దయచేసి హిందూ బంధువులు అందరికి విజ్ఞప్తి : కుల వన భోజనాలలో పాల్గొనకండి మరియు ప్రోత్సహించకండి.
ఆధ్యాత్మిక సంతోషం మరియు భక్తి ఉత్సవాలతో నిండిన దివ్యమైన వనభోజనములలో పాల్గొనండి.
ఈరోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో కుల వనభోజనాల సందడి మొదలవుతుంది.
కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆహ్లాదకరంగా సాగే వనభోజనాలు మన సంప్రదాయాలను చాటిచెబుతాయి. బంధువులు, స్నేహితులతో కలిసి చెట్ల నీడలో భోజనం చేయడానికి పెద్దలు ఈ వనభోజనాలను ఏర్పాటు చేస్తారు. అయితే ఈ వనభోజనాలు రానురాను కుల భోజనాలుగా మారిపోయాయి. కుల సంఘాల పేరిట భారీ ఎత్తున వనభోజనాలను నిర్వహించడం సంప్రదాయంగా మారిపోయింది. దీనికి రాజకీయ పార్టీలు తోడవడంతో వనభోజనాలు కాస్త ‘కుల భోజనాలు’గా రూపాంతరం చెందే పరిస్థితి వచ్చేసింది.
ఓ కుల సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలు జరిగితే అదే కులానికి చెందిన రాజకీయ నాయకులంతా అక్కడ వాలిపోతారు. అసలు కుల రాజకీయాల చర్చకు వన భోజనాలు వేదికలు అవుతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
దయచేసి నిజమైన హిందూ బంధువులు ఎవరు కూడ కుల వనభోజనాలు ఏర్పాటుచేయొద్దని మరియు కుల భోజనాలు ప్రోత్సహించవద్దు అని హనుమాన్ దళ్ విజ్ఞప్తి చేస్తుంది🙏.
No comments:
Post a Comment