Monday, October 27, 2025

 🦚జ్ఞాన ప్రసూనాలు🚩
27/10/25

1) జీవుడు ఈశ్వరుడైననూ 'జీవుని ' గా భావించుకొనుట భ్రాంతి వలన వచ్చినది.
త్రాడు మీద పాము అను భ్రాంతి కలిగినట్లు ఈ భ్రాంతికి కారణం ' మాయ'.

2) తనకు తాను తప్ప ఏమీ లేని, ఏమీ తెలియని కేవల స్వరూపం అత్యాశ్రమం.

3) 'జగత్తు మిథ్య' అన్నాక అలాంటి జగత్తులో దేవుడు ప్రత్యక్షమైతే ఆ దేవుడు జగత్తులో భాగమే కదా! ఆ దేవుడు కూడా మిథ్యే కదా!

4) నేను దేహం' అనుకోవడమే 'ఆత్మ' హత్య.

5) సన్న్యాసం అనేది అంతరంగిక విషయం. బాహ్య విషయం కాదు.

6) అంతరిక్ష పరిశోధనల వలన ప్రయోజనం లేదు.
చేయవలసింది అంతర్వీక్షణం. అంతరిక్షానికి బీజం నీలోనే ఉంది. పరిశోధించవలసింది నీలోనే.

No comments:

Post a Comment