Saturday, October 18, 2025

కర్మ ఎవ్వరినీ..వదిలి పెట్టదు!!|#fate #motivation #trending #society #viral #life #motive

కర్మ ఎవ్వరినీ..వదిలి పెట్టదు!!|#fate #motivation #trending #society #viral #life #motive

https://youtube.com/shorts/GP6pm-pXDys?si=mYk9Z3hFxd5o6i75


హాయ్ అండి కర్మ ఎవరిని అంత తేలికగా వదిలిపెట్టదండి ఇది మాత్రం నిజం మన భారతీయ చరిత్రలో చూసుకుంటే గనుక డబ్బు వ్యామోహంలో పడి రాజ్యాల వ్యామోహంలో ఆస్తుల వ్యామోహంలో పడి ఎంతోమంది రాజులు నాశనం అయిపోయారు అన్నమాట రాజ్యాలను కూడా నాశనం చేసుకున్నారు. ఇది అలా ఉంచితే ఇదంతా తెలిసి కూడా ఇప్పటి మనుషులకి ఇంకా బుద్ధి రాలేదు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే కొంతమంది ఇళ్లల్లో చూసుకుంటే గనుక ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉంది మన చరిత్రలు తెలుసు వెనకటి వాళ్ళు ఎలా నాశనం అయిపోయారో తెలుసు అయినా కూడా వాళ్ళ బుద్ధి అయితే మారట్లేదు అన్నదమ్ముల గొడవలు ఆస్తుల గొడవలు ఎవరో మెతకుగా ఉంటే వారిని మోసం చేయడం నమ్మక ద్రోహం చేయడం ఆస్తులు కొట్టేయడం ఇవే జరుగుతున్నాయండి ఎందుకంటే డబ్బు వ్యామోహం డబ్బు పిచ్చి ఆస్తుల పిచ్చి అలాగే కొంతమంది ఇళ్లల్లో ఇంకా ఇది ఇంకా ఘోరమండి భర్త చనిపోగానే అంటే వాళ్ళ కొడుకులు చనిపోగానే కొడుకు భార్యని పిల్లల్ని పట్టు బట్టలతో ఇంట్లో నుంచి గెంటేసి వాళ్ళకి వచ్చిన వాటాలు కూడా కొట్టేసేద్దామని మొత్తం చక్కపెట్టేద్దామని చూస్తున్నారుఅన్నమాట భగవంతుడు ఉన్నాడని తెలుసు కర్మ ఎవరిని వదిలిపెట్టదని తెలుసు మళ్ళీ అందరికీ శ్రీరంగ నీతులు చెప్తారు వాళ్లే మరి ఏదో ఒక రోజున నువ్వు కూడా కర్మ అనుభవిస్తావు కదా ఇంత అన్యాయం చేసినవాళ్ళు ఎలా బాగుపడతారు ఆ ఉసిరి ఊరికే పోదు కదా ఆ ఉసిరి నీకు తగులుద్ది నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా హరించేస్తది. చిన్న ఉదాహరణకి వెళ్తేనండి మన మహాభారతంలో పాండవులు కౌరవుల మధ్య వైరం ఎంత హోరాహోరీగా జరిగిందో మనందరికీ తెలుసు అందుకనే ప్రతి పిల్లవాడికి మహాభారతం రామాయణం ఇటువంటి ఇతిహాసాలు భగవద్గీత ఇవన్నీ నేర్పాలి చెప్పాలి అంటారు. ఇప్పుడు టాపిక్ లోకి వస్తే గనుక వారి మధ్యన వైరం ఎలా ఉండేది? ఇక్కడ పాండవుల్ని అమాయకులని చేసి వారిని హేలనగా చూసి అనుక్షణం అవమానిస్తూ వారిని బలహీనులుగా చేసి వారికి వచ్చిన రాజ్యాలని వీళ్ళు ఆక్రమించుకొని ఆఖరికి ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగే వరకు తీసుకొచ్చారండి ఇది సాక్షాత్తు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు ఆపినా కూడా ఆగలేదన్నమాట ఎందుకంటే ఈ విధి లిఖితం రాసిపెట్టి ఉంది ఆఖరికి పాండవుల చేతిలో కౌరవులు సంహరించబడ్డారు. పుత్రులు చెడుదారిలో వెళ్తున్నారని కూడా ధృతరాష్ట్రుడు దాన్ని యుద్ధాన్ని ఆపలేకపోయాడు ఇంకా ప్రోత్సహించాడు కసితో రగిలిపోయాడు దానికి ఫలితం ఏమైందంటే పాండవుల చేతిలో దృతరాష్ట్రుడి ఈ 100 మంది కుమారులు మరణించారు ఆ తర్వాత కూడా భీముడి చేతి మీద అంటే పాండవులు సహాయం కోరుతూ పాండవులు పంచన పడి ఉండి దృతరాష్ట్రుడు భీముడి చేతి మీద నెత్తిడి కూడు రక్తం ముద్దలు తిన్నాడు అంటే ధృతరాష్ట్రుడికి 15 ఏళ్ళు భోజన సదుపాయాలన్నీ పాండవులే చూశారు భీముడే అన్నం తినిపించేవాడంట మరి ఆ పరిస్థితిలో ఉన్న తండ్రికి భీముడి చేతి మీద నెత్తుడు కూడి తింటున్నట్టే ఉంటదండి ఇదంతా ఏంటి కర్మ ఇలాంటి కర్మ ఎవరికీ రాకూడదు తన కొడుకుల్ని చంపిన వాడినే వాడి చేతుల మీదే వీడు కూడు తింటున్నాడు అటువంటి గతి పట్టించాడు భగవంతుడు అందుకనే అందరూ ఒకసారి ఆలోచించండి మంచి చెడులు ధర్మం నీతి న్యాయం ఇవన్నీ ఎందుకు చెప్తారో ఒకసారి ఆలోచించండి ధర్మం మీద వెళ్ళండి ఎవరిని మోసగించద్దు ఎవరిని హింసించొద్దు ఎవరిని కనీసం ఒక్క మాట కూడా అనొద్దు మనిషి అత్యాస వ్యామోహాన్ని ఆ కోరికలని వదిలిపెడితే ఎటువంటి పొరపాటు జరగదు మీతో పాటు మీ కుటుంబం కూడా చల్లగా ఉంటుంది పది కాలాలు పచ్చగా ఉంటుంది ఇది ఒక్కసారి అందరూ ఆలోచించండి ఈ వీడియో చాలా విలువైన అందరికీ షేర్ చేయండి.

No comments:

Post a Comment