*@ ఈ కళ మీకు తెలుసా..?@61
తేది:12/10/2025
"""""""""""""""""""""""""""""""""""""""""""
'లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్' అన్నది మనందరికీ తెలిసిందే
అయినా సరే నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే 'అది
లేకపోతే ఎలా, ఇది కావాలి కదా?అనుకుంటూ మనిషికి
రెండు సూట్కేసులు సిద్ధం చేసుకుంటాం సామాను సరే, బస్సో
రైలో మోస్తుంది కానీ మనసు మోసే బ్యాగేజ్ సంగతో..?
అవును,జీవన ప్రయాణంలోనూ మనం నిత్యం అవసరానికి
మించిన లగేజీని మోస్తున్నాం దాన్ని ఎంతగా తగ్గించుకుంటే
మనసుకు అంత తేలికగా ఉంటుంది అంటున్నారు
ది ఆర్ట్ ఆఫ్ బెట్టింగ్ గో' అనే పుస్తక రచయిత నిక్ ట్రెంటన్, అనవసర
ఆందోళనలను ఎక్కడికక్కడ వదిలించుకుంటేనే సంతోషం
మీ చిరునామా అవుతుంది చేయాలనుకున్న పనులూ సాధించాలనుకున్న విజయాలూ సొంతమవుతాయి...అంటున్న నిక్
అందుకేం చేయాలో ఒక మంచి స్నేహితుడిలా ఈ పుస్తకంలో వివరించారు
ఒక ఓటమి, మోసం,
నమ్మకద్రోహం, ఎడబాటు,మరణం...
అనుభవంలోకి వస్తాయి మనసులో తిష్ఠవేస్తాయి
పదే పదే
గుర్తొస్తూ బుర్రను తొలిచేస్తాయి ఒంటికి తిండి సహించదు కంటికి నిద్ర పట్టదు ఎందుకిలా? మర్చిపోదా
మన్నా మరపునకు రావే? మనిషన్నాక
ఇలాంటి అనుభవాలు మామూలే
వాటినలా ఒకదానిమీద ఒకటి పేర్చుకుంటూ మనసుపై మోయలేనంత
భారం మోపుతున్నాం దాని ప్రభావం
పనితీరును, ఆరోగ్యాలను దెబ్బతీస్తోంది...
మర్చిపోవాలని అనుకోవడమే
THE ART OF
LETTING GO
Move Beyond the Hurt,
Find Emotional Freedom,
and Restore Your Inner Peace
NICK TRENTON
కానీ నిజంగా మర్చిపోయే ప్రయత్నం చేయం అన్నది నిక్
విమర్శ జీవితమన్నాక రకరకాల వ్యక్తులు తారసపడతారు...
విభిన్న అనుభవాలు ఎదురవుతాయి వాటిలో మనకు కావాల్సిన
వాటిని మాత్రమే దాచుకుని మిగిలినవాటిని వదిలెయ్యాలట...
తలుపు తెరవగానే ఎగిరిపోవడానికి అవేమన్నా పక్షులా..? మనం
పట్టుకు వేలాడుతున్న జ్ఞాపకాలు కదా...
అంత త్వరగా వదలవు
వదిలించుకోవడానికి చాలానే కష్టపడాలనీ, పడమనీ, పడినందుకు ఫలితం ఉంటుందనీ హామీ కూడా ఇస్తున్నారు నిక్...
మనసు మనదే కానీ ఎందుకో ఎప్పుడూ వేరే వాళ్ల గురించే
ఏడుస్తుంటుంది అని వాపోతాడో సినీ కవి మనసు మన స్వాధీనంలో ఉంటే ఆ పరిస్థితి రాదు అందుకు నిక్ చెబుతున్న
సలహా 'డైకాటమీ ఆఫ్ కంట్రోలిని సాధన చేయమని
జీవితంలో ఆలోచనలు, నిర్ణయాలు, స్పందనలు లాంటి కొన్ని
మాత్రమే మన అదుపులో ఉంటాయి మిగతావి మనుషులు,
వారి ప్రవర్తనలు, వాతావరణం, గతం,ఇలాంటి వాటిని
మనం నియంత్రించలేం ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం
పోతుందా అనో పాటలో చెప్పినట్లు మన అదుపులో లేనివాటి
గురించి తలచుకుని తలచుకుని బాధపడి ప్రయోజనమేంటి..?
నిజానికి ఎదురైన పరిస్థితి వల్ల కాదు, దాన్ని ఉన్నదున్నట్లుగా
స్వీకరించకుండా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం వల్లే
బాధ తీవ్రమవుతుంది అంటారు రచయిత ఎండావానల్ని ఎంత
తిట్టుకున్నా ఆపలేం కాబట్టి గొడుగేసుకుని మన పని మనం
చేసుకుంటాం అన్ని విషయాల్లోనూ అదే సూత్రం ఫాలో
అవ్వాలి అలాగే అన్నిటికీ వెనక్కి లాగే మనసును నియంత్ర
ణలో ఉంచుకోవడం, ఉద్వేగాలకు లోనుకాకుండా తీర్పరితనానికి
దూరంగా ఉండటం, అనవసర భయాలను వదిలించుకోవడం,
వర్తమానంలో జీవించడం... ఇలాంటి ఎన్నో సూచనలను ఉదా
హరణలతో వివరిస్తారు నిక్... ఒక్కమాటలో చెప్పాలంటే
'ఆర్ట్ ఆఫ్ బెట్టింగ్ గో' అనేది ఇంటి బూజు దులిపినట్లు,మనసు
బూజు దులపడం అన్నమాట అప్పుడే అది దూదిపింజలా
తేలికై స్వేచ్చగా ఉంటుంది...*
No comments:
Post a Comment