*కార్తీక మాసంలో* *కృష్ణుడి వన భోజనం*
ఎవరూ మరచిపోలేనంత గొప్ప వన భోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బలరాముడు , ఇతర స్నేహితులతో - ఓరేయ్ , రేపు మనమందరం వనభోజనానికి వెళుతున్నాం రా ! అన్నాడు. వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికే. ప్రతి రోజూ మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అలాంటి వాళ్లకు కొత్తగా వన భోజనం ఎందుకు ? ఎందుకంటే - వన భోజనం ఎలా ఉంటుందో రుచి చూపించాలనేది ఆయన ఉద్దేశం. అందరూ పొద్దున్నే లేచారు. గోపాల బాలురకి ఉండే లక్షణం ఏమిటంటే , వాళ్ళు ఉదయం స్నానం చేయరు. సాయంకాలం వచ్చి స్నానం చేస్తుంటారు. అందుకే వారు ఎప్పుడూ చద్ది అన్నమే తింటారు. ప్రతి రోజు మాదిరిగానే అన్నం మూటకట్టుకొని వన భోజనానికి వెళ్దాం పదండి అని బయలుదేరారు. అక్కడ కృష్ణుడు చూపించిన లీలలు ఒకటా రెండా !
అందుకే వనం అంటే బ్రహ్మం కాబట్టి.. బ్రహ్మాన్ని అరిగించడం.. అంటే కృష్ణభగవానుడి లీలల్ని ఆస్వాదించటమే వన భోజనం. ఆ వన భోజనంలో ఏ అర మరికలూ లేవు. గోపాలురు కృష్ణుడితో తాదామ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళీ ఆ ఉసిరి చెట్టు కింద , తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని , పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి , అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని , ఆ ప్రకృతి అన్రుగహాన్ని , పరమాత్మ అన్రుగహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వన భోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు.
*ముక్తికే కాదు సమైక్యతకు , చక్కని ఆరోగ్యానికి*
ఇలా చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు , ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీరారోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది. ఈ ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం , ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. ధాత్రీ వృక్షాల నీడన అరటి ఆకుల్లో కానీ , పనస ఆకుల్లో కానీ పలు వృక్ష జాతులున్న వనంలో ప్రధానంగా ఉసిరి చెట్టు కింద భక్తితో భుజిస్తే ఆశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని వేద , పురాణాల వచనం.
*ప్రజల్లో ఆత్మీయతానురాగాలు*
ఇలా వనభోజనం చేయడంవల్ల ఆధ్యాత్మిక ఫలితాలు , ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయతానురాగాలు పెంపొంది సామాజిక సామరస్యతకు , సమైక్యతకు దోహదం చేస్తుంది. ఆనందానికి సంకేతం పచ్చదనం , దాన్ని పంచుకుంటూ ఆనందాన్ని మనసులో నింపుకొంటూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో , నృత్య గీతాలతో ఆనందంగా గడుపుతారు. వనంలోకి వెళ్ళీ ఆ ఉసిరి చెట్టు కింద , తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని , పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి , అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని , ఆ ప్రకృతి అన్రుగహాన్ని , పరమాత్మ అన్రుగహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడాన్ని వన భోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు.
No comments:
Post a Comment