*"ప్రేమ – బంధం – బాధ్యత"*
*పెళ్లికి ముందు, మగవాడు స్త్రీని శరీరంగా చూసి* *ఆకర్షితుడవుతాడు.*
*పెళ్లి తర్వాత, ఆమెను* *అనుభవించి ఆనందిస్తాడు.*
*కానీ పిల్లలు పుట్టాక బాధ్యతల బారం పెరిగేకొద్దీ,*
*అదే ప్రేమ మసకబారుతుంది*
*సందర్భం లేకుండా కోపం, విసుగు, అసహనం పెరుగుతాయి.*
*అప్పుడు కొందరు భర్తలు,*
*పెళ్లాన్నే తమ జీవితానికి భారమని భావించి,*
*ఆమెతోనే దూరమవుతారు.*
*కానీ భార్య మాత్రం*
*ఇంటి తాపాన్ని, బంధాల తూలికలను సర్దుకుంటూ,*
*ప్రతి నిశ్వాసంలో కుటుంబం కోసం త్యాగం చేస్తుంది.*
*అదే అసలైన ప్రేమ, అదే బాధ్యత.*
*ప్రేమ అంటే కనిపించేది కాదు,*
*కలిసి సాగిపోవడం ప్రతి రోజు కొత్తగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం.*
*భార్య అనేది సాధారణ పదం కాదు,*
*ఆమె మనసు ఒక సముద్రం,*
*ప్రేమ, సహనం, మౌనంలోని తుఫాన్లతో నిండినది.*
*మగవాళ్లలో కొందరికి ఆ లోతు అర్థమవ్వడానికి సంవత్సరాలు పడతాయి.*
*అర్థం అయ్యేలోపు అనవసరమైన గొడవలు, బాధలు పెరుగుతాయి.*
*అందుకే కొన్నిసార్లు మౌనం ప్రేమకంటే గొప్ప సమాధానం.*
*ఇద్దరూ భవిష్యత్తును ఒకరికి ఒకరు తోడుగా చూశారంటే,*
*ఆ బంధం ఎప్పటికీ చెదరదు.*
*ఇండియన్ కల్చర్ మనకు నేర్పింది అదే.*
*సర్దుకు పోవడం, నిలబెట్టుకోవడం, ప్రేమను జీవితం చేయడం.*
No comments:
Post a Comment