే జీవులూ ఉన్నాయి.
యుగాన్ని క్షణంగా అనుభవించే జీవులూ ఉన్నాయి.
ముక్తాయింపు ఏమంటే కాలానికి అసలు ఉనికే లేదు.
4) బోధల వలన బాధలు తొలగవు. బాధలే అసలైన బోధలు
5) ఈ సాధనలు భోదలన్నీ నీవు కాని దానిని పొగుట్టుకోవడానికే.
ఉన్నదాని కోసం ఏ ప్రయత్నమూ అవసరం లేదు.
6) జీవుడు - దేవుడు ఈ ఇద్దరూ కలిసి సహజీవనం చేయలేరు.
ఒకరుంటే మరొకరు ఉండరు.
7) తెలుసుకొనేది దేవుడు తెలియబడేది జీవుడు
తెలియబడే లక్షణం లేని దేవుడి కోసం తెలుసుకొనే లక్షణం లేని జీవుడు వెతుకుతున్నాడు.
No comments:
Post a Comment