Monday, October 13, 2025

 కళింగ యుద్ధం తరువాత అశోకుడు యుద్ధాన్ని విడిచిపెట్టి, బౌద్ధమతాన్ని స్వీకరించి, ధర్మాన్ని ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే. అయితే, అశోకుడి జీవితంలో ఒక రహస్యమైన సంఘటన ఉంది, అది ఈనాటికీ ఆసక్తికరంగా ఉంది.

కళింగ యుద్ధంలో జరిగిన అపారమైన ప్రాణ నష్టాన్ని చూసిన అశోకుడు, మానవాళికి విపత్తును కలిగించే జ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆయన ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేశాడని పురాణాలూ, కొన్ని కథనాలూ చెబుతాయి. అశోకుడు తొమ్మిది మంది అత్యంత తెలివైన, విశ్వసనీయ వ్యక్తులను ఎంపిక చేసి, వారికి ఒక్కొక్కరికీ ఒక ముఖ్యమైన 'విజ్ఞాన పుస్తకాన్ని' లేదా రహస్యాన్ని అప్పగించాడు.

ఈ తొమ్మిది మంది తమకు అప్పగించిన జ్ఞానాన్ని రహస్యంగా ఉంచడానికి మరియు దానిని దుర్వినియోగం కాకుండా కాపాడటానికి నిరంతరం కృషి చేసేవారు. ఈ రహస్య సంఘం తరతరాలుగా కొనసాగుతూ, నేటికీ ఆ తొమ్మిది పుస్తకాలు లేదా రహస్యాలు జాగ్రత్తగా ఉంచబడుతున్నాయని నమ్మకం.

ఈ తొమ్మిది పుస్తకాలలోని రహస్యాలు ప్రతి పుస్తకం ఒక ప్రత్యేకమైన విజ్ఞాన రంగానికి చెందింది.

1) యుద్ధ విజ్ఞానం (Warfare/Propaganda)

2) గురుత్వాకర్షణ (Gravity)

3) సూక్ష్మజీవశాస్త్రం (Microbiology)

4) రసవాదం (Alchemy)

5) సమాచార వ్యవస్థ (Communication)

6) సమయాన్ని నియంత్రించడం (Time Travel)

7) కాంతి విజ్ఞానం (Light)

8) ఆకర్షణ శక్తి (Hypnosis/Telepathy)

9) వస్తు నిర్మాణ శాస్త్రం (Architecture/Engineering)

ఈ తొమ్మిది మంది వ్యక్తులు మరియు వారి రహస్య పుస్తకాల కథలు పూర్తిగా నిరూపించబడనప్పటికీ, ఇవి భారత చరిత్రలోని అత్యంత ఆసక్తికరమైన మరియు మిస్టరీ నిండిన అంశాలలో ఒకటిగా మిగిలిపోయింది.        

No comments:

Post a Comment