Saturday, October 18, 2025

 🕉️ *జై శ్రీమన్నారాయణ* 🕉️


*_🌴భారతదేశం ఒక యోగభూమి, కర్మభూమి. ఇటువంటి పవిత్ర భూమిని నేడు కొందరు విష సంస్కృతి పేరుతో యోగభూమిని భోగభూమిగా మార్చటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ తగని పని. మనకు ఆ భోగమే వద్దు. భోగము రోగములకు దారితీస్తుంది. త్యాగమే యోగాన్ని చేకూర్చుతుంది. కాబట్టి, త్యాగభావంతో మనం  భగవంతుడు ఇచ్చిన సకల శక్తులను సమాజానికి అర్పితం చేయాలి. సోమరితనం వీడి పని చేయడం అలవాటు చేసుకోవాలి. చేతి నిండుగా పని, మనసు నిండుగా మంచి భావాలు పెట్టుకోవాలి. అలాంటివాడే నిజమైన మానవుడు కాగలడు. అలాంటివాడే దైవానుగ్రహానికి పాత్రుడవుతాడు..🌴_*

No comments:

Post a Comment